Unstoppable With NBK: అన్‌స్టాపబుల్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ రెండో భాగం ప్రోమోను ఆహా విడుదల చేసింది. ఇందులో ఎక్కువ రాజకీయాల మీద దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. మధ్యలో సడెన్‌గా బాలయ్య ‘నువ్వు తెలుగుదేశంలో చేరి ఉండాల్సింది’ అని అడిగేశారు. దానికి పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్పారో మాత్రం చూపించలేదు.


ఈ ఎపిసోడ్‌కు ‘హరి హర వీర మల్లు’ డైరెక్టర్ క్రిష్ కూడా వచ్చారు. ఆయన రాగానే బాలకృష్ణ ‘నువ్వు నాతోనూ, పవన్ కళ్యాణ్‌తోనూ పని చేశావు. ఇద్దరి మధ్య ఉన్న పోలికలు, తేడాలు ఏంటి?’ అని అడిగారు. ‘సింహం, పులి మధ్యలో నా తల ఉన్నట్లు ఉంటుంది.’ అని క్రిష్ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు.


ఆ తర్వాత దర్శకుడు క్రిష్ వెళ్లిపోయి ఫ్యాన్స్ మధ్యలో కూర్చున్నారు. ‘పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలు మానేసి రాజకీయాలకే పరిమితం కావాలని ఎంత మంది కోరుకుంటున్నారు?’ అని బాలకృష్ణ అడగ్గా దానికి చాలా మంది ఫ్యాన్స్ ‘అవును’ అని సమాధానం ఇచ్చారు. దానికి పవన్ కళ్యాణ్ ఏదో రాస్తుండగా ‘ఏంటయ్యా... అపాలజీ లెటర్ రాస్తున్నట్లు అంత రాస్తున్నావు.’ అని బాలకృష్ణ జోక్ చేశారు.


ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ పై ఆయన్ను ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ప్రోమోలో ఎమోషనల్ టచ్ కూడా ఉంది. పవన్ కల్యాణ్ ను తన నాలుగో కొడుకు అని చెబుతున్న ఇటీవల కాలంలో ట్రెండ్ అయిన పెద్దావిడను షోలోకి తీసుకువచ్చింది ఆహా టీమ్. పవన్ కల్యాణ్ ను సీఎంగా చూసిన తర్వాత చనిపోతానంటూ ఆవిడ ఎమోషనల్ గా పవన్ కల్యాణ్ ఆమె కాళ్లకు నమస్కరించటం ప్రోమోకు ఎమోషనల్ టచ్ తీసుకువచ్చింది.



చివరికి అణువు, అణుబాంబు అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ క్లిఫ్ హ్యాంగర్ అనే చెప్పాలి. మొత్తంగా పాలిటిక్స్ మీద హీటెక్కించిన ఈ ఎపిసోడ్ పార్ట్ 2 ఫిబ్రవరి 10వ తేదీన స్ట్రీమ్ చేస్తామని ఆహా ప్రోమోలో అనౌన్స్ చేసింది. చూడాలి ఈ పవర్ ఫుల్ ఎపిసోడ్  పార్ట్ 1 సృష్టించిన సంచలనాలను పార్ట్ 2 బ్రేక్ చేస్తుందేమో.


అన్‌స్టాపబుల్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ మొదటి భాగం స్ట్రీమింగ్ ఆహాలో ప్రారంభం అయింది. ఈ ఎపిసోడ్‌ ప్రారంభంలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ తమ వ్యక్తిగత అనుబంధం గురించి మాట్లాడుకున్నారు. ‘మనం ఎప్పుడూ కలవమని, అస్సలు మాట్లాడుకోమని అందరూ అంటూ ఉంటారు. ఇదే మనం ఫస్ట్ టైం కలవడం అని అనుకుంటున్నారు.’ అని బాలకృష్ణ అనగా, పవన్ కళ్యాణ్ ‘లేదండీ. మనం కలుస్తూనే ఉంటాంగా.’ అన్నారు.


ఆ వెంటనే సుస్వాగతం సినిమా సమయంలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ మొదటిసారి కలిసిన ఫొటోని కూడా డిస్‌ప్లే చేశారు. ఆ ఫొటో చూశాక ఇద్దరూ ఇప్పటికీ యంగ్‌గానే ఉన్నామని ఒకరికి ఒకరు కాంప్లిమెంట్ ఇచ్చుకున్నారు. ‘2014లో నా బర్త్‌డే గ్రాండ్ కాకతీయకి వచ్చావ్. చాలా థ్యాంక్స్ అమ్మా.’ అని బాలకృష్ణ చెప్పగా, ‘అవునండీ. నాకు గుర్తుంది. క్రికెట్ టైంలో అనుకుంటా.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.


‘బాలకృష్ణ చెన్నైలో ఉన్నప్పుడు అన్నయ్య (చిరంజీవి) పుట్టినరోజు ఫంక్షన్లకు ప్రత్యేక ఆహ్వానం మీద వచ్చేవారు. అప్పుడు ఆయన్ని దూరం నుంచి చూసేవాడ్ని. నేను సినిమాల్లోకి అప్పటికి రాలేదు. మొదటిసారి అన్నయ్య నన్ను మీకు హనీ హౌస్‌లో పరిచయం చేశారు. కానీ అప్పటివి ఫొటోలు ఏమీ లేవు.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.