Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనకం వాళ్లు గుడికి బయల్దేరుతారు. ఇక సుభాష్ అంబికకు కాల్ చేస్తాడు. రేపు హైదరాబాద్ వస్తానని అంబిక చెప్తుంది. ఇక విహారి గురించి సుభాష్ అడిగితే విహారి ముంబయి వెళ్లలేదని అక్కడి వాళ్లతో అబద్ధం చెప్పించాడని విహారి ఎందుకు ఇలా చేశాడో ఎక్కడ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని అంబిక అంటుంది. ఇంతలో అంబిక దగ్గరకు సహస్ర వాళ్లు వస్తారు. సహస్ర చాలా అందంగా ఉందని అంబిక పొగిడేస్తుంది. విహారి చూస్తే వదలడు అని సెటైర్లు వేస్తారు. సహస్ర వాళ్లు కూడా గుడికి బయల్దేరుతారు.


కనకం, విహారిలతో ఆదికేశవ్, గౌరీలు కోరికలు కోరుకోమని చెప్తారు. నాది తీరని కోరిక అని విహారి కనకం గురించి చెప్తాడు. పావురాన్ని తన సొంత గూటికి చేర్చాలని అదే నా కోరిక అని చెప్తాడు. ఆ దారి అంత సులవైనది కాదని అర్థం కానట్లు మాట్లాడుతాడు. కోరిక ఏదైనా ఈ దేవుడికి చెప్తే తీరుతుందని ఆదికేశవ్ చెప్తాడు. అందరూ ఆదికేశవ్‌ దగ్గరకు వచ్చి కూతురి జీవితం కోసం అందమైన కలలు కన్నారని గొప్పగా పొగుడుతారు. విహారితో వాళ్లు ఆదికేశవ్ చెల్లి చేసిన మోసం చేసిందని ఆ పట్టుదలతోనే అమెరికా సంబంధం చేశారని మీ లాంటి గొప్ప వ్యక్తి దొరికారని చెప్తారు. అందరూ విహారిని పొగిడేస్తారు. కనకం కన్నీరు పెట్టుకోకుండా చూసుకోండి ఆడదాని కన్నీరు కుటుంబ నాశనానికి దారి తీస్తుందని చెప్పి వెళ్లిపోతారు. కనకం విషయంలో తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నానా అని విహారి ఆలోచనలో పడతాడు. నా సమస్యకి ఓ మార్గం చూపించు తల్లీ  అని కోరుకుంటాడు. 


సహస్ర వాళ్లు కూడా అదే గుడికి వస్తారు. గుడి చాలా బాగుందని అనుకుంటారు. యమున సహస్రకి దీపాలు సిద్ధం చేయమని అంటే పద్మాక్షి యమునను తిడుతుంది. ముత్తయిదువులు ఉండగా నువ్వు పూజ సామాగ్రి ఎలా పట్టుకుంటావని ఇలాంటి కార్యక్రమాల్లో చేతులు పెట్టొద్దని అర్థం కావడం లేదా అని తిడుతుంది. ఇంత వయసు వచ్చినా నీకు అర్థం కావడం లేదు అంటే నువ్వు మనిషివా కాదా అని తిడుతుంది. వసుధ తిట్టొద్దని అంటే పద్మాక్షి ఊరుకోదు. నువ్వు శుభమా అని చేస్తున్న పెళ్లి ఆవిడ కొడుకుతోనే అని మర్చిపోకు అని కాస్త అయినా గౌరవం ఇచ్చి మాట్లాడు అని చెప్తుంది. దాంతో సహస్ర కూడా అపశకునం అని తిడుతుంది. దాంతో యమున తల్లీకూతుళ్లకు క్షమాపణ చెప్పి పూజ సామాగ్రి ఇచ్చేస్తుంది.


అంబిక మనసులో యమున తిక్క కుదురుంటుందని అనుకుంటుంది. వసుధ యమునను ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. ఓ వైపు కనకం వాళ్లు కోనేటిలో విడిచిపెట్టడానికి దీపాలు సిద్ధం చేస్తుంటారు. అటుగా సహస్ర వాళ్లు వెళ్తుంటారు కానీ చూసుకోరు. విహారి కనకం వాళ్ల వెనకే సహస్ర వాళ్లు కూర్చొని ఉంటారు. కానీ ఎవరూ చూసుకోరు. ఇంతలో గౌరీ నూనె తీసుకురావడం మర్చిపోయానని బయటకు వెళ్లి తీసుకురమ్మని చెప్తుంది. దాంతో కనకం వెళ్తుంది. ఇక పద్మాక్షి కూడా పాలు మర్చిపోయానని సహస్ర, అంబికల్ని బయటకు పంపిస్తుంది. సహస్ర వెనక నుంచి కనకంని చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఉండిపోవా నువ్విలా రెండు కళ్లలో ఇలా.. బావతో ఏకాంతంలో జ్యో.. దీప, కార్తీక్‌ల ఫస్ట్‌నైట్!