గుప్పెడంతమనసు జులై 4 సోమవారం ఎపిసోడ్ (Guppedantha Manasu  July 4 Episode 493)


అభినందన సభలో భాగంగా.... తన మెడలో దండ తీసి రిషి మెళ్లో వేస్తుంది వసుధార.  అదంతా గుర్తుచేసుకుని మండిపడుతుంటుంది దేవయాని. ఏంటిదంతా మహేంద్ర , నవ్వేంటి జగతి చూస్తూ ఊరుకున్నావ్ అని ఊగిపోతుంటుంది. దేవయానికి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే.. స్పందించిన జగతి.. మహేంద్ర ఒకరికి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం మనకు లేదంటుంది. 
దేవయాని: అదేంటి మీకేం సంబంధం లేదంటారా...
జగతి: మీరు కూడా అక్కడే ఉన్నారుగా... మీరు అనుకున్నది జరగలేదనే బాధ, వసు దండ వేసిందనే అక్కసు అని అర్థమవుతోంది
దేవయాని: ఇంతలో అక్కడకు వచ్చిన గౌతమ్ నిలదీస్తుంది...ఏంటిదంతా అని
గౌతమ్: నాక్కూడా అర్థం కాలేదంటాడు... అప్పుడే రిషి రావడంతో అదిగో వాడినే అడగండి...
దేవయాని: వసుధార నీ మెడలో దండ వేయడాన్ని పెద్ద విషయంగా భావిస్తున్నారు..నువ్వేం సీరియస్ గా తీసుకోకు ఏదో అలా జరిగిపోయింది అంతే. ఎవరైనా నిన్ను అడిగినా పెద్దగా పట్టించుకోకు నాన్నా. నువ్వెక్కడ ఫీలవుతున్నావో అని నేను ఫీలవుతున్నాను ( క్షణాల్లో ప్లేట్ మార్చేశావ్ కదా అనుకుంటారంతా)
రిషి: ఓ విషయాన్ని చూసేదాన్ని బట్టి ఆలోచించేదాన్ని బట్టి అందులో మంచి చెడులు మారుతాయి... అందరూ ఇలా మాట్లాడుకోవడం నచ్చలేదు. 
జగతి: వసు చేసిన దాన్ని రిషి మర్చిపోకుండా అక్కయ్య రెచ్చగొడుతోంది..
దేవయాని: కన్నతల్లినే నీ మనసులో లేకుండా చేయగలిగాను..వసుధార లాంటి అమ్మాయిని దూరం చేయలేనా... రిషిని సున్నాలా మార్చి అవసరానికి తగ్గట్టు స్థానాన్ని మార్చి వాడుకుంటాను అనుకుంటుంది. 
అక్కడి నుంచి బయటకు వెళ్లిన మహేంద్ర... దండేది అనుకుంటూ కారంతా వెతుకుతాడు... సీట్లో లేదే అనుకుంటుండగా కార్లో ముందు కనిపిస్తుంది. నువ్వుసూపర్ రా పుత్రా అని నవ్వుకుంటాడు మహేంద్ర....


Also Read: రిషిని వసు రిజెక్ట్ చేసిన వీడియో ప్లే చేసేశారు, దేవయాని-సాక్షి కి వసుధార ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ ఏంటి!



వసుధారకి కాల్ చేసిన గౌతమ్...ఫోన్లో తెగ పొగిడేస్తుంటాడు. ఎవర్రా అని రిషి అడిగితే మాట్లాడు నీకే తెలుస్తుంది అని ఫోన్ చేతిలో పెట్టేస్తాడు. హలో ఎవరండీ అని రిషి అంటే...నేనే అంటుంది వసుధార. వెంటనే కాల్ కట్ చేసేసి గౌతమ్ పై మండిపడతాడు రిషి. 


గౌతమ్: నీ మెళ్లో వసుధార దండెందుకు వేసిందని అడగాలని కాల్ చేశాను. నేనెటూ అడగలేను నువ్వైనా అడగాలని ఫోన్ చేసి ఇచ్చాను.... వసుధార ఆ దండ నీ మెళ్లో ఎందకు వేసిందంటావ్...
రిషి: ఆ టాపిక్ ఆపకపోతే నీ ఫొటోకి దండ వేస్తాను....
గౌతమ్: ఆ టాపిక్ అడగను లే... కానీ...దండ వేశాక నీ మానసిక పరిస్థితి ఏంటి...
అటు వసుధార సేమ్ టాపిక్ ఆలోచిస్తుంది... నేను దండ వేశాక సార్ మానసిక పరిస్థితి ఏంటి?....దండ వేసిన నాకే ఇలా ఉంటే సార్ కి ఎలా ఉండాలి
గౌతమ్: కొందరికి కోపం వస్తే పక్కవాళ్లపై పెట్టి తిడుతుంటారు...అదే ప్రేమ కలిగితే ... కోపం వచ్చినప్పుడు కోపం చూపించినట్టే ప్రేమను కూడా ఏదో ఒక రకంగా ఎక్స్ ప్రెస్ చేసేవారుంటారు. మనసులో ఏదీ లేకుండా ఇలా దండ వేస్తారా
రిషి: పిచ్చోడా నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావ్....అలాంటివేమీ ఉండవ్... ( నేను మిమ్మల్ని ప్రేమించలేను..అసలు మీది ప్రేమే కాదు అన్న వసు మాట గుర్తుచేసుకుంటాడు). చిన్నప్పుడు కళ్లకు గంతలు కట్టుకుంటే దాగుడుమూతలు అంటాం...పెద్దయ్యాక అవే గంతలు కొందరు మనసుకి కట్టుకుని తిరుగుతుంటారు. ఆకాశంలో చందమామ ఇక్కడి నుంచి చూస్తే అందంగా కనిపిస్తాడు...అంతేకానీ ఆ చందమామని బెడ్ ల్యాంప్ లా పెట్టుకోవాలి అనుకుంటే బావోదు అనేసి వెళ్లిపోతాడు.
వసుధార: రిషి సార్ కి నాపై చాలా కోపం ఉంది..దండ వేశాక ఇంకా ఎక్కువైంది. ఆ కోపాన్ని నేనే తగ్గించుకోవాలి..అది అచ్చంగా నా బాధ్యతే. రిషి సార్ కోపాన్ని ఎలా తగ్గించాలో నాకు తెలుసు..


Also Read: అభినందన సభలో గందరగోళం - రిషిని అవమానించిన దేవయాని,సాక్షికి వసు ఇచ్చే సమాధానం ఏంటి!
కార్లో రిషి వదిలేసిన దండను డ్రైవర్ తీసుకొస్తాడు. 
దేవయాని: చెత్తని ఇంటికి తీసుకొస్తావేంటి..తీసుకెళ్లి చెత్తకుప్పలో పారేసెయ్ అంటుంది
జగతి: వెళ్లిపోతున్న డ్రైవర్ చేతిలో పూలమాల తీసుకుంటుంది 
దేవయాని: జగతి నువ్వేం చేస్తున్నావో అర్థం అవుతోందా...అదెందుకు నీకు. దాన్నేం చేస్తావ్..ఫ్రేమ్ కట్టించుకుంటావా
జగతి: అక్కయ్యా..కొన్ని వస్తువులకు విలువకట్టలేం..వాటి సందర్భాన్ని బట్టి వాటి విలువ పెరుగుతుంది. అలాంటి జ్ఞాపకాలు ఆలోచనలు మీకు తెలియవు, చెప్పినా అర్థం కావు. ఇది నా కొడుక్కి దక్కిన గౌరవం అనుకుంటాను....
దేవయాని: గౌరవం కాదు...నీ శిష్యురాలు రిషికి విసిరిన వల... నీ ఆటలు సాగనివ్వను
జగతి: నేను ఆట మొదలెడితే మామూలుగా ఉండదు...అయినా నీలా తొండి ఆటలు ఆడను...మీ ఆట కట్టేరోజు త్వరలోనే వస్తుందనుకుంటాను
అప్పుడే వచ్చిన మహేంద్ర వావ్..జగతి... ఈ దండను నువ్వు బాగా చూసుకోవాలి..
దేవయాని: ఈ దండను తీసుకెళ్లి రిషిని బాధపెడతారా...
అప్పుడే అక్కడకు వచ్చిన రిషి..మేడం...ఆ దండను అనేసి ఆగిపోతాడు..
జగతి: చెత్తకుప్పలో వేద్దామాని....
రిషి:మనుషులపై కోపాన్ని పూలదండపై చూపిస్తారా అని లాక్కుంటాడు రిషి...
దేవయాని ముఖం మాడిపోతుంది...
రిషి: మనుషుల్ని, మనసుల్ని దూరం చేయడం...విసిరి కొట్టడం మీకు అలవాటే కదా అనేసి రిషి వెళ్లిపోతాడు...
జగతి: మీరు పూలదండని చెత్తకుప్పలో వేయమన్నారని...రిషికి చెబితే మీ పరిస్థితేంటో ఆలోచించండి..ఈ రకంగా నిజం చెప్పకుండా మీకు మేలే చేశాను మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి.... ఏమంటావ్ మహేంద్రా...
దేవయాని: జగతి..అని గట్టిగా అరుస్తుంది 
జగతి: రిలాక్స్ అక్కయ్యా... అసలే వయసు పైబడుతోంది..బీపీ, షుగర్ తెచ్చుకోకండి... థ్యాంక్సే కదా అడిగాను చెప్పనంటే పోలేదా..దానికి గట్టిగా అరవాలా
దేవయాని: నా పట్టుజారిపోతున్నావ్ రిషి. నిన్ను ఎలా నా దారికి తెచ్చుకోవాలో నాకు తెలుసు...


Also Read: హిమని అపార్థం చేసుకుని మోనితతో పోల్చిన శౌర్య, మనసు మార్చుకోని డాక్టర్ సాబ్


అటు రూమ్ కి దండ తీసుకెళ్లిన రిషి..నీకు మనిషి విలువ, మనసు విలువ తెలియదు. నన్ను వద్దనుకున్నావ్ కానీ జ్ఞాపకాలను ప్రేమించడం నీ దగ్గరే నేర్చుకున్నాను అనుకుంటాడు. అటు కాలేజీలో నడుస్తూ వెళుతూ అదే విషయం గురించి ఆలోచిస్తుంది వసుధార. వెనుకే కారులో వచ్చిన  సాక్షి... వసు పక్కనే కారు ఆపుతుంది. 
సాక్షి: హలో ఏంటి..హారన్ కొడుతుంటే వినిపించడం లేదా, దారి తప్పుకోవాలని తెలియదా
వసు: నేను దారితప్పుకోను..నేను వెళ్లే దారి కరెక్టే...నేను వెళ్లే దారిలోకే నువ్వు వస్తున్నావ్...నేనెందుకు తప్పుకోవాలి
సాక్షి: నేను వెళ్లేదారి నుంచి నిన్ను ఎలా తప్పించాలో నాకు తెలుసు
వసు: అందని వాటికోసం ఆరాటపడడం అవివేకం
సాక్షి: అందని వాటిని అందుకోవడంలో కిక్ ఉంటుంది
వసు: ఆకాశంలో చందమామని అందుకోవడం కిక్ అనుకోరు..మూర్ఖథ్వం అంటారు


రేపటి( మంగళవారం) ఎపిసోడ్ లో
రిషి రూమ్ కి వెళ్లిన సాక్షి...మీ ఇద్దరి ఫొటో పేపర్లో వచ్చింది అసలేంటిది అని నిలదీస్తుంది. అటు వసుధార ఆ పేపర్ తీసుకుని మురిసిపోతుంది. ఇలా పేపర్ తీసుకొచ్చి కాలేజీలో అందరికీ చూపించావ్ చూడు టచ్ చేశావ్ అంటూ చాక్లెట్ ఇస్తుంది.