Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ ఏడుస్తుంటే విహారి వచ్చి నువ్వు ఓకేనా అని అడుగుతాడు. దాంతో లక్ష్మీ మీ సంతోషం కోసం ఓకే అని చెప్పాలి అని ఉందని కానీ మనసులో బాధ ఆ మాట చెప్పనివ్వడం లేదని ఏడుస్తుంది. అన్నీ చెప్పాను కదా లక్ష్మీ ఇది నీ కోసం నీ బతుకు కోసం నీ భవిష్యత్ కోసం అని చెప్తాడు.
లక్ష్మీ: ఇప్పటి వరకు నేను ఎదుర్కొన్న కష్టాలతో పోల్చితే ఈ మంగళ సూత్రం నాకు బరువు కాదు.
విహారి: ఈ మంగళసూత్రం నీకు బరువు కాకపోవచ్చు కానీ ముందు ముందు నీ గుండెల మీద నీ బరువు పెరుగుతుంది. అది నీ బతుకుని ఓ ప్రశ్నార్థకంగా మారుతుంది.
లక్ష్మీ: ఈ తాళి నా మెడలో నుంచి తీసేస్తే నా బతుకు బాగుపడుతుందని అనుకుంటున్నారా.
విహారి: ఎంత మారుతుందో తెలీదు కానీ ఇప్పుడు నువ్వు బతుకుతున్న బతుకు అర్థవంతం లేనిది జీవితాంతం నువ్వు అలా బతకడం నాకు ఇష్టం లేదు.
లక్ష్మీ: వేదమంత్రాల సాక్షిగా ఇది మీరు నాకు కట్టిన తాళి విహారి గారు.
విహారి: ఆ వేదమంత్రాలకు విలువ ఉందికానీ నేను కట్టిన తాళికి విలువ లేదు. ఆ మూడు ముళ్లు నీ జీవితాన్ని నిలువుగా ముంచేస్తున్నా నువ్వు ఇలా మాట్లాడటం బాలేదు.
లక్ష్మీ: విహారిగారు ఏ అమ్మాయి ఒకసారి మెడలో పడిన తాళిని తీయాలి అనుకోదు. ఈ మంగళసూత్రం పొరపాటున కింద పడితేనే అమంగళంలా భావిస్తారు. అలాంటిది భర్తే తాళి తీసేస్తా అంటే ఇంకెలా ఉంటుందో చెప్పండి.
విహారి: భార్యాభర్తలు కలిసి ఉంటేనే అవన్నీ అప్పుడే ఆ మంగళ సూత్రానికి విలువ. మన మధ్య అనుకోకుండా ఏర్పడిన బంధం మనల్ని కలిసి ఉంచలేదు. ఆ విషయం మనకు బాగా తెలుసు. అలాంటప్పుడు అర్థం లేని ఆ మంగళ సూత్రం నాకు తప్పు అని అనిపిస్తుంది. దాని వల్లే నువ్వు ఇంకో జీవితం గురించి ఆలోచించడం లేదు. నా నిర్ణయాన్ని నువ్వు గౌరవించకపోతే నా మీద ఒట్టే. నేను అనుకున్నది జరగాల్సిందే.
విహారి లక్ష్మీని తీసుకొని తాళి తీయడానికి ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్తాడు. ఇక అంబిక విహారి ఆచూకి తెలీక రోడ్డు మీద తిరుగుతుంటుంది. కనిపించిన అందరిని అడుగుతుంటుంది. ఇక సహస్ర అంబిక పిన్ని కనిపించడం లేదని అనుకొని సహస్రకి కాల్ చేస్తుంది. విహారిని ఫాలో అవుతూ వచ్చానని అంటుంది. దానికి సహస్ర విషయం విహారికి తెలిస్తే పెద్ద గొడవ అవుతుందని ఇంటికి వచ్చేయ్ మని చెప్తుంది. అంబిక సరే అంటుంది. విహారి కార్యక్రమం దగ్గరకు వెళ్లి పంతులుతో కార్యక్రమం మొదలు చేయమని అంటాడు. దానికి పంతులు తాళి కట్టడానికి మంత్రాలు ఉంటాయి కానీ తాళి విప్పడానికి మంత్రాలు ఉండవు అని ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు అని మీ జంటని విడదీసే పాపపు పని చేయను అంటాడు. దానికి విహారి ఒకరి జీవితం బాగుపడుతుంది అంటే తప్పు కాదు అంటాడు.
మరోవైపు అంబిక మొత్తం తిరిగి చివరకు విహారి వాళ్లు ఉన్న గుడికి వస్తుంది. విహారి ఎంత చెప్పినా పంతులు నువ్వు అమ్మాయికి న్యాయం చేయాలి అనుకున్నా సరే నేను ఏం చేయను అంటాడు. దాంతో విహారి నేనే తాళి విప్పేస్తా అంటాడు. అంబిక గుడిలో తిరుగుతుంటుంది. లక్ష్మీ ఏడుస్తుండగా విహారి తాళి విప్పడానికి రెడీ అవుతాడు. ఇంతలో లక్ష్మీకి కుంకుమార్చన వ్రతం చేయమన్న సాధువు ఆపండి అని ఎంట్రీ ఇస్తారు. విహారి తాళి విప్పకుండా ఆగిపోతాడు. ఆమంగళానికి ఇది ఆరంభం అని అంటారు. దాంతో లక్ష్మీ, విహారి షాక్ అయిపోతారు. నువ్వు చేస్తున్న పని తప్పు.. దైవ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నావ్ అంటారు. విహారి రెండు చేతులు జోడించి దండం పెట్టి అమ్మాయి జీవితం బాగుపడాలి అని సంకల్పం మాత్రమే ఉందని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్, దీపల ధర్నా - జ్యోత్స్న మీద తాత సీరియస్.. తల వంచిన దశరథ్!