Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనక మహాలక్ష్మీ రాణితో కలిసి బయటకు వెళ్తుండగా సహస్ర చూస్తుంది. ఇక అంబిక రావడంతో సహస్ర చెప్తుంది. నీలం రంగు చీర కట్టుకుందని చెప్తే ఇద్దరూ వెతకడానికి వెళ్తారు. సహస్ర చీర రంగుతో అక్కడున్న వారిని అడుగుతుంది. ఇక కనకం సహస్ర, అంబికలను చూస్తుంది. వీళ్లూ గుడికి వచ్చినట్లు ఉన్నారు నన్ను విహారిని చూస్తే ఇంకేమైనా ఉందా అనుకొని షాక్ రాణిని షాప్‌కి పంపి తాను దాక్కుంటుంది. సహస్ర వాళ్లు అందరినీ తన గురించి అడగటం చూస్తుంటుంది. సహస్ర ఎంక్వైరీ చేసినామె పేరు అడిగితే సహస్ర లక్ష్మీ అని చెప్తుంది. ఎలా ఉంటుందని అడిగితే ఎప్పుడూ ఏడుపు ముఖంతో ఉంటుంది. చూస్తే పిచ్చిదానిలా కనిపిస్తుంది. చూస్తే చిరాకు వస్తుందని అంటుంది. 


కనకం: మా ఊరు వచ్చి నా గురించే ఎంక్వైరీ చేస్తారా. పైగా నన్నే చండాలంగా ఉన్నానని కామెంట్ చేస్తారా. మీ పని చెప్తా ఆగండి. 
సహస్ర: నువ్వు కూడా దానిలా పిచ్చిదానివా ఏంటి. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావ్.
మహిళ: హలో ఎవరే నువ్వు మా ఊరు వచ్చి ఎక్కువ చేస్తున్నావ్ ఇలాగే వాగితే ఎవరో ఒకరు వచ్చి నిన్ను ముసుగు వేసి చితక్కొడతారు.
అంబిక: సహస్ర నువ్వు ఇలా మాట్లాడితే ఎలా ఊరు కాని ఊరిలో జాగ్రత్తగా ఉండాలి.


కనకం దగ్గరకు ఆ మహిళలు వచ్చి నీ కోసమే వెతుకుతున్నారని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని చెప్తే ముసుగు వేసి కొట్టేయండి అని కనకం చెప్తుంది. దాంతో ఇద్దరు మహిళలు సహస్ర, అంబికను చితక్కొడతారు. ఇద్దరూ కుయ్యో మొర్రో అనుకుంటారు. అంబిక సహస్రని తిట్టి తీసుకెళ్లిపోతుంది. ఇక కనకం వాళ్లు కూడా వెళ్లిపోతారు. యమునమ్మ వాళ్లు ఇక్కడే ఉన్నారని విహారికి విషయం చెప్పాలా వద్దా అని చెప్తే కంగారు పడతారని కనకం అనుకుంటుంది. ఇక అంబిక జరిగిన విషయం అక్కా వాళ్లతో చెప్పొద్దని పరువు పోతుందని అంటుంది. కనకం వాళ్లు చీకటి పడటంతో దీపాలు తీసుకొని కోనేటి దగ్గరకు వెళ్తారు. అందరూ కోనేటిలో దీపాలు విడిచి పెడతారు.


కనకం వాళ్లు వస్తుండగా అటుగా సహస్ర వాళ్లు వస్తారు. కనకం వాళ్లని చూస్తుంది. ఎలా తప్పించుకోవాలా అనుకుంటుంది. ఇక తన తల్లిని ఆపి వేరే వైపు వెళ్దామని విహారి గారికి చూపిస్తానని వేరే వైపు నుంచి తీసుకెళ్తుంది. ఇంతలో విహారి ఫోన్ కోనేటి దగ్గర పడిపోయి నట్లు ఉందని తీసుకొస్తానని విహారి చెప్తే కనకం వెళ్లొద్దని అంటుంది. విహారి వెళ్తే సహస్ర వాళ్లు చూసేస్తారని అనుకుంటుంది. విహారి వెళ్తుండగా ఆపి నేను వస్తానని చెప్తుంది. తల్లి దండ్రులకు వెళ్లమని చెప్పి సహస్ర వాళ్లంతా ఇక్కడే ఉన్నారని విహారికి చెప్తుంది. విహారి షాక్ అయిపోతాడు. ఈ విషయం ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదని విహారి టెన్షన్ పడతాడు. ఏం చేయాలా అని తల పట్టుకుంటాడు. ఇక కనకం నేనే ఫోన్ తీసుకొస్తా మీరు ఇక్కడే ఉండండి అని చెప్తుంది. సహస్ర వాళ్లు అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని విహారి అనుకునేలోపు సహస్ర విహారి భుజం మీద చేయి వేసి విహారికి షాక్ ఇస్తుంది.


ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉండి విహారిని చూస్తారు. విహారి దేవుడా అనుకొని షాక్ అయిపోతాడు. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అని సహస్ర విహారిని నిలదీస్తుంది. ముంబాయి అని చెప్పావు ఇక్కడున్నావ్ ముంబాయి పేరు చెప్పి ఈ ఊరు వచ్చావా ఏంటి అని అంబిక అడుగుతుంది. విహారి తడబడితే అబద్ధం చెప్పాలి అనుకుంటున్నావా అని అంబిక అడిగితే పండు మీరు ఊరు వెళ్లారని చెప్తే ముంబయి నుంచి హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి విజయవాడ తర్వాత మీ దగ్గరకు వచ్చానని అంటాడు. ఏం నమ్మేలా లేదని అంబిక అంటే సహస్ర బావ నాకోసం వచ్చుంటాడు అలా అనొద్దు అని చెప్పి విహారి హగ్ చేసుకుంటుంది. ఇక కనకం విహారి వాళ్లకి దొరికిపోవడం చూస్తుంది. వాళ్లకి కనిపించకుండా దాక్కుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీపని చంపడానికి సుపారీ ఇచ్చిన జ్యోత్స్న.. జ్యో ముందే ఫోన్‌లో కార్తీక్, దీపల రొమాంటిక్ ముచ్చట్లు!