Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today April 29th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: లక్ష్మీ సుమంగళి వ్రతాన్ని అంబిక, సహస్ర అడ్డుకుంటారా..!

Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీ భిక్షాటనకు వెళ్లడం అంబిక, సహస్రలు లక్ష్మీకి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనకం పూజ చేసి ఐదుగురు ముత్తయిదువులకు భిక్ష అడగాలి అనుకుంటుంది. విహారి అది చూసి ఏదో జన్మలో పుణ్యం వల్ల ఇలాంటి మంచి భార్య దొరికింది. కానీ పాపం కూడా చేశా అందుకే తను నా భార్య అని చెప్పుకునే అదృష్టం లేదని అనుకుంటాడు. ఇక ఇంట్లో అందరూ రేపే పెళ్లి అని ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో అక్కడికి లక్ష్మీ భవతి భిక్షాన్‌ దేహి అని అంటూ గుమ్మం ముందు నిల్చొని అడుగుతుంది.  

Continues below advertisement

లక్ష్మీని పసుపు వస్త్రాల్లో చూసి అందరూ షాక్ అయిపోతారు. అందరూ లక్ష్మీ దగ్గరకు వెళ్తారు. విహారి కూడా అక్కడే ఉంటాడు. అమ్మవారికి సుమంగళి వ్రతం చేసుకుంటున్నా కొంచెం భిక్ష వేయండి అని లక్ష్మీ అడుగుతుంది. యమున వసుధతో నీ చేతిలో కొన్ని బియ్యం, పసుపు, కుంకుమ వేయమని చెప్తుంది. దానికి అంబిక అది సుమంగళి వ్రతం చేస్తుందో లేక సహస్ర, విహారిల పెళ్లి ఆపడానికి పూజ చేస్తుందో ఏమో తెలుసుకో అంటుంది. లక్ష్మీ అలా చేయదు అని వసుధ అంటుంది. దానికి పద్మాక్షి పనామెకు ఇంటిళ్లపాది సపోర్ట్ ఒకటి అది సరిగ్గా నా కూతురి పెళ్లి ముందే పూజ మొదలు పెట్టింది అని అంటుంది. ఇప్పుడు దానికి సుమంగళి వ్రతం చేయాల్సిన అవసరం ఏంటి వదిలేసి వెళ్లిపోయిన వాడి కోసం పూజలు ఎందుకు అంటుంది. 

విహారి పద్మాక్షితో ఏదో పూజ చేసుకుంటుంది వదిలేయండి అంటాడు. యమున కూడా తన భర్త తిరిగి వస్తాడేమో అనే ఆశతో చేస్తుంది వదిలేయండి అని అంటుంది. దానికి వ్రతం వదిలి వచ్చి పెళ్లి పనుల్లో సాయం చేయమని చెప్పండి అని పద్మాక్షి అంటే సహస్ర ఎవరూ లక్ష్మీని ఆపొద్దని తన వ్రతం తనని చేసుకోనివ్వండి అంటుంది. దాంతో పద్మాక్షి, అంబిక వెళ్లిపోతారు. వసుధ భిక్ష వేస్తుంది. మొదటి భిక్ష వేసినందుకు థ్యాంక్స్  అని లక్ష్మీ చెప్తుంది. దానికి యమున సరే అమ్మ నువ్వు వెళ్లి ఐదుగురు ముత్తయిదువుల దగ్గర భిక్ష తీసుకొని రా మేం వ్రతానికి ఏర్పాట్లు చేస్తామని అంటుంది. వసుధతో చెప్పి పంతుల్ని పిలవమని అంటుంది.   

అంబిక సహస్రతో సుమంగళి దగ్గరకు వెళ్లి ఐదుగురు ముత్తయిదువులు దానికి భిక్ష వేయకూడదు ఎవరూ తాంబూలానికి రాకూడదు అంటుంది. దానికి సహస్ర దానికి ఎవరూ భిక్ష వేయకుండా చేస్తాను అని పని మనిషికి పిలిచి డబ్బులు ఇచ్చి లక్ష్మీ గురించి చెప్పమని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పు అని చెప్తుంది. పనామె సరే అని వెళ్తుంది. లక్ష్మీ తిరుగుతూ ఉంటే విహారి కారులో ఫాలో అయి చూస్తుంటాడు. లక్ష్మీ భిక్ష అడిగితే ఓకామె ఎవరుమ్మ నువ్వు నీ భర్త ఎక్కడ అని ప్రశ్నిస్తుంది. లక్ష్మీ ఏం చెప్పకుండా ఉండిపోతుంది. పెళ్లి అవగానే నిన్ను వదిలేసి వెళ్లిపోయాడు కదా నీకు ఎందుకు ఈ సౌభాగ్యం ఆ మెడలో తాళి అని లక్ష్మీ ఇబ్బంది పడేలా మాట్లాడుతుంది. నీ లాంటి వాళ్లకి భిక్ష వేస్తే పాపం తగులుతుందని లక్ష్మీని పంపేస్తుంది. లక్ష్మీ ఏడుస్తుంది. అది చూసి విహారి బాధ పడతాడు. ప్రతీ ఇంటి దగ్గర లక్ష్మీకి అదే ప్రాబ్లమ్ ఎదురవుతుంది. ఇక అంబిక ముత్తయిదువులు రాకుండా నేను చూసుకుంటా అంటుంది.
 
యమున, వసుధలు ఇంట్లో పూజకు ఏర్పాట్లు చేస్తారు. పద్మాక్షి చూసి ఏంటి ఇదంతా అని అడుగుతుంది. దానికి వసుధ లక్ష్మీ పూజకు అమ్మవారి పూజకు ఏర్పాట్లు చేస్తున్నాం అని అంటుంది. అందంతా చూసిన పద్మాక్షి పువ్వులు విసిరేస్తుంది. వసుధని తిడుతుంది. ఈ ఇంట్లో నా కూతురి పెళ్లి జరగాలి అది కూడా రేపే. రేపు పెళ్లి పెట్టుకొని అది ఆలోచించకుండా మనకు సంబంధం లేని దాని కోసం ఇంత హడావుడి చేస్తున్నారా అని అడుగుతుంది. ఇంట్లో ఇలాంటి పూజలు వ్రతాలు జరగడానికి వీల్లేదు అన్నీ బయట చూసుకోమని చెప్పు అని అన్నీ బయట పెట్టమని పండుతో చెప్తుంది. పండు వాటిని తీసుకెళ్తాడు. లక్ష్మీ మండుటెండలో కాలికి చెప్పులు లేకుండా భిక్ష కోసం తిరుగుతుంటే విహారి చూసి చాలా బాధ పడతాడు. లక్ష్మీ వెనకాలే నడుస్తాడు. అది సహస్ర చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మీ నాన్నని చంపేస్తావా మిధున.. వెళ్లిపో ఇక్కడి నుంచి: మిధునని గెంటేసిన త్రిపుర

Continues below advertisement
Sponsored Links by Taboola