జానకి అఖిల్ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటుంది. దీంతో అఖిల్ ని విడుదల చేస్తారు. ఇంటి దగ్గర అందరూ అఖిల్ కోసం సంతోషంగా ఎదురుచూస్తూ ఉంటారు. బావగారు ఆనందంతో జానకిని తీసుకుని స్టేషన్ కి వెళ్లారు కానీ అఖిల్ ని తీసుకొస్తారా అని మల్లిక వాగుతుంది. జానకి మనసు మార్చుకుని కేసు వెనక్కి తీసుకోకపోతే పరిస్థితి ఏంటి అని పుల్ల వేస్తుంది. ఆ మాటకి ఇంట్లో అందరూ మళ్ళీ టెన్షన్ పడతుంటే అప్పుడే అఖిల్, జానకి, రామా ఇంటికి వస్తారు. అఖిల్ ను చూసి అందరూ చాలా సంతోషిస్తారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మీకు చెడ్డ పేరు తీసుకొచ్చానమ్మా అని అఖిల్ జ్ఞానంబని క్షమించమని అడుగుతాడు. జానకి మాత్రం మౌనంగా ఉంటుంది.


కొడుక్కి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది జ్ఞానంబ. ముందు పొరపాటు పడినా తర్వాత మనసు మార్చుకుని అఖిల్ ఇంటికి తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉందని జానకితో జ్ఞానంబ అంటుంది. కొడుక్కి ప్రేమగా అన్నం తినిపిస్తూ అందరూ సంతోషంగా ఉంటారు. పొద్దుట దాకా బాధతో ఉన్న మీ అత్తయ్య కళ్ళలో ఆనందం చూడమ్మా అని గోవిందరాజులు తన సంతోషాన్ని జానకితో చెప్తాడు. కాసేపు తనని పొగుడుతాడు. జానకి పరాధాన్యంగా ఉంటే రామా వచ్చి అఖిల్ ని ఇంటికి తీసుకురావడంతో ఇంట్లో పండగ వాతావరణం వచ్చిందని అంటాడు. జానకి మాత్రం మాధురి గురించి తలుచుకుని చాలా బాధపడుతుంది. నా ఆశయాన్ని మీ కోసం వద్దని అనుకున్నా, నా ఒక్కదాని సంతోషం కోసం కుటుంబం మొత్తాన్ని బాధపడకూడదు అని నేను చదువుకోకూడదని నిర్ణయం తీసుకున్నా. మీ భార్యగా కోడలిగా నా ధర్మాన్ని పాటిస్తూ ఇంటిని చక్కదిద్ది అందరినీ సంతోషంగా చూసుకుంటాను అని మనసులో అనుకుంటుంది.


Also Read: అనసూయ మీద చెయ్యెత్తిన పరంధామయ్య- ఉగ్రరూపం దాల్చిన తులసి


పొద్దున్నే లేచి తులసి కోటకి జానకి పూజ చేస్తుంది. జెస్సి వచ్చి జానకిని హగ్ చేసుకుని థాంక్స్ చెప్తుంది. అది చూసి మల్లిక కుళ్ళుకుంటుంది. నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి, తల్లి ఆనందం బిడ్డకి ఆరోగ్యాన్ని ఇస్తుందని జానకి చెప్తుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు పొగుడుకోవడం చూసి మల్లిక ఏడుస్తుంది. తను ఏం చేద్దామని అనుకున్నా తనకే రివర్స్ అయ్యిందని మల్లిక తనని తాను తిట్టుకుంటుంది. అటు జానకి ఇంట్లో పనులు అన్ని చేసుకుంటూ ఉంటుంది. జ్ఞానంబ వాళ్ళకి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. అచ్చ తెలుగు ఆడపిల్లలా చక్కగా ఉన్నావ్ జానకి అని తనని మెచ్చుకుంటుంది. తర్వాత జానకి వెళ్ళి రామాకి కాఫీ ఇస్తుంది. రెండు రోజుల నుంచి మీరు క్లాస్ కి సరిగా వెళ్ళడం లేదు మీరు రెడీ అవ్వండి కాలేజీలో దింపి వెళ్తాను అని రామా అంటాడు. కానీ జానకి మాత్రం జెస్సికి టిఫిన్ ఇవ్వడం మర్చిపోయాను అని వెళ్ళిపోతుంది. అదేంటి నేను ఒకటి మాట్లాడితే జానకి గారు మరొకటి మాట్లాడుతున్నారని రామా అనుకుంటాడు. అటు గోవిందరాజులు వయల్లాఉ జానకిని చూసి మురిసిపోతారు.


Also read: యష్ చెంప పగలగొట్టిన మాలిని- మాళవిక మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోనని తేల్చి చెప్పేసిన వేద


తరువాయి భాగంలో..


ఆటోలో కాలేజీకి వెళ్తాను అని చెప్పి చదువు మానేసి ఇంట్లో ఉండి అన్ని పనులు చేస్తున్నారు అసలు ఏం జరుగుతుందని రామా జానకిని నిలదీస్తాడు. చదువు కావాలో కుటుంబం కావాలో తేల్చుకోమన్నారు.. నాకు కుటుంబమే కావాలని అనిపించింది అందుకే చదువు వదిలేసుకున్నా అని జానకి చెప్పడంతో రామా షాక్ అవుతాడు.