Chinni Serial Today Episode మహికి పానీ పూరీ తినడం రాకపోతే మధు తినిపిస్తుంది. మధు అచ్చం చిన్నప్పటి చిన్నిలా ఉందేంటి అని అనుకుంటాడు. మహి తలచుకోగానే మధు పొలమారుతుంది. వెంటనే మహి తల మీద కొట్టి నీరు తాగిస్తాడు. మహి మాత్రం మధుని అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావ్ అని మధు అడుగుతుంది. మహి చిన్ని గురించి చెప్పేలోపు మధు కోసం సుబ్బు వస్తాడు.
మధు బండి హారన్ విని మా బండి అని అంటుంది. ఇక పానీపూరీకి మహి బిల్ కడతా అంటే మధు వద్దని నీ దగ్గర కార్డ్స్ ఉంటాయి డబ్బులు ఉండవు అని అంటాడు. ఇక మధు వాళ్లు సుబ్బు దగ్గరకు వెళ్తారు. సుబ్బు మహికి దండం పెట్టి మధు మా ప్రాణం తనని కాపాడటం వల్ల మీరు కాపాడింది మా కుటుంబం మొత్తాన్ని కాపాడారు అని అంటాడు. బాబు మీరు ఏం అనుకోకుండా మా ఇంటికి భోజనానికి రండి అని అంటాడు. దానికి మధు నాన్న వాళ్లు చాలా రిచ్ వాళ్లు మన ఇంటికి ఎందుకు వస్తారు అని అంటుంది. దానికి మహి వెంటనే హల్ మేడం అంత సీన్ లేదు నాకు అలాంటి రిచ్ పూర్ అని లేదు. ఫ్రెండ్‌షిప్‌లో అస్సలు లేవు అంటాడు. దాంతో సుబ్బు ఆదివారం భోజనానికి రండి బాబు అని అంటాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్లు ఉన్నారా నాన్న అన్ని అనుకుంటారు.
మహి మనసులో మధునే చిన్ని అవుతుందా అనుకుంటాడు. అంతలోనే చిన్ని నాన్న ఇతను కాదులే అని అనుకుంటాడు. మహి ఇంటికి వెళ్తాడు. మహి ఇంటికి వెళ్లగానే చిన్ని గురించి తెలిసిందా అని దేవా, వల్లి అడుగుతారు. చిన్ని గురించి తెలీదు కానీ ఉష టీచర్ గురించి తెలిసింది అని చెప్తాడు. ఆ మాట వినగానే వల్లి, దేవా షాక్ అయిపోతారు. ఉష టీచర్ చనిపోయారని చెప్పగానే రిలాక్స్ అయిపోతారు. ఉష టీచర్‌ని చంపేశారని అంటున్నారు. కడుపునకు అన్నం తిన్నవారు అలా ఎవరైనా చేస్తారా.. అసలు వాళ్లు మనుషులేనా అని తిడతాడు. దేవా, వల్లి ఒకర్ని ఒకరు చూసుకుంటారు. దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు అని దేవా అంటే ఆలోచించకుండా ఎలా ఉంటాను గురువుకే అలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి అని అంటాడు. ఇంతలో దేవాకి బాలరాజు దొరికాడని రౌడీలు ఫోన్ చేసి చెప్తారు.
మరోవైపు లోహిత, శ్రేయలు పరీక్ష పేపర్లు కొట్టేయడానికి కాలేజ్‌కి వెళ్తారు. పేపర్లు ఫోన్‌లో ఫొటో తీసేసి వెళ్లిపోతారు. మధు వాళ్లు కాలేజ్‌కి వస్తారు. పద్దూ( మారిపోయి ఉంటుంది ఈ పద్దు అందంగా ఉంటుంది. ) పద్దూ మధుని మహి పేరు చెప్ప ఆట పట్టిస్తుంది. పద్దూని పట్టుకోవడానికి మధు వెంటపడుతుంది. ఇంతలో నిజంగానే మహి రావడంతో పద్దూ మధుకి చూపిస్తుంది. మధు మహిని పలకరిస్తే మధు పలకరించి గేమ్ ఆడటానికి వెళ్తా అంటాడు. శ్రేయ, లోహితలు చూసి మధుని తిట్టుకుంటారు. ఇంతలో కాలేజ్‌లో ఎవరో పేపర్ దొంగతనం చేశారని పరీక్ష వాయిదా పడిందని అనౌన్స్ చేస్తారు. గంటలో లొంగిపోమని చెప్తే శ్రేయ చాలా భయపడుతుంది. మనం ఏం దొరకం అని లోహిత శ్రేయకి ధైర్యం చెప్తుంది. అంతా నేను చూసుకుంటా అని లోహిత అంటే శ్రేయ థ్యాంక్స్ చెప్పి హగ్ చేసుకుంటుంది. శ్రేయని క్యాంటీన్‌కి పంపిన లోహిత ఇప్పడేం చేయాలి ఎవరి నెత్తి మీద ఈ దొంగతనం మోపాలి అనుకుంటుంది. మధు బ్యాగ్‌లో పేపర్ చూసి దాన్ని కెమెరాలా చేసి అందరికీ ఫొటోలు తీస్తుంది. మ్యాడీ అని మహిని పిలుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.