గోవిందరాజులు ఆరోగ్యం గురించి ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు, డాక్టర్ వచ్చి పరిశీలించి వెన్నుపూస మీద ఒత్తిడి పడిందని పరిస్థితి చూస్తుంటే క్రిటికల్ గానే ఉందని అంటాడు. పట్నం తీసుకుని వెల్లమంటారా డాక్టర్ గారు అని రామ అడుగుతాడు. తీసుకెళ్ళవచ్చు కానీ ప్రయాణంలో అటు ఇటు కదిలితే వెన్నుపూస మీద మరింత ఒత్తిడి పడే ప్రమాదం ఉందని అంటాడు. అప్పుడు శాశ్వతంగా నడుం కదిలించలేని పరిస్థితి అవుతుందని చెప్తాడు. దగ్గర్లోనే నాకు తెలిసిన హాస్పిటల్ ఉంది ఇక్కడ ఈ ట్రీట్మెంట్ కి సదుపాయాలు ఉన్నాయో లేదో తెలుసుకుంటాను అంటాడు. నాకేం కాదు మీరు కంగారూ పడకందని ఇంట్లో వాళ్ళకి ధైర్యం చెప్తాడు. సరిగ్గా అదే సమయానికి జానకి వచ్చి టాబ్లెట్స్ ఇస్తుంది.


నడుం నొప్పి ఎక్కువగా ఉన్నపుడు ఇంజెక్షన్ ఇవ్వమని డాక్టర్ గారు చెప్పారు ఇప్పుడు అవి ఉపయోగపడతాయి వెంటనే ఇవి ఇవ్వండని జానకి వాటిని డాక్టర్ కి ఇస్తుంది. గతంలో డాక్టర్ రాసిన మందుల చీటి చూపిస్తుంది. అవి ఎప్పుడో రాసిన మందులని ఇప్పుడు పని చేస్తాయో లేదో తెలియదని కొత్త సమయం వేచి చూడాలని డాక్టర్ చెప్తాడు. అవి వేసిన తర్వాత ఆయనకు విశ్రాంతి అవసరమని చెప్పి డాక్టర్ అందరినీ బయటకి పంపించేస్తాడు. ఇక జ్ఞానంబ గోవిందరాజులకు ఏమవుతుందోనని కంగారూ పడుతుంది. జానకి సమయానికి మందులు తీసుకొని వస్తే అసలు మావయ్య గారికి ఇంత జరిగేది కాదని ఏడుస్తూ నటిస్తుంది. జానకి త్వరగా రాకపోవడం వల్ల మావయ్య గారి ప్రయాణాల మీదకి వచ్చిందని ఎక్కిస్తుంది. ఆ మాటకి జ్ఞానంబ జానకి వైపు సీరియస్ గా చూస్తూ ఉంటుంది.


Also Read: తనను ప్రేమించిన రౌడీబేబీనే శౌర్య అని నిరుపమ్ కి తెలుస్తుందా, సౌందర్యకి జ్వాల ఏం సమాధానం చెబుతుంది!


నిజంగానే పక్కనే ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి రావడానికి పది నిమిషాలు కూడా పట్టదు మరీ నీకు ఇంత టైమ్ ఎందుకు పట్టిందని జ్ఞానంబ జానకిని నిలదిస్తుంది. ఓ వైపు మీ మావయ్య గారి ఆరోగ్య పరిస్థితి తెలిసి కూడా నువ్వు ఎందుకు ఇలా చేశావని తిడుతుంది. ట్యాబ్లెట్స్ తీసుకురావడానికి దాదాపు మూడు గంటలు ఎందుకు పట్టింది సినిమాకి ఏమైనా వెళ్ళింది ఏమో పుల్లలు వేస్తుంటే జానకి మల్లిక నోరు మూయిస్తుంది. మావయ్య గారు బి పి ట్యాబ్లెట్స్ అని చెప్పారు కానీ మెడికల్ షాప్లో వ్యయాలు అవి నడుం నొప్పి మందులని దొరకడం కష్టమని చెప్పడంతో రాజమండ్రి వెళ్ళి తీసుకొచ్చానని చెప్తుంది. దీంతో నువ్వు చాలా మంచి పని చేశావని మెచ్చుకుంటుంది.


ఇక డాక్టర్ వచ్చి గోవిందరాజుల గారికి ప్రమాదం తప్పిందని సమయానికి ఆ ఇంజెక్షన్ తెచ్చి మంచి పని చేశారని జానకిని అభినందిస్తాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కుటుంబం గురించి ఇలా శ్రద్ధ తీసుకునే వ్యయాలు ఒక్కలు ఉన్న చాలు అని జానకిని మెచ్చుకుంటాడు. నీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటామమ్మ అని జానకిని  దాగరకి తీసుకుంటుంది జ్ఞానంబ. అది చూసి మల్లిక కుళ్ళు కుంటుంది.


Also Read: వసు వేసిన పూలదండ చూసి మురిసిన రిషి, పేపర్లో రిషిధార ఫొటో చూసిన దేవయాని-సాక్షికి షాకిచ్చిన జగతి-వసుధార


జానకి గారు మీరే లేకపోతే ఈరోజు ఈ ఇల్లు కన్నీటితో నిండిపోయేది అలాంటిదేమీ జరగకుండా మేరే కాపాదారు. మీరు దేవత లాగా వచ్చి నాన్న ప్రాణాలు కాపాడారు అని ఎమోషనల్ అవతాడు. ఆ రోజు కరెంట్ షాక్ నుంచి కుటుంబాన్ని కాపాడారు, ఈరోజు నాన్న ని మంచానికే పరిమితం కాకుండా కాపాడారు మీకు రుణపడి ఉంటానని అంటాడు. నాన్నగారి ప్రాణాలు కాపాడినందుకు మీకు ఏదో ఒక బహుమతి ఇవ్వాలని అనుకున్నాను. మీకు ఎ బహుమతి కావాలో అడగండి ఇస్తానని అంటాడు. మీ గుండెల్లో చోటు ఉంటే చాలని ఇంకేమీ వద్దని జానకి అంటుంది. నేను మీ భార్యగా నా బాధ్యతని నిర్వర్తించడం లేదని బాధపడుతుంది. మీ మనసు తెలుసుకుని నేను నడుచుకోవడం లేదు మంచి కోడలని అనిపించుకుంటున్న కానీ భార్యగా ఉండటం లేదని అంటుంది. అదేంటి జానకిగారు అలా అంటున్నారని రామా అడుగుతాడు. మీ ఐ పి ఎస్ చదువు కోసమే కదా మనం దూరంగా ఉంటుందని రామా అనడం జ్ఞానంబ విని షాక్ అవుతుంది.