Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్ర విహరి తండ్రిని అనడంతో యమున కొట్టడానికి చేయి ఎత్తుతుంది. ఇంతలో పద్మాక్షి వచ్చి నా కూతురినే అంటావా అని తిడుతుంది. దాంతో యమున నా భర్త, కొడుకుని ఎవరు ఏమన్నా నేను ఊరుకోను అని అంటుంది. దానికి పద్మాక్షి యమునతో అవన్నీ వదిలేయ్ కానీ లక్ష్మీకి కచ్చితంగా ఈ పెళ్లి జరుగుతుంది. ఈ పెళ్లి చేసుకొని ఈ ఇంటి నుంచి వెళ్తుంది కాదు కూడదు అని ఏయ్ లక్ష్మీ నువ్వు వాళ్ల ముందు ఎక్కువ వాగితే నీ పని అయిపోతుందని అంటుంది.
లక్ష్మీ చేయి పట్టుకొని లాక్కొని వెళ్తుంది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇతనితోనే నీ పెళ్లి అవుతుందని చెప్తుంది. ఇక పండు సరుకుల చీటీ మర్చిపోయాను అని తిరిగి వచ్చి లక్ష్మీకి పెళ్లి చూపులని తెలుసుకుంటాడు. విహారికి విషయం చెప్పాలని ఫోన్ చేస్తాడు. కానీ మీటింగ్‌లో బిజీగా ఉన్న విహారి ఫోన్ వదిలేసి ఉంటాడు. విహారికి ఎలా అయినా విషయం చెప్పాలని పండు అనుకొని పరుగులు తీస్తాడు. ఇక విహారి యంగ్‌స్టర్స్‌తో మాట్లాడుతాడు. వాళ్లని మోటివేట్ చేస్తాడు. ఇక విహారి మీరు ఏమైనా డిజైన్స్ చేసుంటే నాకు ప్రజెంట్ చేయమని అంటాడు. అంబిక, సుభాష్ ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడేంటి అని కంగారు పడతారు. వాళ్లంతా డమ్మీ గాల్లని సుభాష్ అంటాడు. ఇప్పుడు ఎలా అని అంబిక తల పట్టుకుంటుంది. ఇక విహారి భాస్కర్ అనే ఓ వ్యక్తికి చెప్పమని అంటే ఆయన ఏదో చెప్తాడు. అందరూ తల పట్టుకుంటారు. చారు కేశవ్ అంబికను అనుమానిస్తాడు. అంబిక ఏంటి బిక్కుముఖం వేసుకుందేంటి అనుకుంటాడు. ఆ వ్యక్తి సరిగా చెప్పలేదు అని విహారి ఆయన్ను బయటకు పంపేస్తాడు.
తర్వాత మరో వ్యక్తికి ప్రాజెక్ట్ గురించి చెప్పమని అంటే ఆయన సరిగా చెప్పడు. అతని కూడా బయటకు వెళ్లమంటాడు విహారి. ఒక్కోక్కరు బయటకు వెళ్లిపోతారు. అంబిక, సుభాష్ చాలా టెన్షన్ పడతారు. అందరూ వేస్ట్ ఇలాంటి వారితో నాతో మీటింగ్ పెట్టావేంటి అత్త అని విహారి అంబికను అంటాడు. అంబిక కూడా సలహాలు అడిగితే తీసుకొచ్చా ఇలాంటి వాళ్లు అనుకోలేదు అని అంటుంది. ఇక చారుకేశవ అంబిక ఏదో ప్లాన్‌తో ఇలా చేసిందని దామోదర్ వాళ్లు అంబిక కోసం వెతుకుతున్నారు వాళ్లకి కాల్ చేసి చెప్పాలని అనుకుంటారు. వెంటనే రంగా అనే పేరుతో కాల్ చేసి విహారి ముందు అంబికను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలి అనుకున్నారు కదా విహారి, అంబిక ఇద్దరూ ఆఫీస్‌లోనే ఉన్నారు వెంటనే వస్తే అంబిక పరువు తీయొచ్చని అంటాడు. దాంతో ఆయన వెంటనే బయల్దేరుతా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మరోవైపు పెళ్లి కొడుకు వాళ్లకు లక్ష్మీ ఒకే కావడంతో నిశ్చితార్థం చేద్దామని పద్మాక్షి అంటుంది.
లక్ష్మీ ఈ పెళ్లి తనకు ఇష్టం లేదు అని చెప్తుంది. ఎందుకు ఇష్టం లేదని పద్మాక్షి ప్రశ్నిస్తుంది. తన కారణాలు తనకు ఉన్నాయని ఒప్పుకోనని అంటుంది. పద్మాక్షి మాత్రం తన దగ్గర అలాంటివేమీ కుదరవని ఒంటరిగా వోణి ఎగరేస్తూ ఈ ఇంట్లో అటూ ఇటూ తిరుగుతాను అని అంటే నేను ఒప్పుకోనని అనాథ అయిన నీకు అన్ని బంధాలు ఇచ్చి పంపిస్తామంటే ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నిస్తారు. వసుధ కూడా అనాథలా జీవితం గడిపేయాలి అనుకుంటున్నావా సహస్ర వాళ్లు మంచి సంబంధం తెచ్చారు కదా పెళ్లి చేసుకో అంటుంది. అయినా లక్ష్మీ ఏడుస్తుంది. పద్మాక్షి వసుధతో లక్ష్మీని బతిమాలడం ఏంటి పంతుల్ని పిలవమని సహస్రతో చెప్తుంది. మరోవైపు సుభాష్‌కి తన ఫ్రెండ్ కాల్ చేస్తాడు. దామోదర్ ఆఫీస్‌కి వస్తున్నాడని చెప్తాడు. సుభాష్ షాక్ అయిపోతాడు. అంబికకు కాలు చేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రాజు, రోహిణిలకు పెళ్లైందని కుప్పకూలిపోయిన రూప.. మళ్లీ గొడవ అవుతుందా!