Ammayi garu Serial Today Episode రూప, సూర్యప్రతాప్ దృష్టిలో మంచి వాడిని అవ్వడానికే అందరి ముందు రూప, రాజుల గురించి పాజిటివ్‌గా మాట్లాడాను అని దీపక్ తల్లితో చెప్తాడు. రూప, రాజులను కలపాలి అంటే మామయ్య కలిపే తీరుతారని అందుకే తొందర పడకుండా ఉండాలని అలా మాట్లాడాని ఇప్పుడు ఈ దీపక్ అంటే న్యూ వెర్షన్‌ అని అనుకుంటారని చెప్తాడు. రూప, రాజులను శాశ్వతంగా దూరం చేయాలని చెప్తాడు. దాంతో విజయాంబిక రూప, రాజు ఫ్యామిలీలు ఎదురైనట్లు చేసి మంట పెట్టాలని అనుకుంటారు.


రాజు బాబు బంటీని తీసుకొని స్కూల్‌కి వస్తాడు. బంటీని చూసి పిల్లలు అందరూ పింక్ పింక్ అని ఎగతాళి చేస్తారు. బంటీ రాజు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అందరూ నిన్ను ఎగతాళి చేస్తున్నారు కదా ఇలా పింక్ పింక్ అనొద్దని రాజు బంటీతో చెప్తాడు. ప్రిన్సిపల్‌తో మాట్లాడుతానని రాజు బంటీని తీసుకొని వెళ్తాడు. ఇక అప్పుడే రూప దీపుని తీసుకొని స్కూల్‌కి వస్తుంది. అక్కడ రాజు బండి చూసి రాజుని గుర్తు చేసుకుంటుంది. ఇక దీపు పరుగున వెళ్లి పడిపోబోతే బంటీ దీపుని పట్టుకుంటాడు. రూప బంటీని చూసి బంటీని గుర్తు చేసుకుంటుంది. ఒకర్ని ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. బంటీ అని రూప అనగానే ఫ్రెండూ అని బంటీ అంటాడు. ఇక రాజు ఫీజ్ కట్టడానికి టైం అడుగుతాడు. ప్రిన్సిపల్ మేడమ్ బంటి మంచి స్టూడెంట్ అని తీసుకున్నాం లేట్ అయితే కష్టం అని అంటుంది. రాజు మేడంని బతిమాలుతాడు. బంటీని బయట నిల్చొపెట్టొద్దని చెప్తాడు. ఇక రూప దగ్గరుండి ఇద్దరి చేతులు కలిపుతుంది. నువ్వు మంచోడివి అని మీ అమ్మానాన్న అదృష్టవంతుడివి అని రూప బంటితో అంటుంది.


ఇక బంటీ తన తండ్రిని రూపకి పరిచయం చేస్తానని అంటాడు. దీపుని జాయిన్ చేసి వస్తానని చెప్పి రూప వెళ్తుంది. రూప, రాజులు ఒకర్ని ఒకరు చూసుకోరు. రాజు బంటీని తిట్టినందుకు బంటీకి సారీ చెప్తాడు. ఇక రూప వెళ్లి దీపుని జాయిన్ చేస్తుంది. ఇక రూప మళ్లీ బంటీ దగ్గరకు వెళ్లే సరికి రాజు వెళ్లిపోతాడు. మరోసారి కలుస్తాలే అని రూప చెప్పి బంటీ, దీపు ఇద్దరినీ క్లాస్ లోకి పంపిస్తుంది. బంటి హోం వర్క్ చేస్తూ పింక్ కలర్ పెన్సిల్ పట్టుకొని పింక్ కలర్ చూసినా అమ్మ గురించి అడిగినా ఎందుకు నాన్న ఫైర్ అవుతున్నారు. అమ్మ అన్నా పింక్ అన్నా నాన్నకు ఎందుకు కోపమో తెలుసుకుంటానని బంటీ అనుకుంటాడు. అందరూ డల్‌గా బయట కూర్చొని ఉంటే బంటీ బయటకు వెళ్లి ఏమైందని అడుగుతారు. ఏం లేదు అని అప్పలనాయుడు చెప్తాడు. ఇక బంటీ తాతతో నాన్నకి పింక్ కలర్ అంటే ఎందుకు నచ్చదు అని అడుగుతాడు. తెలీదని ముత్యాలు చెప్తుంది. ఇక బంటీ విరూపాక్షిని అమ్మగారు అని పిలిస్తే విరూపాక్షి అమ్మమ్మ అని పిలువు అంటే మీరు మా అమ్మకి అమ్మనా అని అడుగుతాడు.


మా అమ్మ ఎవరో తెలీకుండా అమ్మమ్మ అని పిలవను అని నేను అమ్మగారు అని పిలుస్తాని అంటాడు. మా అమ్మ ఎవరు తాతయ్య అని అడుగుతారు. మన ఇంట్లో ఎందుకు ఉండటం లేదు అసలు ఉందా లేదా అని అడుగుతాడు. దాంతో అప్పలనాయుడు అర్థం అయినప్పుడు చెప్తానని అంటాడు. ఇక బంటీ మందారం ఫొటో చూసి ఆ ఫొటోలో ఉంది మా అమ్మేనా అని అడుగుతాడు. కాదని చెప్తే మా అమ్మ ఎవరు అని అడుగుతాడు. పింక్‌కి మా అమ్మకి ఏదో లింక్ ఉందని బంటీ అంటాడు. అప్పుడే రాజు వస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్ డిసెంబరు 30వ తేదీ: తొండ ముదిరి ఊసరవెల్లి అవుతుందా.. మరో బేబీ కథేనా ఇది?