Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ పెళ్లి అయిందా లేదా చెప్పమని యమున మీద ఒట్టు వేయించి ఇంట్లో వాళ్లు అడుగుతారు. లక్ష్మీని తప్పించడానికి ఏదో ఒకటి చేయాలని యమున అనుకొని తనకు ఫిట్స్ వచ్చినట్లు నటించి పడిపోతుంది. లక్ష్మీ, విహారి, వసుధ చాలా కంగారు పడతారు. మిగతా వాళ్లు మాత్రం లక్ష్మీతో నిజం చెప్పించలేకపోయాం అని అనుకుంటారు. లక్ష్మీ యమునకు నీళ్లు తాగిస్తుంది.


సహస్ర: ఏంటి లక్ష్మీ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకోవాలి అనుకుంటున్నావా. మేం ఈ రోజు నిన్ను వదిలేదే లేదు. చెప్పు పెళ్లి కాకుండా ఎందుకు ఆ వ్రతం చేశావ్.
విహారి: సహస్ర అని అరుస్తాడు. ఇంక ఆపుతావా నువ్వు.. ఇక మాట్లాడకు. అరే అమ్మాయి పూజలు చేసుకుంటే ఏంటి ఇంకేం చేసుకుంటే ఏంటి. అసలు తన విషయంలో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు. అరె తనని ఎందుకు ప్రతీ సారి తనని ఇంతలా పొడుస్తున్నారు. తన పని తాను చూసుకుంటుంది. అమ్మకి అండగా ఉంటుంది. మన ఇంటి పనులు అన్నీ చేస్తుంది. మనం అడగకపోయినా మన అందరికీ సాయంగా ఉంటుంది. ఇన్ని పనులు చేస్తున్నా వాటి గురించి ఏ రోజు మాట్లాడలేదు. కానీ అనవసరమైన విషయం గురించి మాట్లాడుతున్నారు. అర్థం కాని విషయం గురించి ఇలా అందరూ తన మీద పడిపోవడం ఎంత వరకు కరెక్ట్ కాదు.
వసుధ: అవును అక్క లక్ష్మీ చేసే పనులు గురించి కానీ పూజలు గురించి కానీ మనం ఎందుకు ఆలోచించాలి. ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. సహస్ర, అంబిక మీకు లక్ష్మీ మీద కోపం ఉంటే ఉండొచ్చు కానీ ప్రతీ దాన్ని ఇలా సాగదీస్తే విహారికి ముందు ముందు ఇలాగే కోపం వస్తుంది. ఏదైనా తెగే వరకు లాగితే తర్వాత నీకే ప్రాబ్లమ్ అవుతుంది. ఇలా చేస్తే నీ పెళ్లే ప్రాబ్లమ్‌లో పడుతుంది. 
సహస్ర: వసుధ పిన్ని చెప్పిన మాట నిజమేనేమో అమ్మ కొన్ని కొన్ని విషయాలు పట్టించుకోకపోతేనే బెటర్ లేదంటే అనవసరంగా నేను విహారి బావకి చేదు అవుతాను. 
అంబిక: మనసులో ఏదో జరుగుతుంది అది మీ అందరి ముందు పెట్టే వరకు నేను నిద్ర పోను.


విహారి, లక్ష్మీలు యమునను గదిలోకి తీసుకెళ్తారు. విహారి డాక్టర్‌కి కాల్ చేయడానికి బయటకు వెళ్తుంటాడు. ఇంతలో యమున లక్ష్మీతో నాకేం కాలేదు నేను నిక్షేపంగా ఉన్నాను అందుకే నాటకం ఆడాను అని చెప్తుంది. విహారి బయట నుంచి యమున మాటలు వింటాడు. లక్ష్మీ యమున చేతులు పట్టుకొని ఏడుస్తూ యమునకు థ్యాంక్స్ చెప్తుంది. యమున లక్ష్మీకి పెళ్లి గొప్ప చెప్తుంది. పెళ్లి అంటే భర్తతో కలిసి బతకడం. భర్త ప్రేమను పొందడం.. భర్త నీడన ఉండటం అవేమీ లేని నాడు మన మెడలో తాళి భారంగా మారుతుందని చెప్తుంది. భర్త పక్కన లేకపోతే మనకు విలువ ఉండదు అని నిన్ను వదిలేసిన వాడి కోసం ఈ వ్రతాలు అవి ఎందుకు అని తిడుతుంది. మెడలో తాళి తీసేసి నీ భర్తని ముఖం చెరిపేసి ఓ మూలకు వదిలేయ్ అని చెప్తుంది. దానికి లక్ష్మీ ప్రతి మనిషిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది చెడు చూస్తే మంచి చూడలేం అని తన భర్త చాలా గొప్ప వాడు అని దేవుడి లాంటి వాడు అని పొగుడుతుంది.  


యమున: లక్ష్మీ నువ్వు ఏమైనా అను నువ్వు పెళ్లి చేసుకున్న వాడు ఓ నీచుడు. అందుకే కట్టుకున్న భార్య ఏమైపొతుందా అని చూడకుండా వీధిన విసిరేస్తాడు.
లక్ష్మీ: అమ్మా దయచేసి అలా అనొద్దు.
యమున: లక్ష్మీ నువ్వు ఎన్ని అయినా చెప్పు ఆ మనిషి మంచోడే అయితే నీ మెడలో తాళి కట్టుకుండా ఉండాలి. ఒక్క సారి కట్టాడా నీ బరువు జీవితాంతం భుజాల మీద మోయాలి. ఎప్పుడు అయితే నీ బరువు దించేశాడో అప్పుడే అతను బాధ్యత లేని వాడు అని రుజువు అయిపోయింది.
లక్ష్మీ: కొన్ని పరిస్థితులు కూడా మనకు అర్థమయ్యేవి కొంతే. ఆయన పరిస్థితి నాకు తెలుసు దాన్ని మీరు అర్థం చేసుకోలేరు అంతే. 


సహస్ర బావ మాటలు తలచుకొని బాధ పడుతుంటే అంబిక వస్తుంది. లక్ష్మీ ఎవరు ఎందుకు తన ఇంట్లో ఉంటుంది. తన వల్ల నిజంగానే బావతో నాకు పెళ్లి ఆగిపోతుందా లక్ష్మీ ఈ ఇంట్లో ఉండకూడదు అని అంటుంది. అందుకు అంబిక సహస్రకు ఓ సలహా ఇస్తుంది. ఐడియా అదిరిపోయిందని సహస్ర గెంతులేస్తుంది. ఇద్దరూ ప్లాన్ అమలు చేయాలని అనుకుంటారు. ఇక సహస్ర రేపు బావ ఆఫీస్‌లో ఉండిపోవాలి అక్కడ బావ బంధీ అయితేనే మనం ఇంట్లో అనుకున్నది సాధించగలం అంటుంది. అంబిక సుభాష్‌కి కాల్ చేసి పది కంపెనీలు సృష్టించు పది మంది ఎంగ్ బిజినెస్ మ్యాన్‌లు విహారితో మాట్లాడి బిజి అయ్యేలా చేయాలని అంటుంది. ఇక ఉదయం లక్ష్మీ అందరికీ టిఫెన్ పెడుతుంది. లక్ష్మీ విహారిని చూస్తూ ఉంటుంది. సహస్ర మనసులో లక్ష్మీ నిన్ను ఇంటి నుంచి పంపేయబోతున్నా సిద్ధంగా ఉండు అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్ డిసెంబరు 30వ తేదీ: తొండ ముదిరి ఊసరవెల్లి అవుతుందా.. మరో బేబీ కథేనా ఇది?