వేద ఖుషిని రెడీ చేస్తూ యష్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. తను సెలెక్ట్ చేసిన వేసుకుని రావడం చూసి వేద మురిసిపోతుంది. రోజు వేసుకునే డ్రెస్ కదా స్పెషల్ గా అడుగుతున్నావ్ ఏంటని ఖుషి అడుగుతుంది. నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకున్నారు అందుకే అడుగుతున్నా అని వేద అనేసరికి మీ మమ్మీ సెలెక్ట్ చేసిన డ్రెస్లోనే నేను బాగుంటానంట అని యష్ చెప్తాడు. సూపర్ గా ఉన్నావ్ డాడీ అని ఖుషి అనేసరికి మీ మమ్మీ నువ్వు ఒకే పార్టీ కదా అని యష్ అంటాడు.


ఖుషి: నువ్వు కూడా  మా పార్టీలోకి రావొచ్చు కదా డాడీ


యష్: మీ మమ్మీ రానివ్వాలే కానీ రాను అంటానా


వేద: వస్తానంటే వద్దని అంటానా అని మనసులోనే అనుకుంటారు.


మార్కెట్లో ఒక కంపెనీ సెల్ కి వస్తే తీసుకున్నా అది టేకోవర్ తీసుకుంటున్నానని చెప్పి ఆశీర్వాదం తీసుకుంటాడు. ఇంట్లో ఉన్న పాత దరిద్రాన్ని త్వరగా వదిలించుకోమని చెప్పి భ్రమరాంబిక చెప్తుంది. అలాగే చేస్తాను నువ్వు చెప్పిన తర్వాత చేయకుండా ఉంటానా అని అభి అంటాడు. యష్ వేయాల్సిన టెండర్ టైమ్ లేట్ అయ్యిందని తీసుకోమని కంపెనీ వాళ్ళు చెప్తారు. మీ బాస్ తో నేను మాట్లాడతానని యష్ అనేసరికి విన్నీ కనిపిస్తాడు. వెంటనే విన్నీ కూడా యష్ వాళ్ళని చూసి వస్తాడు. ఇది నా కంపెనీ నేనే సీఈవో అని విన్నీ చెప్తాడు. మీ కంపెనీకి ఒక ప్రాజెక్ట్ కోసం టెండర్ వేద్దామని వచ్చాం టైమ్ అయిపోయిందని చెప్తున్నారు, మీరు కదా అయితే హెల్ప్ చేయండని వసంత్ అడుగుతాడు.


టెండర్ టైమ్ అయిపోయిందని కుదరదని విన్నీ చెప్తాడు. వసంత్ విన్నీ అని పిలిసేసరికి ఇది ఆఫీస్ పూర్తి పేరు పిలవమని అంటాడు. ఇది నీ కంపెనీ అని తెలిసుంటే అసలు వచ్చేవాడిని కాదని యష్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వేద విన్నీ పిలిచిన ఫంక్షన్ కి చక్కగా రెడీ అయిపోతుంది. తనని చూసి ఖుషి చాలా అందంగా ఉన్నావని మెచ్చుకుంటుంది. బతిమలాడకుండానే యష్ ని తనతో పార్టీకి రప్పించడానికి వేద ప్లాన్ వేస్తుంది. చిత్ర పని చేస్తున్న కొత్త ఆఫీసు బాస్ ని పరిచయం చేసుకోవడానికి వెళ్తుంది. ఆ కొత్త బాస్ ఎవరో కాదు అభిమన్యు. తనని చూసి చిత్ర షాక్ అవుతుంది. ఈ కంపెనీని నేను కొన్నానని చెప్తాడు. ఉద్యోగం వదిలి వెళ్లిపోవాలని అనుకుంటున్నావా అని అభి అంటాడు. కానీ చిత్ర మాత్రం ధైర్యంగా అభికి లిమిట్స్ లో ఉండమని చెప్పి వార్నింగ్ ఇస్తుంది.


అందం, పొగరు ఉన్న చిత్ర తెగ నచ్చేసింది కొత్త ప్రేమ జీవితానికి ఆల్ ది బెస్ట్ అని అభిమన్యు తనకి తాను చెప్పుకుంటాడు. యష్ ఇంటికి వచ్చి వేద కోసం చూస్తాడు. విన్నీ పార్టీకి రమ్మని వేద బతిమలాడాలి అప్పుడే వెళ్తానని అనుకుంటాడు. కానీ వేద రివర్స్ లో పార్టీకి రెడీ అయిపోయి కనిపిస్తుంది. పార్టీకి వెళ్తున్నా అని యష్ ని బతిమలాడకుండా ఉంటుంది.