మల్లికతో వంటలు చేయించి సోషల్ మీడియాలో పెట్టి డబ్బు సంపాదించాలని ప్లాన్ వేస్తుంది. అటు వంకాయ కూర ఇంకా ఘుమఘుమలాడటం లేదు ఏంటా అని గోవిందరాజులు ఎదురుచూస్తాడు. సోషల్ మీడియాలో బోలెడు వంటలు ఉంటాయని మల్లిక చెప్తుంది. వంటలు చేసేది నువ్వు నీ పేరు పెట్టుకుని నేను డబ్బులు సంపాదిస్తానని మనసులోనే తెగ డాన్స్ లు వేస్తుంది. ఆవిడ దగ్గరకి వంటలు నేర్చుకోవాలని మలయాళం ప్లాన్ వేస్తాడు. మల్లిక మాటల అల్లిక అంటూ యూట్యూబ్ లో వీడియోలు పెట్టేందుకు రెడీ అయిపోతుంది. సందు దొరికింది కదా అని మల్లికతోనే మలయాళం వంట చేయించేస్తాడు.
Also Read: స్వప్నకి కుజదోషం, కనకం నెత్తిన పిడుగు- మళ్ళీ గొడవపడిన రాజ్, కావ్య
రామా పెట్టిన వ్యాపారం బాగా సాగుతోంది. అక్కడికి సిఐ వచ్చి స్వీట్స్ కావాలని అడుగుతాడు. మీ షాపు కూడా చూద్దామని వచ్చానని చెప్తాడు. ఆ పోలీసాఫీసర్ ని రామా అలాగే చూస్తూ ఉంటాడు. యూనిఫామ్ వేసుకోవాలని చిన్న నాటి కల అని రామా చెప్తాడు. బాగా చదువుకుంటే పోలీస్ ఉద్యోగం సంపాదించవచ్చని పోలీస్ చెప్తాడు. ఉద్యోగం సంపాదించాలంటే ముందు ఫిట్ గా ఉండాలి, బాగా కసరత్తులు చేయాలని అంటాడు. ఆడవాళ్ళు కూడా చేయాలా అని అమాయకంగా అడుగుతాడు. ఎవరైనా సరే ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలని అనేసరికి జానకిని శారీరకంగా ధృడంగా ఉండేలా చూసుకోవాలని అనుకుంటాడు. మల్లిక కూడా వంట చెయ్యడం చూసి విష్ణు భయపడతాడు.
మలయాళం చేసిన వంట రెడీ అయిపోయిందని గోవిందరాజులు తెగ సంబరపడిపోతాడు. కూర చూసి జ్ఞానంబ బిత్తరపోతే గోవిందరాజులు మాత్రం సూపర్ ఆహా.. ఓహో అని తెగ మాటలు చెప్తాడు. తీరా కూర చూసి ఏంటి ఇది అని కాసేపు తిడతాడు. అది చూసి జ్ఞానంబ నవ్వుతుంది. విష్ణు కోసం మల్లిక గుత్తి బంగాళాదుంప అని కొత్త కూర వండాను అని చెప్పేసరికి అందరూ నోరెళ్ళబెడతారు. అందరూ తినకుండా తప్పించుకుని వెళ్లిపోతే విష్ణు మాత్రం బలైపోతాడు. ఆ చేసిన వంటలన్నీ తినలేక పారిపోతాడు. రామా బండి దగ్గరకి జానకి వచ్చి డబ్బులు ఏమైనా మిగిలాయా అని అడుగుతుంది. జానకి కాలేజ్ ఫీజు అడగటానికి వచ్చి ఆగిపోతుంది. సరుకుల షాపులో పెట్టిన అప్పు తీర్చాలని రామా చెప్తాడు. దీంతో జానకి ఫీజు కోసం డబ్బులు ఆడకుండా ఉండిపోతుంది.
Also Read: ఇగో మాస్టర్ వంకర ప్రశ్నలు, పొగరు తిక్క సమాధానాలు- రిషిధారని కలిపేందుకు మహేంద్ర స్కెచ్
మల్లిక ఫోన్ చూస్తూ మలయాళం చేసిన వంట వీడియో కి మంచి లైక్లు వచ్చాయని అబద్ధం చెప్తుంది. అదంతా విని మలయాళం తెగ పొంగిపోతాడు. అప్పుడే రామ వాళ్ళు వస్తారు. వాళ్ళని అవమానించడం కోసం మల్లిక కావాలని మాటలు అంటుంది. ఆయన సొంతంగా వ్యాపారం చేసుకోవడం కదా ఎప్పుడంటే అప్పుడు వస్తారు కానీ విష్ణు అలా కాదు కదా ఒకరి కింద పని చేయాలని జానకి గట్టిగానే సమాధానం ఇస్తుంది.