స్కూల్లో దేవి వాళ్ళ కోసం భాగ్యమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. పిల్లలు చూడకుండా వెళ్లిపోతూ ఉంటే భాగ్యమ్మ పిలుస్తుంది. ‘‘నా దగ్గర డబ్బులు ఉంచేసి పోయినారు ఉండండి చిల్లర ఇస్తాను’’ అని అంటుంది. ఇక చిల్లర లేకపోవడంతో బయటకి వెళ్ళి తెసుకొస్తాను అని వెళ్ళిపోతుంది. భాగ్యమ్మ స్కూల్ బయట రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఒక కార్ వేగంగా పక్క నుంచి వెళ్తుండటంతో వాళ్ళని తిడుతుంది. కార్ ఆగిన వెంటనే అందులో నుంచి దేవుడమ్మ దిగుతుంది. ‘‘నువ్వేంటి భాగ్యమ్మ ఇక్కడ’’ అని దేవుడమ్మ అడుగుతుంది. ‘‘నేనొక విషయం చెప్పాలనుకున్న కానీ నువ్వు ఇంట్లో లేవు’’ అని రుక్మిణీ బ్రతికే ఉందట అని చెప్తుంది.
అప్పుడే స్కూల్ దగ్గరకి రుక్మిణీ వస్తుంది. దేవుడమ్మకి కొంచెం దూరంలో దేవి రుక్మిణీ ఉంటారు. వాళ్ళని చూసి భాగ్యమ్మ షాక్ అవుతుంది. అదేమీ తెలియని దేవుడమ్మ రుక్మిణీ గురించి మాట్లాడుతుంది. రుక్మిణీ బ్రతికే ఉందని స్వామీజీ చెప్పారు తాను ఇంట్లో నుంచి వెళ్లిపోయేటప్పటికి కడుపులో బిడ్డ కూడా ఉందట అని చెప్తుంది. తల్లి బిడ్డలు ఎక్కడో క్షేమంగా ఉన్నారని స్వామీజీ చెప్పారని ఆ మాటలు విన్న దగ్గర నుంచి నాకు ఇంకా నమ్మకం పెరిగిందని సంతోషంగా చెప్తుంది. కానీ రుక్మిణీ ఎక్కడ ఉందో తెలియడం లేదని అంటుంది.
రుక్మిణీ ఎక్కడ ఉన్న ఇంటికి వచ్చేలా చేయమని రోజు పూజలు చేస్తున్నాని అంటుంది. ఇక దేవుడమ్మ వెనక ఉన్న రుక్మిణీని ఎక్కడ చూస్తుందో అని భాగ్యమ్మ టెన్షన్ పడుతుంది. అక్కడ నుంచి దేవుడమ్మని పంపించాలని భాగ్యమ్మ ప్రయత్నిస్తుంది. ఇంటికి వెళ్దాం పద అంటూ భాగ్యమ్మ ని దేవుడమ్మ తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక రాధ కూడా పిల్లలని తీసుకుని వెళ్ళిపోతుంది.
పిల్లలు ఇంటికి రాగానే నాయన అంటూ ఇద్దరు వెళ్ళి మాధవని కౌగిలించుకుంటారు. ఇక మాధవ దేవికి బహుమతి తెచ్చానని అంటాడు. రాధ కోపంగా మాధవని చూస్తూ నేను కూడా నీకు బహుమతి తెచ్చిన సమయం వొచ్చినప్పుడు ఇద్దామని ఉన్నా తీసుకొస్తా ఉండు అంటూ లోపలికి వెళ్తుంది. ఆదిత్య దేవి కలిసి దిగి ఉన్న ఫోటో ని ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చి దేవికి ఇస్తుంది. అది చూసి దేవి మురిసిపోతుంటే మాధవ రగిలిపోతాడు. ఒక్కరే ఉంటే ఏ బొమ్మ మంచిగా ఉండదు ఎవరితో ఉంటే మంచిగా ఉంటుందో వాళ్ళతో గీయలే అది బొమ్మ లెక్క అని రాధ మాధవకి కౌంటర్ ఇస్తుంది. వెంటనే మాధవ ఆదేముందిలే గోడకి తగిలించుకునేది మీరు ఆడుకోవడానికి మంచి బొమ్మలు తీసుకొచ్చాను అని అంటాడు. వెంటనే ట్యాబ్ ఇచ్చి మీకోసం చాలా గేమ్స్ ఎక్కించానని అంటాడు. దాన్ని తీసుకున్న పిల్లలు సంతోషంగా చూస్తూ ఉంటే రాధ కోపంగా దాన్ని లాగేస్తుంది. చదువుకునే పిల్లలకి గీసువంటివెన ఇచ్చేది అని రాధ కోపంగా మాధవని తిడుతుంది.
అప్పుడప్పుడు ఆడుకుంటామని దేవి అంటుంది కానీ రాధ వినకుండా ఆడుకోడానికి స్కూల్ లో, ఇంటి ముందు జాగా ఉంది అని కోప్పడుతుంది. దీంతో పిల్లలు లోపలికి వెళ్లిపోతారు. పిల్లలకి ఇచ్చే బహుమతి కూడా తీసుకుంటావ్ ఏంటి రాధ అని మాధవ అడుగుతాడు. పిల్లలకి ఇచ్చేది ఉపయోగంగా ఉండాలి ఇలాంటివి కాదు నీ ఇష్టానికి చేసావంటే మంచిగా ఉండదు అని వార్నింగ్ ఇస్తుంది. ఇక భాగ్యమ్మ ని దేవుడమ్మ ఇంటికి తీసుకుని వస్తుంది. అమ్మని చూసి సత్య చాలా సంతోషిస్తుంది. కమల, భాష భాగ్యమ్మని కోపంగా చూస్తుంటే ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మా దగ్గర నువ్వు ఏదో దాస్తున్నవని కమల వాళ్ళు ప్రశ్నిస్తారు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మెడ ఒట్టు పెట్టి చెప్పు రుక్మిణీ గురించి నేకు తెలుసు కదా అని ప్రశ్నిస్తారు. అదంతా వింటున్న ఆదిత్య వెంటనే వచ్చి భాగ్యమ్మని అమ్మ పిలుస్తుంది అని అబద్దం చెప్పి పంపించేస్తాడు. సీన్ కట్ చేస్తే మాధవ వాళ్ళ ఇంట్లో రామూర్తి దేవిని పొగుడ్తూ ఉంటాడు. స్కూల్లో చాలా బాగా మాట్లాడవని మెచ్చుకుంటాడు. ఆఫీసర్ సర్ లెక్క నేను కూడా కలెక్టర్ అవుతానని దేవి అంటుంటే అది చూసి రామూర్తి దంపతులు మురిసిపోతారు. అక్కడికి మాధవ వస్తాడు. తన చేతి మీద ఉన్న పచ్చ బొట్టు చూసి దేవి బాధపడుతుంది. నేటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read: ఇంటింటి గృహలక్ష్మి జులై 2 - తులసి స్కెచ్, రోడ్డు మీద పరుగులు పెట్టిన లాస్య, భాగ్య