Nindu Noorella Saavasam Serial Today Episode:  ఆరు ఫోటో చూస్తూ అమర్‌ ఎమోషనల్‌ అవుతుంటాడు. కన్నీళ్లతో  ఆరుతో ఉన్న  పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని బాధపడుతుంటాడు. ఆరు అన్న చావు కూడా మనల్ని వేరు చేయలేదన్నావు కానీ అప్పుడు ఎమోలే అనుకున్నాను. కానీ నువ్వు ఇప్పటికీ నా చుట్టూనే ఉన్నావంటే అర్థం అవుతుంది ఆరు.. అంటూ గుర్తు చేసుకుంటూ ఏడుస్తుంటాడు.  పైకి తీసుకెళ్లిన భాగీకి నిజం చెప్తాడు రాథోడ్‌.


రాథోడ్‌: మిస్సమ్మ నేను సార్‌ స్వశానానికి వెళ్లే సరికే ఆ మనోహరి అక్కడికి వచ్చింది. సెక్యూరిటీ వాళ్లు చెప్పినా వినకుండా దొంగలా లోపలికి దూరి ఆరు మేడం ఆస్థికలు కొట్టేయాలని చూసింది.


భాగీ: అసలు మనోహరి ఏం చేయాలనుకుంటుంది రాథోడ్‌.  మనోహరికి కావాల్సింది ఆయన పక్కన ఉండటం.. నేను లేకుండా పోవడం అయినా అక్క ఆస్థికలు తీసుకుని ఏం చేసుకుంటుంది. ఆ అర్థం అయింది. కచ్చితంగా మనోహరి అక్క ఆస్థికలు ఆ ఘోర కోసమే తీసుకోవాలని చూస్తుంది.


రాథోడ్‌: అంత కచ్చితంగా ఎలా చెప్తున్నావు మిస్సమ్మ


భాగీ: నువ్వే ఆలోచించు రాథోడ్‌.. అక్క ఆత్మ మన చుట్టే తిరుగుతుంది. అక్క చనిపోయిన  తర్వాతే ఘోర ఈ ఇంటి చుట్టు తిరుగుతున్నాడు. ఇంట్లోకి ఇన్ని సార్లు వచ్చిన ఘోర ఇంట్లోంచి ఏమీ తీసుకెల్లలేదు. ఘోరాకు హెల్ప్‌ చేస్తుంది మనోహరి అనే అనుమానం ఉంది. జరిగినవన్నీ ఒక్కసారి ఆలోచిస్తే క్లారిటీ వస్తుంది


రాథోడ్‌: అంతే మిస్సమ్మ.. అసలు మా మేడం ఇంత కసాయి వ్యక్తితో ఎలా స్నేహం చేసింది


భాగీ: తన మాటలతో అందరినీ మాయ చేస్తుంది రాథోడ్‌..


రాథోడ్‌: అయితే వెంటనే వెళ్లి సార్‌కు చెబుదాం పద మిస్సమ్మ..


భాగీ: వద్దులే రాథోడ్‌ మనం ఇలా చెబితే ఎవ్వరూ నమ్మరు. మనవి అనుమానాలు మాత్రమే అవి నిజం అవ్వాలంటే మనం సాక్ష్యాలు సంపాదించాలి. ఇక మనోహరి టైం దగ్గర పడింది రాథోడ్‌.


రాథోడ్: మిస్సమ్మ మనం ఏదో ఒకటి చేయడానికి ముందే ఆ మనోహరి ఆస్థికలు తీసుకెళ్లి ఘోరాకు ఇస్తుందేమో..?


అని రాథోడ్  అనుమానం వ్యక్తం చేయగా అందుకే మనోహరి కన్నా ముందే మనం ఒక ప్లాన్‌ చేయాలి అని తన ప్లాన్‌ మొత్తం రాథోడ్‌కు చెప్పగానే రాథోడ్ సరే అంటాడు. అమర్‌ ఫోటో తీసుకుని వచ్చి హాల్లో పెడితే భాగీకి  నిజం తెలుస్తుంది. కాబట్టి ఎలాగైనా ఆరు ఫోటో ఇక్కడ పెట్టకుండా ఆపాలని మనోహరి మనసులో ఆలోచిస్తుంది. కిటికీలోంచి చూస్తున్న ఆరు కూడా దేవుడిని ప్రార్థిస్తుంది. భాగీ తన ఫోటో చూడకుండా ఎలాగైనా డైవర్ట్‌ చేయమని కోరుకుంటుంది.



శివరాం: నిర్మల ఫోటో కోసం వెళ్లిన అమర్‌ ఇంకా రాలేదు వెళ్లి తీసుకురా…


నిర్మల: అలాగేనండి..


నిర్మల పైకి వెళ్తుంది. ఆరు ఫోటో చూస్తూ అమర్‌ ఏడుస్తుంటాడు.


నిర్మల: నాన్నా అమర్‌ ఇంకా ఇక్కడే ఉన్నావా..? ఏంటిది నాన్నా


అమర్‌: అమ్మా ఫోటో మీద డస్ట్‌ పడింది క్లీన్‌ చేస్తున్నాను.


నిర్మల: నేను అంతా చూశాను నాన్నా.. ఆరు దాటి ముందుకు వెళ్లాలి నువ్వు..


అమర్‌: అందర ఆరును దాటి ముందుకు వెళ్లాలని చెప్తున్నారు కానీ ఆరు నా చుట్టే తిరుగుతుందమ్మా..


నిర్మల: అవును నాన్నా.. ఆరు ఎక్కడ పోలేదు.. నీ పక్కనే ఉంటుంది. వెళ్దాం పద..


అని నిర్మల చెప్పగానే అమర్‌ ఫోటో తీసుకుని హాల్‌ లోకి వస్తాడు. మిస్సమ్మ ఎక్కడ అని అడుగుతాడు. పైకి వెళ్లిందని శివరాం చెప్తూ మిస్సమ్మను పిలుస్తాడు. మిస్సమ్మ, రాథోడ్‌ కలిసి వస్తారు. ఇంతోల మనోహరి ఆరు ఫోటో ఇవాళ కాకుండా రేపు దేవుడికి దీపం వెలిగించి అప్పుడు ఆరు ఫోటో పెట్టి దీపం వెలిగిద్దామని చెప్తుంది. శివరాం కూడా మనోహరి చెప్పింది కరెక్టే అని చెప్పడంతో అమర్‌ సరే అని ఫోటో నిర్మలకు ఇచ్చి వెళ్లిపోతాడు. ఆస్థికలు తీసుకుని భాగీ పైకి వెళ్తుంది. మనోహరి రిలాక్స్ అవుతూ రేపు కూడా అది ఫోటో చూడకుండా చేసి శాశ్వతంగా దాన్ని పైకి పంపించేయాలి అని మనసులో అనుకుంటుంది.  ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!