కార్తీకదీపం జులై 6 బుధవారం ఎపిసోడ్ (Karthika Deepam jly 6 Episode 1397) 


శౌర్య అభినందన సభకు గెస్టులుగా వెళతారు సౌందర్య, ఆనందరావు , హిమ. దొంగల్ని పట్టించి ధైర్యాన్ని ప్రద్శించిన శౌర్యకి అవార్డ్ ఇచ్చేందుకు హిమని స్టేజ్ పైకి పిలుస్తారు నిర్వాహకులు.  తాను వెతుకున్న హిమ...తింగరి ఇద్దరూ ఒకటే తెలిసి స్టేజ్ పైనే లాగిపెట్టి హిమని కొడుతుంది శౌర్య.  నువ్వు హిమవా, ఇన్నాళ్లూ నాకెందుకు చెప్పలేదని నిలదీస్తుంది. నిన్ను చంపేస్తాను , ఇంత మోసం చేస్తావా, నపక్కనే ఉన్నావ్, నా స్టోరీ తెలుసుకుంటావ్, నా శత్రువు గురించి చెబుతుంటే వింటావ్, నా ప్రేమను లాగేసుకుంటావ్, నా డాక్టర్ సాబ్ ని దూరం చేస్తావ్, పెళ్లి చేసుకుంటావ్, నువ్వు మహా మోసగత్తెవే అని ఫైర్ అవుతుంది. హిమ ఎంత చెబుతున్నా అస్సలు వినదు. అటు ఆనందరావు, సౌందర్యని కూడా అవమానిస్తుంది..... ( ఇదంతా హిమ కల)


హిమగారూ జ్వాలగారికి మొమెంటో అందించండి అన్న పిలుపుతో ఉలిక్కి పడుతుంది హిమ. అటు జ్వాల షాక్ అవుతుంది. ఇద్దరికీ పరిచయం అయినప్పటి నుంచీ జరిగినవన్నీ గుర్తుచేసుకుంటుంది జ్వాల. జ్వాల కోపంగా చూస్తుండగా హిమ భయపడుతూ అవార్డ్ అందిస్తుంది. 
జ్వాల: నమస్తే డాక్టర్ హిమ గారూ...కంగ్రాట్స్ చెప్పరా అని హ్యాండ్ ఇస్తుంది...మహానటి..నేనొక రెండు మాటలు మాట్లాడొచ్చా అనగానే మాట్లాడండి అంటారు. హిమ స్టేజ్ పైనుంచి దిగిపోతుంటే మీరు ఆగండి అని పిలుస్తుంది జ్వాల. నాకు అవార్డు ఇచ్చిన మీకు నమస్కారం. మీకైతే(సౌందర్య-ఆనందరావు) పెద్ద నమస్కారం. డాక్టర్ హిమగారూ మీరు ఎందరి ప్రాణాలో కాపాడి ఉంటారు కదా... మీకు మహా నమస్కారాలు, వేల వేల నమస్కారాలు,నన్నేదో ధైర్యవంతురాలు అని పొగుడుతూ ఈ అవార్డ్ ఇచ్చారు. అంతకన్నా నాకేం కావాలి. గొప్ప డాక్టర్, గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చిన డాక్టర్ హిమగారి చేతుల మీదుగా అవార్డ్ అందుకోవడంతో నా జన్మ ధన్యమైంది.డాక్టర్ హిమ గారూ మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు నా మనసు పొంగిపోతోంది. మిమ్మల్ని, మీరిచ్చిన గొప్ప జ్ఞాపికను జీవితంలో మర్చిపోలేను. ఆటో నడిపే నాకు అవార్డ్ ఇవ్వడమే గొప్ప అనుకుంటే ఇంత గొప్పవారి చేతులమీదుగా అందుకోవడం ఎంత గొప్పో కదా...నాకు ఆనందంతో కళ్లలో నీళ్లు వస్తున్నాయ్. 
సౌందర్య మేడం నమస్తే మేడం...ఆనందరావు సార్ నమస్తే సార్...ఇదంతా మీ ఆధ్వర్యంలోనే జరిగింది కదా ( శౌర్య ఏ ఉద్దేశంతో అంటోందో సౌదంర్య, ఆనందరావు, హిమకు మాత్రమే అర్థమవుతుంది). నేను చెప్పేది అవార్డ్ కార్యక్రమం కోసమే...మీ ఫ్యామిలీ గ్రేట్ సార్...అందరూ గొప్పోళ్లు. ....థ్యాంక్యూ అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ....


Also Read: జ్వాల(శౌర్య)కి నిజం తెలిసిపోయింది, ఇప్పుడు హిమ పరిస్థితేంటి - సౌందర్య రియాక్షన్ ఎలా ఉండబోతోంది!


టీవీలో ఈ ప్రోగ్రాం చూస్తాడు నిరుపమ్. సంతోషంగా తల్లి స్వప్నను పిలిచి చూపిస్తాడు. జ్వాలకు అవార్డ్ ఇచ్చారు అని సంబరంగా చెబుతుంటే రిమోట్ లాక్కుని టీవీ ఆఫ్ చేస్తుంది స్వప్న. 
స్వప్న: ఆ మనవరాలే కాదు ఈ పెద్దవాళ్లిద్దరూ కూడా ఆటోదాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు...స్థాయి తక్కువ వారిని చేరదీస్తున్నారు వీళ్లకి ఎప్పుడు బుద్ధి వస్తుందో.  మీ డాడీని అనాలి... దాంతో ఫ్రెండ్ షిప్ ఏంటో, నీకు దాంతో పరిచయం ఏంటో అర్థంకావడం లేదు. 
నిరుపమ్: వాళ్లు అవార్డు ఇచ్చారు, తను తీసుకుంది ...మనం ఎందుకు గొడవపడాలి
స్వప్న: మీ అమ్మమ్మ, తాతయ్యకి అయినా బుద్ధి ఉండాలి కదా
జ్వాల తనకు ప్రపోజ్ చేసినవిషయాన్ని గుర్తుచేసుకుంటాడు నిరుపమ్....
అటు కార్యక్రమం అయిన తర్వాత ఇంటికి వెళుతూ... హిమ అదే విషయాన్ని, జ్వాల మాటల్ని తలుచుకుంటుంది. 
సౌందర్య: అయిపోయింది ఆనందరావుగారూ...ఆఖరి ఆశ కూడాపోయింది. శౌర్య ఎక్కడుందో అనుకున్నాం. జ్వాలే శౌర్య అని తెలిశాక ఎప్పుడొస్తుందో అని ఎదురుచూశాం. ఇవాల్టితో శౌర్య మనకు దక్కదు అని అర్థమైపోయింది. ఏదైతే జరగొద్దు అనుకున్నామో అదే జరిగింది. 
ఆనందరావు: సరిగ్గా మనం ముగ్గురం ఒకేచోట దానికి దొరికిపోయాం సౌందర్య
హిమ: శౌర్య ఏ స్టెప్ వేస్తుందో అని భయం వేస్తోంది...
సౌందర్య: నువ్వు దాని మంచికోసమే అంతా చేశావ్...కానీ అది దానికి అర్థం కాలేదు...నువ్వేం చేస్తావ్
ఆనందరావు: గట్టిగా అరిచి తిట్టినా బావుండేది
సౌందర్య: శౌర్య అరవలేదు, కేకలు వేయలేదు, తిట్టలేదు..అంటే..ఆ బాధని ఆవేదనని గుండెల్లోనే దాచుకుంది. కోపం కన్నా అది చాలా ప్రమాదం
హిమ: శౌర్య మౌనం చూస్తుంటే నాకు భయం వేస్తోంది నానమ్మా...
ఆనందరావు: శరీరానికి అయిన గాయం కనిపిస్తుంది...మనసుకి అయిన గాయం కనిపించదు...ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరం ఊహించలేం...
ఆనందరావు మాట వినగానే సౌందర్య కారు రివర్స్ తిప్పుతుంది.....


Also Read: జ్వాలకి మరో ఇద్దరు శత్రువులు, నిరుపమ్-శౌర్యని ఒక్కటి చేసేందుకు హిమ ఏం చేయబోతోంది!


అటు జ్వాల(శౌర్య) ఆవేశంతో ఊగిపోతుంటుంది. తింగరి పరిచయం అయినప్పటి నుంచీ జరిగినవన్నీ గుర్తుచేసుకుంటుంది. మోసం ..మోసం ...తింగరి హిమ అవడం మోసం...తెలిసి చెప్పకపోవడం మోసం....నానమ్మా తాతయ్య కూడా చివరికి మోసం చేశారు. ఇంత మోసమా...అంతా మనవాళ్లే అయినా మోసం చేశారని ఏడుస్తుంది. నేను ఏడుస్తున్నాను...నేనెందుకు ఏడవాలి.. నేను ఏడవను .. మోసం చేసింది వాళ్లు..వాళ్లని ఏడిపించాలి కానీ నేనెందుకు ఏడవాలి.. నేను శౌర్యని ధైర్యంగా నిలబడతాను. జీవితంలో వాళ్ల మొహాలు మళ్లీ చూడను...


రేపటి( గురువారం) ఎపిసోడ్ లో
మేం అంతా ఇక్కడ ఉండగా నువ్వెక్కడికి వెళతావ్ అని సౌందర్య. ఎవరు మీరు అని క్వశ్చన్ చేస్తుంది జ్వాల. నన్ను గుర్తుపట్టి కూడా మీరు పిలవలేదని జ్వాల... మరి నువ్వెందుకు పిలవలేదని సౌందర్య ఒకర్నొకరు క్వశ్చన్ చేసుకుంటారు. నేను మిమ్మల్ని పిలవకపోవడానికి కారణం హిమ అంటూ తన చేతిపై ఉన్న పచ్చబొట్టు చూపిస్తుంది....


Also Read: ముదిరిన టామ్ అండ్ జెర్రీ వార్ - రిషిని రెస్టారెంట్ కి రమ్మన్న వసు, సాక్షితో కలసి వెళ్లి షాకిచ్చిన ఈగో మాస్టర్