AP Constable Results :ఏపీలో ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆదివారం (ఫిబ్రవరి 5న) విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు కానిస్టేబుల్ పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీని కూడా పోలీసు నియామక మండలి విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.


రాతపరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు హాజరు కాగా, వారిలో 95,208 మంది అభ్యర్థులు (20.73 శాతం) ఫిజికల్ ఈవెంట్స్‌కు అర్హత సాధించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఓఎంఆర్‌ షీట్లు అందుబాటులో ఉంటాయని బోర్డు వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 6,100 పోస్టుల భర్తీ కోసం జనవరి 22న ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 997 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 200 మార్కులకు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో ఓసీలకు 40 శాతం (80 మార్కులు), బీసీలకు 35 శాతం (70 మార్కులు), ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు 30 శాతం (60 మార్కులు) కటాఫ్‌గా నిర్ణయించారు. 


కానిస్టేబుల్ ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 


కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి.. 


ఫలితాల వివరాలు ఇలా..


                                 


కానిస్టేబుల్ పరీక్షకు 91 శాతం అభ్యర్థులు హాజరు 
ఏపీలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి జనవరి 22న ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 34 నగరాలు, పట్టణాల్లో 997 పరీక్ష కేంద్రాల్లో కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 5,03,487 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నవారిలో 4,58,219 మంది మాత్రమే అంటే 91 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 45,268 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాలేదు. 


పోస్టుల వివరాలు..


* కానిస్టేబుల్ పోస్టులు 


ఖాళీల సంఖ్య: 6100


1) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్- సివిల్ (మెన్/ఉమెన్): 3580 పోస్టులు


జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..



  •  శ్రీకాకుళం-    100

  • విజయనగరం- 134

  • విశాఖపట్నం (సిటీ)-187

  • విశాఖపట్నం (రూరల్)- 159

  • తూర్పు గోదావరి- 298

  • రాజమహేంద్రవరం (అర్బన్)- 83

  • పశ్ఛిమ గోదావరి- 204

  • కృష్ణా- 150

  • విజయవాడ (సిటీ)- 250

  • గుంటూరు (రూరల్)- 300

  • గుంటూరు (అర్బన్)- 80

  • ప్రకాశం- 205

  • నెల్లూరు- 160

  • కర్నూలు- 285

  • వైఎస్సార్ - కడప-  325

  • అనంతపురం- 310

  • చిత్తూరు- 240

  • తిరుపతి అర్బన్- 110

  • మొత్తం- 3580


2) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్- ఏపీఎస్‌పీ (మెన్/ఉమెన్): 2520 పోస్టులు


జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు 



  • ఎచ్చెర్ల- శ్రీకాకుళం  630

  • రాజమహేంద్రవరం 630

  • మద్దిపాడు - ప్రకాశం  630

  • చిత్తూరు- 630

  • మొత్తం- 2520
     


ప్రిలిమినరీ పేపర్ ఎలా ఉందంటే? 
ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి పోలీసు నియామకమండలి జనవరి 22న ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. OMR ఆధారితంగా పరీక్ష నిర్వహించారు. పరీక్ష కోసం మొత్తం 4 సెట్ల ప్రశ్నపత్రాలను ఎంపికచేశారు. అయితే పరీక్షలో అడిగిన ప్రశ్నల తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని విభాగాల నుంచి కఠినమైన ప్రశ్నలు, మరికొన్నింటి నుంచి కొంత సులువైన ప్రశ్నలు వచ్చాయని అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. గతంలో జరిగిన కానిస్టేబుల్ పరీక్షలతో పోలిస్తే ఈసారి ప్రశ్నల స్థాయి బాగా పెరిగిందని పేర్కొన్నారు. సబ్జెక్టుపైన పట్టు, పూర్తి స్థాయిలో అంశాలపై అవగాహన ఉన్నవారే సమాధానాలు గుర్తించగలిగేలా ప్రశ్నలు ఉన్నాయని తెలిపారు. భౌతిక, రసాయన శాస్త్రాలు, ఆంగ్లం నుంచి కఠినమైన ప్రశ్నలొచ్చాయని.. చరిత్ర, పాలిటీ విభాగాల నుంచి అడిగిన ప్రశ్నలు కొంత సులువుగా ఉన్నాయని వారు వివరించారు. భౌతిక శాస్త్రం నుంచి మొత్తం 8 ప్రశ్నలు రాగా.. వాటిలో ఆరు కఠినంగా ఉన్నాయని తెలిపారు. భౌగోళిక, ఆర్థిక శాస్త్రాల ప్రశ్నలు ఓ మోస్తరుగా ఉన్నాయని తెలిపారు. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన ఎక్కువ ప్రశ్నలు అడిగారు. అరిథ్‌మెటిక్, రీజనింగ్ విభాగాల నుంచి సాధారణ స్థాయిలోనే ప్రశ్నలు అడిగినట్లు అభ్యర్థులు చెబుతున్నారు.


Also Read:


'అగ్నివీరుల' నియామక ప్రక్రియలో కీలక మార్పులు, ఈ ఏడాది నుంచే అమలు!
కేంద్ర ప్రభుత్వం కొత్త తీసుకొచ్చిన 'అగ్నిపథ్' స్కీమ్ కింద నిర్వహిస్తున్న అగ్నివీరుల నియామక ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ.. ఇండియన్ ఆర్మీ నిర్ణయం తీసుకుంది. ఆర్మీలో చేరాలనుకునే వారికి మొదట ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్(సీఈఈ) నిర్వహించనుంది. ఆ తర్వాతే ఫిట్‌నెస్, మెడికల్ టెస్టులు నిర్వహించనున్నారు. త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!
'సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్)-2023' నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం (ఫిబ్రవరి 1) విడుదల చేసింది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ సర్వీసెస్‌ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేయనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 21 వరకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ వెల్లడి, పోస్టులెన్నంటే?
ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఎగ్జామినేష‌న్‌-2023 నోటిఫికేషన్‌ను యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఫిబ్రవరి 1న విడుదల చేసింది. దీనిద్వారా ఫారెస్ట్ సర్వీసెస్‌లోని వివిధ పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఫిబ్రవరి 1 నుంచి 21 వరకు వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...