జానకిని నైట్ కాలేజీకి తీసుకెళ్లేందుకు రామా తీసుకెళ్లబోతుంటే అడ్డుకోవాలని మల్లిక చూస్తుంది. అవును జానకి నీకు కాలు నొప్పి తగ్గిన తర్వాత బయటికి వెళ్లొచ్చులే అంటుంది జ్ఞానంబ. నీకు దెబ్బ తగిలినప్పుడు నా ప్రాణం విలవిల్లాడిపోయింది. ఒకవేళ నొప్పి ఎక్కువై నువ్వు బాధపడుతుంటే నేను చూసి తట్టుకోలేను మీరు జాగ్రత్తగా వెళ్ళిరమ్మని జ్ఞానంబ చెప్తుంది. జానకి బ్యాగ్ లో పుస్తకాలు పెట్టుకుని వెళ్తుందని పోలేరమ్మతో చెపుదామంటే తోడి కోడలి మీద చాడీలు చెప్తావా అని పూనకం వచ్చిన కాళికా దేవిలాగా ఊగిపోతుంది. అటు చెప్పలేక ఇటు చెప్పకుండా ఉండలేక టెన్షన్ తో చచ్చిపోతున్నా అని మల్లిక మనసులో అనుకుంటుంది. అది గమనించిన గోవిందరాజులు చల్లటి మంచి నీళ్ళు తీసుకుని రమ్మంటావా అని అడుగుతాడు. దేనికి మావయ్య గారు అని మల్లిక అమాయకంగా అడుగుతుంది. కళ్లలో నిప్పులు పోసుకుని చూస్తున్నావ్ గా అందుకని అని అంటాడు. ఆ మాటకి మల్లిక సైలెంట్ గా ఉండిపోతుంది.
Also Read: తప్పు తెలుసుకున్న సామ్రాట్- ప్రేమ్ ని ఇంటికి రమ్మని పిలిచిన తులసి, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన శ్రుతి
నైట్ కాలేజీకి పోలీసులు వస్తారు. ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి నేను ఎలా మిస్ అయ్యాను అని ఆలోచిస్తుంది. ఇక జానకిని అధికారులు సర్టిఫికెట్స్ అడుగుతారు. తనకి ఈ విషయం గురించి తెలియదని చెప్తుంది. దీంతో అధికారులు తర్వాత చూపించమని చెప్తారు. ఇక జానకి తన ఒరిజినల్ సర్టిఫికెట్స్ జ్ఞానంబ దగ్గర ఉన్న విషయం గుర్తు చేసుకుంటుంది వాటిని ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తుంది. ఈ విషయాన్ని జానకి రామాతో చెప్తుంది. మొదటి సారి మీ మీద కోపంగా ఉంది జానకి గారు, మీ సర్టిఫికెట్స్ తో పని ఉంటుండని తెలుసు కదా అవి ఎందుకు ఆ రోజు అమ్మకి ఇచ్చావని కోప్పడతాడు. ఆ రోజు అలా చేయకుండా ఉంది ఉంటే ఈరోజు ఇంత టెన్షన్ పడే వాళ్ళం కాదు కదా అని అంటాడు. రామాగారు మీ కోపంలో అర్థం ఉంది అలాగే ఆ రోజు అత్తయ్యగారికి సర్టిఫికెట్స్ ఇవ్వడంలో ఒక తప్పనిసరి పరిస్థితి ఉంది. నేను భవిష్యత్ లో చదువుకోవాలని ఆలోచన చేస్తానేమో అని అత్తయ్యగారు చాలా భయంగా ఉన్నారు, ఆ భయం పోవడానికి నా మీద నమ్మకం కలగడానికి నేను ఆరోజు సర్టిఫికెట్స్ ఇవ్వక తప్పలేదని చెప్తుంది.
Also Read: మాధవ మీదకి చెయ్యెత్తిన రాధ, మాధవనే తన నాయన అన్న దేవి - ఆవేదనలో సత్య
తన చదువు గురించి చెప్పి సర్టిఫికెట్స్ అడుగుతానని జానకి రామాతో అంటుంది. దానికి రామా ఒప్పుకోడు. అది చాలా ప్రమాదం పరిస్థితులు చాలా దూరం వెళ్తాయని అంటాడు. అత్తయ్యకి చెప్పకుండా దాచిపెడితే ఇంకా ఇంకా సమస్యలకి దారి తీస్తుందని చెప్పి రామా పిలుస్తున్న ఆగకుండా జ్ఞానంబ దగ్గరకి వెళ్తుంది. ఇక జ్ఞానంబ ఇంటికి ఒక అమ్మాయి వచ్చి ఇష్టం లేని కాపురానికి పంపిస్తున్నారని కాపాడమని అడుగుతుంది. ఆ అమ్మాయి కుటుంబం దగ్గర జ్ఞానంబ జానకి గురించి చాలా గొప్పగా చెప్తుంది. 'నా కోడలు డిగ్రీ చదివింది. బాగా పై చదువులు చదవాలని తన కల. కానీ నా జీవితంలో జరిగిన ఓ సంఘటన తాలూకు భయంతో నా కోడాలిని చదువుకోడానికి వీల్లేదని చెప్పాను. తను నా భయాన్ని అర్థం చేసుకుని చదువు అనే ఆలోచనని తీసేసింది, తనలో ఉన్న ఇంకో గొప్ప విషయం తెలుసా తను చదువుకున్న కాగితాలని ఇవ్వమని అంటే ఇచ్చేసింది. ఇప్పటి వరకు వాటి ప్రస్తావనే తను ణ దగ్గర తీసుకురాలేదు ఎందుకంటే భవిష్యత్ లో చదువుకొను అని నాకు ఇచ్చిన దానికి కట్టుబది ఉంది. నా కోడలు తనకిష్టమైన చదువుని త్యాగం చేసింది. ఈరోజు మేమంతా సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం మా కోడలు జానకి' అని జ్ఞానంబ చెప్తుంది. ఆ మాటలన్నీ జానకి, రామా వింటూ బాధపడుతుంటారు.