సామ్రాట్ తులసిని అవమానించిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడతాడు. 'ఈ క్షణంలో పాప నీ ఒడిలో ప్రశాంతంగా పడుకోవడానికి కారణం ఎవరు? తులసి.. పాప బ్రతికుండటానికి కారణం ఎవరు? తులసి. నువ్వు తనని కిడ్నాపర్ అని జైల్లో పెట్టించావ్, దొంగతనం అంతగట్టవ ఇంటి మీద పడి నానా రచ్చ చేశావ్.. కానీ తను నీకు ఎదురు తిరగలేదు, గొడవ పడలేదు, అసహ్యంతో ఛీ కొట్టలేదు. నువ్వు పెట్టిన కష్టాలన్నీ మౌనంగా భరించింది. నికోక విషయం చెప్పనా హానికి యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయించినప్పుడు రికార్డుల్లో అమ్మగా రాయించింది. నువ్వు డబ్బు ఇస్తావ్ అనే ఆశతో కాదు పాప కి ట్రీట్మెంట్ ఆపేస్తారని భయంతో. ఫ్యూచర్ లో ఏదైనా ప్రాబ్లం వస్తుందని కూడా ఆలోచించకుండా ఒక తల్లిలాగా ఆలోచించింది. తను చేసిన త్యాగానికి వెల కట్టగలవా. హనీని పంజరంలో చిలకలాగా పెట్టి స్వేచ్చగా తిరగనివ్వడం లేదని మన ఇంటి అడ్రస్ చెప్పకుండా ఊరంతా తిప్పించింది. ఈ మాట హనినే స్వయంగా నాకు చెప్పింది. తులసి నోరు నొక్కడమే కాకుండా నా నోరు కూడా మూయించింది. ఈ పనులన్నీటి వల్ల నష్ట పోయింది తులసినే' అని చెప్తాడు. ఆ నష్టాన్ని నేను పూడుస్తానని సామ్రాట్ అంటాడు. తను కోరుకున్నంత డబ్బు ఇస్తానని చెప్తాడు. నువ్వే డబ్బు మనిషి అని ముద్ర వేసి నువ్వే డబ్బు ఇస్తానని అనడంలో అర్థం ఏంటని సామ్రాట్ ని నిలదీస్తాడు. తులసి డబ్బు మనిషి అని నిరూపించాలని అనుకుంటావా అంటాడు. కాదు బాబాయ్ తులసికి డబ్బు ఇచ్చి నేను చేసిన తప్పుని తొందర పాటుని సరిదిద్దుకుంటాను, తన జీవితం మారిపోయేలా చేస్తానని అంటాడు.


Also Read: మాధవ మీదకి చెయ్యెత్తిన రాధ, మాధవనే తన నాయన అన్న దేవి - ఆవేదనలో సత్య


పండక్కి అభిని పిలుద్దామని అనుకుంటున్నట్టు తులసి అంకితకి చెప్తుంది. అంకిత మౌనంగా ఉంటుంది. అభిని పిలుస్తున్నా అంటే సంతోషంగా ఉండొచ్చు కదా అని అంటుంది. మీ మీద ద్వేషంతో ఉన్నవాడు మీరు పిలిస్తే ఎలా వస్తాడని అనుకుంటున్నారని అంకిత అడుగుతుంది. నేను పిలవాలనుకుంది నీ కోసం అని చెప్తుంది. నేను అక్కర్లేదు అనే కదా ఆ ఇంట్లో ఉంటున్నాడు కదా అంటుంది. మరి నువ్వు కూడా అక్కర్లేదు అనుకుంటున్నవా జీవితంలో రాజీ పడాలి అని అంటుంది. నేను ఇన్నేళ్ళు రాజీ పడుతూనే ఉంటున్నా ఆంటీ అని అంటుంది. వాడు మొండి వాడు వాడు మారాడు. వాడిని నువ్వే మార్చుకోవాలి, ఈ ఇంటి గడప తొక్కేలా నేను చేస్తాను కానీ వాడు ఇక్కడే ఉండిపోయేలా నువ్వే చేసుకోవాలని హితబోధ చేస్తుంది. అభి వస్తాడని నాకు నమ్మకం లేదు కానీ వస్తే మాత్రం మీరు చెప్పినట్టే చేస్తానని అంటుంది. ప్రేమ్ వాళ్ళని కూడా ఇక్కడికే రమ్మని పిలుద్దామని అనుకుంటున్నా అని తులసి చెప్పగానే అంకిత చాలా సంతోషిస్తుంది. 


శ్రుతి తన అత్తయ్య దగ్గరకి వస్తుంది. ఇంత అర్థరాత్రి ఇలా వస్తారా అని అడుగుతుంది. ప్రేమ్ తన మాటలు నమ్మను అన్నాడని, తన కన్నీళ్లని నమ్మను అన్నాడని చెప్పుకుని బాధపడుతుంది. ఇక ప్రేమ్ నిద్రలో శ్రుతి.. శ్రుతి డార్లింగ్ అని కలవరిస్తూ ఉంటాడు. పిలుస్తున్న రావడం లేదేంటి అనుకుంటాడు. చేతికి తగిలిన దెబ్బ చూసుకుని రాత్రి చేసిన గొడవ గుర్తు చేసుకుంటాడు. ఎంత తప్పు చేశాను శ్రుతి చేసిన త్యాగానికి కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి అన్యాయంగా మాట్లాడి బాధపెట్టాను. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఏదో అన్నాడని రెచ్చిపోయి తాగిన మత్తులో పిచ్చిగా ప్రవర్తించాను. పాపం ఎంతలా ఫీల్ అవుతుందో ఎంతో వెంటనే క్షమించమని అడగాలని ఇల్లంతా వెతుకుతుంటే లెటర్ కనిపిస్తుంది. 'నువ్వు అన్న మాటలు మర్చిపోయి మామూలుగా ఉందామని చాలా ట్రై చేశాను ప్రేమ్..  కానీ నా వల్ల కాలేదు, ఒక్కో మాట ఒక్కో బాణంలాగా గుచ్చుకునేలా చేసి విలవిల్లాడేలా చేశాయి. ఎవరో అన్న మాటలకి నన్ను దోషిని చేశావ్, మన బంధం మసకబారెల చేసింది నేను కాదు నువ్వు, నన్ను చూడాలని లేదు అన్నావ్. నేను ఏ తప్పు చెయ్యలేదు, మోసం చేయలేదని నమ్మినప్పుడు నా దగ్గరకి రా ప్రేమ్' అని లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోతుంది. అది చదివి ప్రేమ్ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. 


Also Read: హుండీలో శౌర్య వేసిన చీటీ తీసి చదివి షాక్ అయిన హిమ, రౌడీ బేబీని గెలిపించే పనిలో ప్రేమ్


అదే సమయానికి తులసి ప్రేమ్ కి ఫోన్ చేస్తుంది. ఇక మీ అజ్ఞాతవాసం చాలు అని చెప్పడానికి ఫోన్ చేశాను నువ్వు శ్రుతి మన ఇంటికి వచ్చెయ్యండి ఎప్పటిలాగా అందరం సంతోషంగా కలిసి ఉందాం, నా మాటగా శ్రుతికి నువ్వు చెప్పు అని అంటుంది. అమ్మ రమ్మని పీకిచ్చినందుకు సంతోషపడాలో శ్రుతి వెళ్లిపోయినందుకు బాధపడాలో అర్థం కావడం లేదని అనుకుంటాడు. శ్రుతిని ఎలాగైనా వెతికి పట్టుకోవాలని అనుకుంటాడు. సామ్రాట్ తులసి ఇంటికి బ్లాంక్ చెక్ పంపిస్తాడు. అది చూసి తులసి కుటుంబం కోయపంతో రగిలిపోతుంది. 


తరువాయి భాగంలో.. 


తులసి హానికి ప్రేమగా అన్నం తినిపిస్తుంది. తులసికి బ్లాంక్ చెక్ పంపించానని సామ్రాట్ తన బాబాయ్ కి చెప్తాడు. ఇక తులసి ఆ చెక్ ని సామ్రాట్ కి తిరిగి ఇచ్చేస్తుంది. నా చేతిలో బ్లాంక్ చెక్ పెట్టినంత మాత్రాన మీరు నా పట్ల చేసిన తప్పులు ఒప్పులుగా మారిపోవని అంటుంది.