కార్తీకదీపం జులై 1 శుక్రవారం ఎపిసోడ్ (Karthika Deepam july 1 Episode 1393)


నిన్నటి(గురువారం) ఎపిసోడ్ లో జ్వాల దగ్గరకు వెళ్లిన సౌందర్య, ఆనందరావులు.. ‘జరిగిందేదో జరిగింది మంచి సంబంధం చూస్తాం పెళ్లి చేసుకో’ అంటారు. దాంతో జ్వాల ఆవేశంతో ఉగిపోతుంది...వెంటనే సారీ చెబుతుంది. నిన్నటి ఎపిసోడ్ ఇక్కడే ముగిసి ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడే ప్రారంభమైంది. 
జ్వాల: నా జీవితంలో చెల్లి లేనట్టే పెళ్లి కూడా లేదు,  ఈ విషయాన్ని వదిలిపెట్టండి. ఇంకెప్పుడు పెళ్లి గురించి మాట్లాడొద్దు. డాక్టర్ సాబ్‌ని తప్ప మరొకరిని నేను ఊహించుకోలేను


అటు హిమ...  ఇటు శౌర్య  తల్లిదండ్రుల ఫొటోస్ పట్టుకుని వారిలో వారే మాట్లాడుకుంటారు
హిమ: శౌర్య కోసం ఏమీ చేయలేకపోతున్నాను, ఏం చేసినా కూడా మీకిచ్చిన మాట నిలబెట్టుకోలేక పోతున్నాను, నా మూలంగా శౌర్య కష్టాలు పడుతోంది అని బాధపడుతుంటుంది. 
శౌర్య:  తండ్రి ఫొటో పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఓ ఆడపిల్లని అని మరిచిపోయిన నాకు డాక్టర్ సాబ్ ని చూశాక కొత్త జీవితం మొదలైనట్టు అనిపించింది. కానీ తింగరి చేతిలో మోసపోయాను. అమ్మా నీ జీవితంలోకి మోనిత ఆంటీ వచ్చి నిన్నెలా విసిగించిందో..ఆ తింగరి కూడా డాక్టర్ సాబ్ ని అలా చేసిందని అపార్థం చేసుకుంటుంది. 
హిమ: అసలు శౌర్య మనతో కలసి ఎన్నాళ్లుందని
శౌర్య: ఏ బంధం లేదు...ఏడవడం కూడా మర్చిపోయాను
హిమ: శౌర్యకి ఎవ్వరి ప్రేమా లేదు...అందరికీ దూరమైంది..నిరుపమ్ బావతో పెళ్లి చేయడం తప్ప ఇంకేం లేదు...అయినా నేను ఓడిపోలేదు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. నానమ్మ తలుచుకుంటే ఏమైనా చేయగలదు..ఈ ప్రయత్నం సక్సెస్ అయ్యేలా చేయండి
శౌర్య: నా అన్న వాళ్లు అందరూ ఉన్నా ఎవ్వరూ లేనిదానిలా మిగిలాను...మీరే లేనప్పుడు ఎవ్వరున్నా లేకపోయినా ఏంటి..వంటరిగానే పోరాడుతాను నాన్నా....


Also Read: రిషిని వసు రిజెక్ట్ చేసిన వీడియో ప్లే చేసేశారు, దేవయాని-సాక్షి కి వసుధార ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ ఏంటి!


శౌర్య దగ్గర్నుంచి వచ్చిన  సౌందర్య, ఆనందరావు హిమను ఓదార్చుతారు. 
సౌందర్య: శౌర్యపై ప్రేమ ఉన్నంత మాత్రాన నువ్వు అలా ఆలోచించడం కరెక్ట్ కాదు
ఆనందరావు: శౌర్య నిరపమ్ ని ఇష్టపడుతోందని నువ్విలా చేయడం కరెక్ట్ కాదు
హిమ: చిన్నప్పటి నుంచీ నా కారణంగానే శౌర్య కష్టాల్లో పెరిగింది...ఈ కారణంగా అయినా అది సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా
సౌందర్య:   నిరుపమ్‌ని పెళ్లి చేసుకో.. సౌర్యకి కావాలంటే మంచి సంబంధం చూద్దాం.. నీ వైపే కాదు నిరుపమ్ తరపున కూడా ఆలోచించాలి, నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం కరెక్ట్ కాదు..
ఆనందరావు: చిన్నప్పటి నుంచీ నిన్ను మందలించాలంటే మాకు మనసొప్పేది కాదు..గట్టిగా ఏమైనా అంటే నీకు జ్వరం వచ్చేది. అంత సున్నితమైన మనసు నీది..అలాంటిది ఇంత భారం లా మోస్తున్నావు
సౌందర్య: నిరుపమ్ కి కూడా కొన్ని ఆశలుంటాయి..వాడి ఇషశ్టానికి వ్యతిరేకంగా శౌర్యని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకోవడం కరెక్ట్ కాదు. నీ ఇష్టాన్ని నువ్వు త్యాగం చేసుకోగలవు కానీ ఎదుటివారి ప్రేమను త్యాగం చేయాలని చెప్పడం సరికాదు
హిమ: శౌర్యకి నాపై పట్టలేనంత ద్వేషం ఉంది...అమ్మా నాన్న చావుకి కారణం నేనే అని ద్వేషం పెంచుకుంది. తనకి ఇంతకు మించి మనమేం చేయలేం.. ఈ రకంగా అయినా నాపై తనకున్న కోపాన్ని తగ్గించిన దాన్ని అవుతాను
సౌందర్య: నీ వల్ల పొరపాటు జరిగిందేమో కానీ నువ్వు తప్పు చేయలేదు కదా.. జరిగిందేదో జరిగిపోయింది. దేవుడు వాళ్లకి అంతే ఆయుష్షు ఇచ్చారనుకుందాం.. శౌర్య ఏదో విధంగా అర్థం చేసుకుంటుంది. ఓసారి చెప్పిచూస్తే నీ తప్పేం లేదని తెలుస్తుంది. అప్పుడు నీపై ఉన్న ద్వేషం కూడా పోతుంది.
ఆనందరావు: నీ ఆటవస్తువుని శౌర్యకి ఇచ్చేసినట్టు నిరుపమ్ ని తనకి ఇచ్చేస్తానని చెప్పడం సరికాదు
హిమ:   ‘నాకు అర్థమైంది. మీరు సౌర్య, నిరుపమ్ బావల పెళ్లికి ఒప్పుకోరని నాకు అర్థమైంది. నా ప్రయత్నాలేవో నేను చేస్తాను.. దీనికి మాత్రం అడ్డు రాకండి..’ 
ఆనందరావు:  ‘ఏం అంటున్నావ్ అమ్మా నువ్వు?’ మళ్లీ ఏం ఆలోచిస్తున్నావ్. 
సౌందర్య:  ‘ఏంటే నిశ్చితార్థంలో లేచి వెళ్లిపోయినట్లు.. చివరి నిమిషంలో పెళ్లిలో కూడా అలానే చేద్దాం అనుకుంటున్నావా? నేను బతికి ఉండగా అలాంటి పనులు చేయకు.. ఇప్పటికే తలెత్తుకోకుండా చేశావ్.. ఇంకా మనసులో అలాంటివేమైనా ఉంటే తీసెయ్’


Also Read: హిమ-శౌర్య ఒక్కటయ్యారు, ఇక డాక్టర్ సాబ్ మనసు మార్చుకోక తప్పదేమో!


కట్ చేస్తే.. గుడిలో హిమ-నిరుపమ్ ముడుపు కట్టిన విషయం గుర్తుచేసుకుంటుంది జ్వాల. ఇంతలో  దుర్గ నుంచి కాల్ వస్తుంది. ‘రవ్వ ఇడ్లీకి యాక్సిడెంట్ అయ్యింది . ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటికి తీసుకొచ్చాను అంటాడు. జ్వాల వెంటనే బయలుదేరుతుంది. అటు హిమ..రవ్వ ఇడ్లీకి ఇంజెక్షన్ ఇచ్చేందుకు సిద్ధపడుతుంది.  ‘అమ్మో టాబ్లెట్స్ ఇవ్వు డాక్టరమ్మా.. ఇన్‌జెక్షన్ వద్దు’ అంటాడు రవ్వ ఇడ్లీ. ‘రేయ్ నాకు ఇన్‌జెక్షన్ చేయడం అంటే భయంగా ఉండేది తెలుసా.. జ్వాల వల్లే నేను అన్నీ నేర్చుకున్నాను..’ అంటుంది. ‘అవును డాక్టరమ్మా.. జ్వాలను తలుచుకుంటే చాలా ధైర్యంగా అనిపిస్తుంది నాకు కూడా.. నాకు జ్వాల నవ్వు అంటే చాలా ఇష్టం తెలుసా? కానీ ఎప్పుడో ఒకసారి నవ్వుతుంది’ అంటాడు ఆనంద్(రవ్వ ఇడ్లీ). ‘నాకు తనంటే ఇష్టంరా’ అంటుంది హిమ. సరిగ్గా అప్పుడే జ్వాల వస్తుంది. 
ఆనంద్ ( రవ్వఇడ్లీ):‘హేయ్ జ్వాలా ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం.. డాక్టరమ్మకు నువ్వే ధైర్యం నేర్పించావట కదా? నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాను.. తనకీ ఇష్టం అంటోంది’ అంటాడు రవ్వ ఇడ్లీ. జ్వాల రగిలిపోతూ హిమవైపు చూస్తుంది. ‘నీకో విషయం తెలుసా? నీ పేరు చెబుతూ ఇన్‌జెక్షన్ చేసింది అసలు నొప్పే తెలియలేదు తెలుసా’
జ్వాల:  లాగిపెట్టి కొట్టానంటే అప్పుడు నొప్పి తెలుస్తుంది.. వెధవ చూసుకోవాలి కదా? చూశావా దెబ్బలు ఎలా తగిలాయో?
ఆనంద్: నేను పక్కకే నడుస్తున్నా.. వాడే చూసుకోకుండా వచ్చి గుద్దేశాడు.. నాకు దెబ్బలు పూర్తిగా తగ్గేదాకైనా రోజు మీరిద్దరూ వస్తారు కదా? మీరిద్దరూ నా సొంత అక్కలు అయితే ఎంత బాగుండేదో కదా 
జ్వాల డబ్బులు తీసి పక్కన పెడుతుంది. 
ఆనంద్: ఏంటి జ్వాలా వచ్చినప్పుడల్లా డబ్బు ఇస్తావ్.. నువ్వు వస్తే చాలు. 
జ్వాల: ట్రీట్మెంట్ చేయించుకుంటున్నావ్ కదా.. ఫీజ్ ఇవ్వు అంటూ హిమవైపు సైగచేస్తుంది జ్వాల కోపంగా...నేను మళ్లీ వస్తానంటూ రవ్వ ఇడ్లీ తల నిమిరి.. అక్కడ నుంచి వెళ్లబోతుంది జ్వాల. ఆనంద్:  జ్వాల అంటే ఇష్టం అన్నావ్ వచ్చాక మాట్లాడవేంటీ డాక్టరమ్మా
జ్వాల: రేయ్ రవ్వ ఇడ్లీ నోరు అదుపులో పెట్టుకో
హిమ-జ్వాల: జ్వాల వెనుకే పరుగుతీస్తుంది హిమ.  ఆటో వరకూ వెళ్లి జ్వాల చేయి పట్టుకుంటుంది హిమ. చేయి వదులు అంటూ విదిలించుకుంటుంది జ్వాల. ‘నీ ముఖం నాకు చూపించొద్దు అన్నాను కదా’ అంటుంది జ్వాల కోపంగా హిమతో. ‘జ్వాల నేను చెప్పేది విను ప్లీజ్’ అంటుంది హిమ బాధగా. ‘ఏం చెబుతావే ఏం చెబుతావ్.. నన్ను ఎలా మోసం చేశావో చెబుతావా? ఏం చెబుతావ్?’ అంటూ రగిలిపోతుంది. ‘నేను డాక్టర్ సాబ్‌ని ప్రేమించడం అబద్దం అని చెబుతాను.. మనసుని చంపుకోవద్దని చెబుతాను..’ అంటుంది హిమ. అయితే జ్వాలకు.. ఇద్దరూ(హిమ, నిరుపమ్) కలిసి ముడుపులు కట్టిన సీన్ గుర్తొస్తుంది. ‘ఛీ’ అంటూ అక్కడ నుంచి వచ్చేస్తుంది జ్వాల. (ఈ తింగరికి నేను ఎలా కనిపిస్తున్నాను..పెళ్లి చేసుకోబోతున్నారు..ముడుపులు కట్టారు.. ఇప్పుడు కొత్తగా మనసు చంపుకోవద్దు అంటోంది..తనకు నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా..జీవితంలో దాని మొహం చూడకూడదు)
ఎపిసోడ్ ముగిసింది


Also Read: హిమ కోసం డాక్టర్ సాబ్, శౌర్య కోసం హిమ అమ్మవారికి ముడుపులు, ఎవరి కోరిక నెరవేరుతుంది !



రేపటి ( శనివారం) ఎపిసోడ్ లో


సార్ 500 ఛేంజ్ ఉంటే ఇస్తారా...అని అడుగుతుంది. నిరుపమ్ ని చూసుకోదు జ్వాల. డాక్టర్ సాబ్ చేతివేళ్లు తాకిన నోట్లు అస్సలు ఖర్చుపెట్టను అని జ్వాల అనుకుంటే జ్వాల నుంచి వచ్చిన డబ్బులు వదిలించుకుందాం అనుకున్నా వదలడం లేదని నిరుపమ్ విసుక్కుంటాడు. హిమ చూస్తూ నిల్చుంటుంది.