Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ అందరికీ వడ్డిస్తుంది. ఇక అంబిక విహారితో ఈరోజు మొత్తం నీకు బిజినెస్ మీటింగ్స్ ఉన్నాయి. ఎంగ్ బిజినెస్ మెన్స్‌లు నీ సలహా సూచనలు తీసుకోవాలని అనుకుంటున్నారని చెప్తుంది. విహారి కాదు అన్నట్లు చెప్తే అంబిక ఒప్పిస్తుంది. సహస్ర అంబిక తమ ప్లాన్ వర్కౌట్ అయిందని సంతోషపడతారు. సహస్ర మనసులో లక్ష్మీ ఇక నీ పని అయిపోయిందని అనుకుంటుంది. అంబిక, విహారి ఆఫీస్‌కి వెళ్లిపోతారు. ఇక అంబిక సుభాష్‌కి కాల్ చేసి అంతా రెడీ కదా విహారికి అనుమానం వస్తే మన మీద నమ్మకం పోతుందని జాగ్రత్తగా మ్యానేజ్ చేయమని చెప్తుంది.
విహారి ఆఫీస్‌కి రాగానే సుభాష్ ఆ యువకుల్ని విహారికి పరిచయం చేస్తాడు. అందరూ బొకేలు ఇచ్చి విహారిని పరిచయం చేసుకుంటారు. విహారి వాళ్లతో మాట్లాడుతాడు. వాళ్లని బాగానే ట్రైనింగ్ ఇచ్చావని అంబిక సుభాష్‌ని పొగిడేస్తుంది. ఈవినింగ్ వరకు విహారికి ఎలాంటి అనుమానం రాకూడదని చెప్తుంది. ఇక లక్ష్మీ బట్టలు ఆరేస్తూ ఇంట్లో జరిగిన గొడవ గుర్తు చేసుకొని ఇకపై ఇంకా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటుంది.
లక్ష్మీ: ఇక పై నేను ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి తప్పటడుగు వేసినా నాకు విహారి గారికి జరిగిన పెళ్లి గురించి బయట పడుతుంది. దాని వల్ల విహారి గారి జీవితమే నాశనం అవుతుంది. నా వల్ల ఆయనకు మంచి జరగకపోయినా పర్లేదు కానీ ఎలాంటి చెడు జరగకూడదు.
సహస్ర: లక్ష్మీని చూస్తూ ఒక ఫ్యామిలీకి కాల్ చేసి అదిరేలా నటించాలని చెప్తుంది. ఎప్పుడు రావాలో ఫోన్ చేసి చెప్తా అప్పుడు వచ్చేయండి. లక్ష్మీ నువ్వు ఇక్కడున్నావా నీ కోసం ఇళ్లంతా వెతుకుతున్నా. ఈ చీర నీకు బహుమతిగా ఇవ్వడానికి వెతుకుతున్నా.
లక్ష్మీ: మీరు నాకు బహుమతి ఇస్తున్నారా.
సహస్ర: ఏంటి ఎప్పుడు చిరుబురులాడే సహస్ర నాకు ఇలా చీర ఇస్తుందని అనుకుంటున్నావా. నేను పైకి కటువుగా ఉన్నా లోపల చాలా సున్నితమైన మనసు కలదాన్ని. సరే ఈ చీర తీసుకో నువ్వు.
లక్ష్మీ: అయినా నాకు ఎందుకు ఈ చీర ఇస్తున్నావ్ అమ్మా.
సహస్ర: నువ్వు మా అందరి కోసం చాలా కష్టపడుతున్నావ్. ఇంత కొంచెం చోటు ఇచ్చినందుకు మా కోసం చాలా చేస్తున్నావ్. పైగా ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు ఉంటావు. అందుకే నీకు నేను ఉన్నాను అనే భరోసా కోసం బహుమతి ఇస్తున్నాను. నీకు ఈ చీర తీసుకోవడానికి ఒక కారణం కావాలి అనుకుంటే నన్ను ఓ సిస్టర్ అనుకో.
లక్ష్మీ: ఇంత హఠాత్తుగా చీర ఎందుకమ్మా.
సహస్ర: ఏంటి లక్ష్మీ ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావ్. ఏం మాట్లాడకుండా ఈ చీర కట్టుకో.
లక్ష్మీ: సరే అమ్మా థ్యాంక్యూ వెరీ మచ్.
సహస్ర: థ్యాంక్స్ చెప్పి ఇక్కడే ఉంటావ్ ఏంటి వెళ్లి చీర కట్టుకో పో.
లక్ష్మీ ఎంత చెప్పినా సహస్ర వినకుండా లక్ష్మీని గదిలోకి తీసుకెళ్లి పది నిమిషాల్లో చీర కట్టుకొని అందంగా రెడీ అయిపో అంటుంది. సహస్రలో ఇంత మార్పు ఏంటి అని లక్ష్మీ చాలా రకాలుగా ఆలోచిస్తుంది. ఇక లక్ష్మీ కుడి కన్ను కూడా అదురుతుంది. ఏదో అశుభం జరగబోతుందని అనుకుంటుంది. సహస్ర ఆ అబ్బాయి వాళ్లకి ఫోన్ చేసి రమ్మని పిలుస్తుంది. ఇక పండుని చూసి పండు ఉంటే అన్నింట్లో దూరుతాడని అనుకొని పండుని మార్కెట్‌కి పంపుతుంది. ఆ ఫ్యామిలీ ఇంటికి రావడం పండు చూస్తాడు. కానీ మార్కెట్‌కి వెళ్లిపోతాడు. ఇక సహస్ర వాళ్లని రిసీవ్ చేసుకుంటుంది. పెళ్లితో పాటు నిశ్చితార్థం కూడా అయిపోతుందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.