ఇక చిన్మయి కొత్త స్కూల్ కివెళ్ళడం ఇష్టం లేదని చెప్తుంది. ఆ స్కూల్ లో జాయిన్ అవ్వను. నాకు మన స్కూల్ బాగుంటుంది.. ఇది అయితే రోజు అమ్మతో వెళ్ళవచ్చు, నువ్వు నాన్నతో ఆ స్కూల్ కి వెళ్ళు నేను అమ్మతో మన స్కూల్ కి వెళ్తానని అంటుంది. నువ్వు ఒక్కదానివే పోతావ అని దేవి అంటే ఎందుకు అమ్మ నాకు తోడు ఉంటుందిగా నాకు అమ్మతో వెళ్లాడమే ఇష్టం. నువ్వు కలెక్టర్ కావాలనుకుంటున్నావ్ కాబట్టి ఆ స్కూల్కి వెళ్ళు అని చిన్మయి సర్ది చెప్తుంది. చిన్మయి మాటలు విన్న రాధ బాధపడుతుంది.


ఇక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న రాధని సూరి చూస్తాడు. రుక్మిణి లాగా ఉందే అని తన వెనక వెళ్తూ ఉండగా ఊరి జనాలు చూసి ఎవడ్రా వాడు మన రామూర్తి గారి కోడలి వెనకాల పడుతున్నాడని అనుకుంటారు. నడుచుకుంటూ వెళ్తూ ఉండగా రోడ్డు మీద బైక్ అద్దంలో సూరిని రుక్మిణి గమనించి గబగబా వెళ్ళిపోతుంది. సూరికి కనిపించకుండా చెట్టు వెనకాల దాక్కుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఊరి జనాలు సూరిని చుట్టు ముట్టి మా ఊరి ఆడపిల్ల వెంటపడతావా అని కొడతారు. అది చెట్టు చాటు నుంచి చూస్తున్న రుక్మిణి మన్నించు చినమామ అడ్డుపడానికి కూడా లేకుండా పోయిందని బాధ పడుతుంది.


 Also Read: తనను ప్రేమించిన రౌడీబేబీనే శౌర్య అని నిరుపమ్ కి తెలుస్తుందా, సౌందర్యకి జ్వాల ఏం సమాధానం చెబుతుంది!


సూరికి తగిలిన దెబ్బలకి రాజమ్మ కాపడం పెడుతుంటుంది. అక్కడికి దేవుడమ్మ, ఆదిత్య వచ్చి ఏం జరిగిందో అడిగి తెలుసుకుంటారు. వెనక ముందు చూడకుండా అలా ఎలా వెంట పడతావ్ అని సూరిని దేవుడమ్మ తిడుతుంది. నాకేం తెలుసు వదినమ్మ మన రుక్మిణి లాగా అనిపించి వెళ్ళాను ఆ అమ్మాయిని చూడకుండానే ఊరి జనం వచ్చి కొట్టేసారని చెప్తాడు. ఇక ఆదిత్య మీరు చూసింది నిజమే బాబాయ్ కానీ నిజం చెప్పలేని పరిస్థితి అని మనసులో కుమిలిపోతాడు.


దేవి చిన్మయితో ఈ హోం వర్క్ నేను చేయలేకపోతున్న డైరెక్ట్ గా కలెక్టర్ అయ్యే చదువు చవించమని నాయనకి చెప్తా అంటుంది. అప్పుడే అక్కడికి మాధవ వస్తాడు. నాయన నేను కలెక్టర్ చదువు చదువుతా నన్ను సీదా ఆ క్లాస్ లో  చేర్పిస్తావా అని అమాయకంగా అడుగుతుంది. అలా కుదరదని చెప్తాడు. ఇక రాధ పిల్లని తినడానికి పిలుస్తుంది. అమ్మా నాయన చదువు ఎంత బాగా చదువుకోవాలో చెప్పాడని చెప్తుంది. మీ నాయన ఏమి కలెక్టర్ కాదు కదా అదే ఆ ఆఫీసర్ సార్ అయితే మంచిగా చెప్తాడు. మంచి స్కూల్ లో చేర్పిస్తాడు నీకు చదువు మంచిగా వస్తుందని అంటుంది. దానికి మాధవ అవును ఆ ఆదిత్య చెప్పినట్టు విని ఆయన చేర్పించిన స్కూల్ లోనే చేరు నువ్వు బాగా చదువుకోవడమే నాకు కావాల్సిందని కల్లబొల్లి మాటలు చెప్తాడు. నేను ఉండగా ఆ ఆదిత్య చేర్పించిన స్కూల్ లో ఎలా చేరనిస్తానని మనసులో అనుకుంటాడు.


సత్య, ఆదిత్య మాట్లాడుకుంటూ ఉండగా సూరి నొప్పులతో అల్లాడుతూ అక్కడికి వస్తాడు. మీరు ఎవరినో చూసి అక్కయ్య అనుకున్నారు అక్క ఇక్కడ ఎందుకు ఉంటుందని సత్య అంటుంది. అక్కయ్య ఇక్కడే ఉందని మనకి తెలిసిన ఇంట్లో వాళ్ళకి చెప్పలేకపోతున్నామని బాధగా ఉందని సత్య ఆదిత్యతో అంటుంది. మనం అమెరికా వెళ్ళేలోపు ఏదో ఒకటి చేద్దామని అంటాడు. అప్పుడే అదిత్యకి రుక్మిణి ఫోన్ చేస్తుంది. నువ్వు పిల్లలని వేరే స్కూల్ లో చేర్పిస్తాను అంటే మాధవ సారు అడ్డు చెప్పకుండా సరే అన్నాడు నాకేదో అనుమానంగా ఉందని రుక్మిణి చెప్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు పెనిమిటి నేను నీకు ఇప్పుడు ఏం చెప్పలేను నువ్వు మాత్రం జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. రుక్మిణి ఏంటి ఇలా చెప్తుంది మాధవ వల్ల నాకు ప్రమాదం ఏముంది అని ఆలోచిస్తాడు.


Also Read: ముదిరిన టామ్ అండ్ జెర్రీ వార్ - రిషిని రెస్టారెంట్ కి రమ్మన్న వసు, సాక్షితో కలసి వెళ్లి షాకిచ్చిన ఈగో మాస్టర్


ఇక వాళ్ళ మాటలు విన్న మాధవ ఆదిత్య అనే వాడు రాకపోతే నిన్ను నేను ఎప్పుడో సొంతం చేసుకునేదాన్ని. వాడు రావడం వల్ల అటు దేవిని ఇటు నిన్ను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు ఎన్ని జాగ్రత్తలు చెప్పిన నా ఎత్తులకి మీరు చిత్తు కావడం తప్ప ఏముందని అనుకుంటాడు. అప్పుడే మాధవ తన చేతి మీద ఉన్న దేవి పేరు పచ్చబొట్టు లేకపోవడాన్ని గుర్తు పడతాడు (గతంలో స్కెచ్ తో దేవి అని మాధవ రాసుకుంటాడు). అదే టైమ్ కి అక్కడికి దేవి వస్తుంది. నీ చెయ్యి చాపు అని అంటుంటే తన చేతి మీద పచ్చబొట్టు లేకపోవడాన్ని ఎక్కడ చూస్తుందో అని మాధవ కంగారు పడతాడు. దాన్నుంచి తప్పించుకోవడానికి మ్యాజిక్ చేస్తాను నువ్వు కళ్ళు మూసుకోమని చెప్పి వెళ్ళి గబగబా స్కెచ్ తీసుకుని దేవి అని రాసుకునేందుకు ప్రయత్నిస్తాడు. నేటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.