Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode యమున డల్‌గా ఉండటం చూసి వసుధ ఏమైంది మీరు చాలా రోజుల నుంచి డల్‌గా ఉన్నారు ఏమైనా ఉంటే చెప్పండి అని అడుగుతుంది. అలాంటిదేమీ లేదని యమున అంటుంది. ఇక విహారి ఆఫీస్‌కి బయల్దేరి లక్ష్మీని ఆఫీస్‌కి వెళ్లడానికి పిలుస్తాడు. చారుకేశవని కూడా పిలిచి ముగ్గురు ఓ బ్యాంక్ దగ్గరకు వెళ్తారు.
విహారి, లక్ష్మీ వాళ్లు కోపరేటివ్ బోర్డు వాళ్లతో మాట్లాడాలని అంటారు. కంప్లైంట్ ఇచ్చిన ఒక్క లక్ష్మీతోనే మాట్లాడుతా అని ప్రెసిడెంట్ దగ్గరకు లక్ష్మీని అతని పీఏ తీసుకెళ్తాడు. లక్ష్మీ ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చిందో అతనే ఈ ప్రెసిడెంట్. లక్ష్మీ అతన్ని చూసి షాక్ అయిపోతుంది. నా మీదే కంప్లైంట్ ఇస్తావా నేనే చేనేత కార్మికుల ప్రతినిధిని నీ మీద నాకే కంప్లైంట్ ఇస్తావా అని లక్ష్మీని అతను అడుగుతాడు. అతను లక్ష్మీ చేయి పట్టుకొని నువ్వు పిచ్చి పచ్చి వేషాలు వేస్తే ఇలా అందంగా ఉండవు ఈ సారి చేయి వేయను నిన్ను అందవీకారంగా ఎలా చేయాలో చేస్తా ఫో అని లక్ష్మీని నెట్టేస్తాడు. లక్ష్మీ కింద పడిపోతుంది. తలదించుకొని వెళ్లిపోతుంది.
విహారి ఏమైంది అని అడిగితే ఏం లేదని లక్ష్మీ వెళ్లిపోదాని అంటుంది. విహారి రెట్టించి అడగటంతో లక్ష్మీ జరిగింది చెప్తుంది. ఇక్కడ మనం అనుకున్నది ఏం జరగదు వెళ్లిపోదాం అని అంటే విహారి అతనితో గొడవ పడతాడు. ఇద్దరూ మాటలు యుద్ధం చేసుకుంటారు. నిన్ను ఓడించడమే నా టార్గెట్ ఎలక్షన్‌కి రీ కాల్ చేయ్ అని తలపడమని చెప్తాడు. నీ భాగోతం బయట పెడతానని విహారి వార్నింగ్ ఇస్తాడు. లక్ష్మీ నా తోడు అతను కూడా ఎలక్షన్‌కి రీ కాల్ చేస్తా అంటాడు. ఇక చారు కేశవ ఆ కొరియర్ పేపర్ పట్టుకొని ఎవరు ఆర్డర్ చేయించారో తెలుసుకోవాలని అనుకుంటాడు. మరోవైపు అంబిక, సుభాష్‌లు సిద్ధార్థ్‌ని చంపిన ప్లేస్‌కి వచ్చి వెతుకుతారు. సుభాష్ అక్కడికి తీసుకొచ్చినందుకు తిడుతుంది. వాడు తప్పించుకుంటే వెతకాల్సింది ఇక్కడ కాదు దగ్గర్లో హాస్పిటల్లో వెతకాలి అని అనుకుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్‌లో వెతకడానికి వెళ్తారు.
లక్ష్మీ ఇంటికి వచ్చి స్పీడ్‌గా గదికి వెళ్లి ఏడుస్తుంది. లక్ష్మీ నా పక్కన ఉంటే ఏమైనా చేస్తానన్న విహారి మాట గుర్తు చేసుకొని నన్ను విహారిగారిని దూరం చేయాలి అనుకుంటున్నారు. నా తాళి నాకు దూరం చేయాలని యమునమ్మ అనుకుంటుంది. ఏం చేయాలి దేవుడా నువ్వే నన్ను కాపాడు అనుకుంటుంది. అంబిక, సుభాష్‌లు హాస్పిటల్‌కి వెళ్లి సిద్దార్థ్ కోసం మొత్తం వెతుకుతారు. సిద్ధార్థ్‌ని చూసే టైంలో డాక్టర్ పిలిచి ఎవరూ జాయిన్ అవ్వలేదని చెప్తారు. తర్వాత డాక్టర్ లక్ష్మీకి కాల్ చేసి సిద్ధార్థ్‌ని వెతుక్కుంటూ వచ్చారని చెప్తుంది. అతని గురించి తెలియకుండా జాగ్రత్త పడ్డామని డాక్టర్ చెప్తుంది. పద్మాక్షికి దగ్గరకు సహస్ర వచ్చి లాయర్ నెంబరు అడుగుతుంది. నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని సహస్రని తల్లి అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.