Seethe Ramudi Katnam Serial Today Episode సీత మహాలక్ష్మీ మిథునతో చెప్పిన ప్లాన్ గురించి రేవతి, కిరణ్‌లకు చెప్తుంది. ఇద్దరూ సీతకి జాగ్రత్తలు చెప్తారు. నువ్వే మిథున అని రామ్‌కి తెలిసిపోయే ఛాన్స్ ఉంది అప్పుడు నీ కాపురానికే ప్రమాదం అని అంటారు. ఇంతలో సీత, రామ్‌లు ఫొటో కింద పడిపోతుంది. కిరణ్, రేవతిలు షాక్ అయి రేపు ట్రిప్ క్యాన్సిల్ చేసుకోమని చెప్తారు. సీత తమకు ఏం కాదని ధైర్యంగా ఉండమని చెప్తుంది. 

రేఖ, గౌతమ్ బట్టలు సర్దుకుంటారు. గౌతమ్ బ్యాగ్‌లో కత్తి, చాకు, ఉరితాడు, విషం ఇలా అన్నీ పెడతాడు. వాటిని చూసిన రేఖ ఇవి ఎందుకు అంటే రామ్‌ని చంపాలి అన్నావ్ కదా అని వాటిని పెడతాడు. రామ్‌తో ఇంట్లో అందరూ మాట్లాడుతారు. రామ్‌ని గిల్టీ లేకుండా వెళ్లమని మహాలక్ష్మీ చెప్తుంది. ఇదో మంచి అవకాశం అని మిస్ యూస్ చేయొద్దని రామ్తో చెప్తారు. గౌతమ్, రేఖలను భోజనానికి పిలవడానికి అర్చన వస్తుంది. వెపన్స్ చూడకుండా ఇద్దరూ మ్యానేజ్ చేస్తారు. అర్చన కిందకి వెళ్లి వాళ్లు ఎక్కడికో వెళ్లడానికి లగేజ్ సర్దుకుంటున్నారని చెప్తుంది.  గౌతమ్, రేఖలు కిందకి వచ్చి భోజనానికి కూర్చొంటారు. మహాలక్ష్మీ లగేజ్‌ గురించి అడుగుతుంది. గౌతమ్ రేఖతో ముంబయి వెళ్తున్నా అని చెప్తాడు. ఇప్పుడు సడెన్‌గా ఎందుకు అని జనార్థన్ అడుగుతాడు. ప్రేమాయనం అక్కడే అయింది కదా మనకు తెలీకుండా పిల్లలు కూడా ఉండుంటారు అందుకే వాళ్లని తీసుకురావడానికి వెళ్తున్నాడేమో అని చలపతి సెటైర్లు వేస్తాడు. దానికి గౌతమ్ రేఖని మా అమ్మకి చూపించడానికి వెళ్తున్నా అంటాడు. అర్చన, మహాలక్ష్మీ వీడు అమ్మ అని చెప్పి ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటారు. రెండు రోజుల్లో తిరిగి వచ్చేస్తాం అని రేఖ చెప్తుంది. మహాలక్ష్మీ గౌతమ్‌తో మీరు ఎక్కడికి వెళ్తున్నావ్రా ఏం ట్విస్ట్ ఇవ్వవు కదా అని అంటుంది. ఏం లేదని గౌతమ్ చెప్తాడు. చలపతి అనుమానంగా చూస్తాడు.

రామ్, మిథునలా ఉన్న సీత ట్రిప్‌కి కారులో వెళ్తుంటారు. ఎదురుగా ఓ కారు రావడం రామ్ గమనించడు సీత గురించి ఆలోచిస్తూ పరధ్యానంలో ఉంటాడు. మిథున పక్కకి స్టీరింగ్ లాగుతుంది. తర్వాత కారు పక్కకి ఆపి ఏమైంది అని అడిగితే సీత గుర్తొస్తుందని సీత తాను కలిసి పెళ్లి అయిన కొత్తలో ఊరెళ్లామని జర్నీ చాలా బాగున్నని దాని గురించి ఆలోచిస్తూ ఉన్నానని దారంతా సీత నాకు సర్‌ప్రైజ్ ఇచ్చిందని అన్నీ మెమోరీలు చెప్తాడు. సీత అంటే తనకు చాలా ఇష్టమని సీత ఇప్పుడు తన పక్కన లేదని సీత ఎదురు రాకుండా లాంగ్ ట్రిప్ వస్తున్నాను అని నాకు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయంగా ఉందని అంటాడు. సీత లేని తాను ఒంటరిని అని అంటాడు. మిథున మనసులో థ్యాంక్స్ మామ నేను అంటే నీకు చాలా ఇష్టం నేను నిన్ను కాపాడుకుంటాను అనుకుంటుంది. ఇద్దరూ మళ్లీ జర్నీ స్టార్ట్‌ చేస్తారు. 

రామ్ వాళ్లు వెళ్లిన రిసార్ట్‌కే గౌతమ్, రేఖలు గెటప్ మార్చుకొని జస్ట్‌ మ్యారీడ్ హనీమూన్‌కి వచ్చాం అని చెప్పి లోపలికి వెళ్తారు. గదిలోకి వెళ్లి అన్నీ సెట్ చేసుకోవాలని అనుకుంటారు. ఎలా షూట్ చేయాలా అని అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

 Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మీ నాన్నని చంపేస్తావా మిధున.. వెళ్లిపో ఇక్కడి నుంచి: మిధునని గెంటేసిన త్రిపుర