Meghasandesam Serial Today Episode:  గగన్‌ ఇచ్చిన జ్యూస్‌ తాగిన సుజాత కంగారుగా వాష్‌రూంకు పరుగెడుతుంటే అపూర్వ పట్టుకుని ఏమైందని అడుగుతుంది. నువ్వు ఆ గగన్‌ గాడికి ఇచ్చిన జ్యూస్‌ నా చేత తాగించాడు అని చెప్పి పరుగెత్తుతూ.. నీ కూతురు ఆ గగన్‌ గాడిని రూంలోకి లాక్కెళ్లడమే కాదు. వాడి బుగ్గ మీద ముద్దు కూడా పెట్టినట్టు గుర్తులు ఉన్నాయి. అని చెప్పి వెళ్లిపోతుంది. సుజాత మాటలు వెనక నుంచి విన్న భూమి షాక్ అవుతుంది. అదేంటి బుగ్గ మీద ముద్దు పెట్టడం ఏంటి..? దానితో ముద్దు కూడా పెట్టించుకుంటున్నాడా..? చెప్తా నీ పని అంటూ భూమి, గగన్‌ దగ్గరకు  పరుగెత్తుకెళ్లి గగన్‌ తాను కూడా రూంలోకి తీసుకెళ్తుంది.


భూమి: అసలు ఏం చేస్తున్నారు మీరు. బుద్ది ఉందా మీకు. మీకేమైనా అర్థం అవుతుందా..?


గగన్‌: నేనేం చేశాను.


భూమి : ఏం చేశారో తెలియదా..? రండి చూడండి..


గగన్‌: ఓ ఇందుకా అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు..


భూమి: నవ్వరా.. మరి  అయినా అది అలా ముద్దు పెడితే పెట్టించుకోవడమేనా..?


గగన్‌: తను ముద్దు పెట్టిందని నీకెలా తెలుసు..


భూమి: అయినా మీరిలా చేస్తారని కలలో కూడా ఊహించుకోలేదు. మిమ్మల్ని ఎంతో ఊహించుకున్నాను చీచీ.. నేను అరిగిపోయిన సీడీలా అడిగిందే అడుగుతుంటే.. మీరు మన్మధుడి సినిమాలా నాగార్జునలా అలా నవ్వుతారేంటి..?


గగన్‌: సారీ ఏదో మాట్లాడుతున్నావు..


భూమి: మాట్లాడుతున్నానా..? నేను మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందా..? మీకు. ముద్దు పెడుతుంటే ఎందుకు ఊరుకున్నారు. ముందు అది చెప్పండి.


గగన్‌: ఓహో నీ మనసులో ఏముందో అడిగినా చెప్పవు.. బతిమాలినా చెప్పవు నీతో ఎలా చెప్పించుకోవాలో నాకు ఇప్పుడు అర్థం అయింది. ( అని మనసులో అనుకుంటాడు) ఆ బాగుంది కదా..? ఇప్పటి వరకు చూడనే లేదు. బాగానే ఉందిలే.. దీనికే ఇలా అంటున్నావు. తను నన్ను లోపలికి తీసుకెళ్లి..


 అని గగన్‌ చెప్పడం ఆపేయగానే.. ఏంటో చెప్పండి అంటూ అరుస్తుంది భూమి. మరోవైపు శరత్‌ చంద్ర గగన్‌, భూమి ఎక్కడ అని వెతుకుతుంటాడు. భూమి కోపంగా భూమి తను ముద్దు పెడితే తనను నెట్టేసి బయటకు వచ్చేయొచ్చు కదా అంటుంది. దీంతో గగన్‌ రొమాంటిక్ గా మాట్లాడుతుంటే.. భూమి తిడుతూ.. నేను మిమ్మల్ని అంటూ ఆపేస్తుంది. నీ మనసులో ఉన్నది ఏంటో చెప్పు భూమి ఫ్లీజ్‌ అని అడుగుతుంటాడు. ఇంతలో శరత్‌ చంద్ర వచ్చి డోర్‌ కొడతాడు. దీంతో భూమి కంగారు పడుతుంది. శరత్‌ చంద్ర డోర్‌ ఓపెన్‌ చేయగానే తలుపు చాటున ఇద్దరూ నిలబడి ఉంటారు. శరత్‌ చంద్రకు ఎవ్వరూ కనిపించకపోయే సరికి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.



గగన్‌: నా క్వశ్చన్‌కు నువ్వింకా ఆన్సర్‌ చేయలేదు. ఆ నక్షత్ర ముద్దు పడితే నీకెందుకు ఉక్రోషం


భూమి: అది ముద్దు పెట్టింది. నువ్వు ముద్దు ముద్రను జనంలో తిరుగుతూ చూపించావు. మళ్లీ అంకుల్‌ కు తెలిస్తే గొడవ అవుతుంది అని నా టెన్షన్‌.


గగన్‌: అయితే ఏమవుతుంది. మీ అంకుల్‌ నన్ను చంపేస్తా..


అని చెప్పబోతుంటే భూమి.. గగన్‌ నోరు మూస్తుంది. దీంతో నాకు అర్థం అయిపోయింది అంటాడు గగన్‌. దీంతో భూమి సిగ్గుతో బయటకు వెళ్తుంటే.. ప్రసాద్‌ ఎదురు వచ్చి భూమి ఏమైందని అడుగుతాడు. మీ అబ్బాయి మహా చిలిపి అని చెప్తుంది. ప్రసాద్‌ షాక్ అవుతాడు. ఇంతకీ మా అబ్బాయి ఏమన్నాడు అని అడగ్గానే మీ అబ్బాయి చిలిపియే కాదు.. తెలివైనోడు.. నా మనసులో మాట కనిపెట్టేశాడు అని చెప్తుంది.  ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!