Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్, దీపల టిఫెన్ బండి దగ్గరకు జ్యోత్స్న, పారిజాతం వస్తారు. జ్యోత్స్న దీపకు రెండు డబ్బుల కట్టలు ఇచ్చి ఇవి నా డబ్బు నాకు ఎవరూ ఇచ్చింది కాదు అని ఇది నా స్థాయి అని అంటుంది. దాంతో జ్యోత్స్న చేతిలో దీప ఆ డబ్బు పెట్టి నేను రోజు ఇద్దరికీ ఉచితంగా టిఫెన్ పెడతా నీ స్థాయి నాది కాదు అని ఆ డబ్బులో మరో 11 రూపాయలు పెట్టి జ్యోత్స్నకి ఇస్తుంది. లెక్క సరిపోయింది ఇక వెళ్లు అంటుంది. పారిజాతం, జ్యోత్స్న ఇద్దరూ చాలా అవమానం చేసిందని దీన్ని ఊరికే వదలకూడదని అనుకొని వెళ్లిపోతారు.


జ్యోత్స్న ఇంటికి వస్తే సుమిత్ర ఎక్కడికి వెళ్లావ్ అని అడుగుతుంది. దాంతో కార్తీక్ టిఫెన్ బండి గురించి జ్యోత్స్న చెప్పి ఫొటోలు చూపిస్తుంది. శివనారాయణ, సుమిత్ర వాటిని చూస్తారు. సుమిత్ర లోలోపల సంతోషిస్తుంది. ఇక శివనారాయణ కొడుకుకి పిలిచి నీ మేనల్లుడి టాలెంట్ ఇది మన సపోర్ట్ లేకపోతే  వాడి స్థాయి ఇది అని అంటాడు. సలహా ఇచ్చిందే దీప అని జ్యోత్స్న అంటుంది. దానికి తాత కోరి శని దేవతని నెత్తిన పెట్టుకుంటే ఇలాగే అవుతుందని అంటాడు. పరువు తీస్తున్నారు బాధ పెడుతున్నారని శివనారాయణ అంటాడు. బావని అలా చూడలేకపోతున్నా తీసుకొచ్చేయ్ డాడీ అని జ్యోత్స్న తండ్రిని అడుగుతుంది. వాడు రాడు అని దశరథ్ అంటాడు. కార్తీక్ దీప ఓడిపోయే రకాలు కానీ వాళ్లు ఇప్పుడే తొలి అడుగు వేశారని మామయ్య కూడా ఇలాగే మొదటిలో టిఫెన్ సెంటర్ పెట్టారని అంటుంది. కార్తీక్ గెలుస్తాడని వాడి పక్కన భూదేవి లాంటి భార్య ఉందని అంటుంది. ఇక దీప టిఫెన్ బండి పూర్తి చేసి లాభం 3800 మిగిలాయని చెప్తుంది.


ఇక కార్తీక్‌ని అక్కడికి రావొద్దని మా బతుకులు అలా అలవాటే అని నేను చిన్నప్పటి నుంచి చేస్తున్న పనే ఇది అని కానీ మీరు రావొద్దు అని ఏడుస్తుంది. మీకు ఇష్టం లేకపోయినా టిఫెన్ కొట్టు పెట్టాను నాకు అది తప్ప ఇంకేం రాదని మీరు అలా కాదని ఏడుస్తుంది. మీరు మీ తాతతో ఛాలెంజ్ చేశారు ఇప్పుడు ఇది తెలిస్తే వాళ్లు నవ్వుతారని అంటుంది. దానికి కార్తీక్ నా భార్య కష్టపడుతుంటే నేను చూస్తూ ఉండలేను అని అంటాడు. నువ్వు వేసే ప్రతీ అడుగులోను నేను సగం ఉంటాను అని కార్తీక్ అంటాడు. దాంతో దీప ఎమోషనల్ అయిపోయి కార్తీక్‌ని వాటేసుకొని భర్త ఇలా ఉండాలి కదా నాకు మీ తోడు ఉంటే చాలు అంటుంది.


తీరా చూస్తే దీపకు కార్తీక్‌ని అలా కౌగిలించుకోవాలని ఉంటుంది కానీ కౌగిలించుకోదు. ఇంతలో శౌర్య వస్తుంది. జ్యోత్స్న దీప ఇచ్చిన 11  రూపాయలు పట్టుకొని తనకు జరిగిన అవమానం గుర్తు చేసుకుంటుంది. కొట్టిన దెబ్బలు, చేసిన అవమానాలు అన్నీ గుర్తున్నాయి నాకు ఓ రోజు వస్తుంది అప్పుడు నీ అంతు చూస్తా అనుకుంటుంది.



ఇంతలో దాసు వస్తాడు. దాసుని చూసి గ్రానీ కొడుకు ఇంటికి వస్తున్నాడు వీడిని ఆపాలి అని పరుగులు తీస్తుంది. ఎందుకు వచ్చావ్ అని అడిగితే వదినను కలవడానికి వచ్చానని నీ కూతురు దీప అని చెప్తానని అంటాడు. దాంతో జ్యోత్స్న దాసుని తీసుకొని చాటుగా వెళ్లి ఏమైంది అని అడుగుతుంది. దీప ఎందుకు కష్టాలు పడాలి నిజం తెలిస్తే మహారాణిలా బతుకుతుంది కదా అంటాడు.


ఏదో ఒకటి చేయ్ కానీ నిజం చెప్పొద్దని జ్యోత్స్న దాసు చేతులు పట్టుకుంటుంది. ఆ సీన్ పారిజాతం చూస్తుంది. ఇద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారని అనుకుంటుంది. దాసు కాళ్లు కూడా జ్యోత్స్న పట్టుకుంటుంది. ఇదంతా ఏంటి అని పారిజాతం అనుకుంటుంది. నిజం చెప్తే బయటకు వెళ్లి సూసైడ్ చేసుకుంటానని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: అమ్మాయి గారు సీరియల్: మా అమ్మ ఎవరు? అసలు ఉందా లేదా? ఇంట్లో వాళ్లని ప్రశ్నించిన బంటీ