Jagadhatri Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ముసలి దానిని ముసలిది అనటంలో తప్పేముంది అయినా మా నానమ్మ నా ఇష్టం అంటుంది నిషిక.


కౌషికి : నీకు అత్తింటి మీదే కాదు పుట్టింటి మీద కూడా గౌరవం లేదన్నమాట అయినా మీ నానమ్మకి ఒంట్లో బాగోకపోతే నువ్వు ఎందుకు వెళ్ళలేదో అర్థం కావడం లేదు.


నిషిక : ఇదొకతి ఆస్తమానం నన్ను తిట్టటానికి రెడీగా ఉంటుంది అని కౌషికిని తిట్టుకుంటుంది. తర్వాత నల్లపూసల ఫంక్షన్ తనకు చేయమని డిమాండ్ చేస్తుంది.


కౌషికి:  ధాత్రి వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకి జరగకుండా నీకు నల్లపూసల ఫంక్షన్ ఏంటి అంటుంది.


నిషిక : ఇప్పుడు చేస్తేనే ఫంక్షన్ చేసుకుంటాను లేకపోతే ఇంకెప్పుడూ చేసుకోను అని పట్టు పట్టడంతో సరే అయితే యువరాజ్ ని తీసుకొని రా అని చెప్తుంది కౌషికి.


యువరాజ్ ని తీసుకురావడానికి రూమ్ కి వెళ్లిన నిషికకి యువరాజ్ కనిపించకపోవడంతో ఇప్పుడు ఈ విషయం ఇంట్లో చెప్తే కౌషికి రచ్చ చేస్తుంది అని చెప్పి కిందకి వచ్చి ఆయన కూడా ధాత్రి వాళ్ళకి అయిన తర్వాతే నల్లపూసల  ఫంక్షన్ చేసుకుందామన్నారు అని అబద్ధం చెప్పేస్తుంది.


నిషిక : అయినా ధాత్రి వాళ్లు అప్పుడనగా వెళ్లారు ఇప్పటివరకు ఏం చేస్తున్నారు ఒకసారి ఇంటికి ఫోన్ చేసి కనుక్కుంటాను అని చెప్పి తల్లికి ఫోన్ చేసి ఆ ద్ధాత్రి వాళ్ళు ఇంటికి రాకుండా ఇంకా అక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది.


నిషిక తల్లి: వాళ్ళు ఇంకా ఇక్కడికి రానేలేదు అంటుంది.


నిషిక : అంటే వీళ్ళు ఆ మసల్ది కలిపి ఏదో నాటకం ఆడుతున్నారు వీళ్ళు ఇంకేదో పని మీద బయటకు వెళ్లారు అనుకొని ఆ విషయాన్ని కౌషికి కి చెప్తుంది. నేను కూడా నానమ్మని చూసి వస్తాను అని అక్కడి నుంచి బయలుదేరుతుంది.


మరోవైపు పోలీసులు వచ్చేలోపు ఈ విగ్రహాన్ని తరలించేయాలి అనుకుంటారు రౌడీలు. అంతలోనే అక్కడికి చేరుకుంటారు ద్ధాత్రి వాళ్ళు. వాళ్లతో ఫైట్ చేసి ఆ విగ్రహాన్ని దక్కించుకుంటారు. పోలీసులు వచ్చి రౌడీలని అరెస్టు చేస్తారు.


పోలీసులు: సెంట్రల్ నుంచి పోలీసులు వస్తున్నారు అంటే ఏం చేస్తారో అనుకున్నాము కానీ మేం చేయలేని పని మీరు చేశారు అని ద్ధాత్రి వాళ్ళని ఏప్రిషియేట్  చేసి వెళ్ళిపోతారు.


యువరాజ్: ఇదంతా దూరం నుంచి చూస్తున్న యువరాజ్ వీళ్ళు సెంట్రల్ పోలీసులా అని అనుకుంటాడు. అంతలో మీనన్ ఫోన్ చేసి కోట్ల ఖరీదు చేసే విగ్రహాన్ని వదిలేసావు నీలాంటి చేతగాని వాడికి పని అప్పగించాను అని కోప్పడతాడు.


ఆ తర్వాత ధాత్రి వాళ్ళు నానమ్మని చూడ్డానికి బయలుదేరుతారు. అప్పటికే అక్కడ నిషిక ఉంటుంది.


ధాత్రి : ఇక్కడ నువ్వేం చేస్తున్నావు.


నిషిక : ఆ మాట నేను అడగాలి అసలు నువ్వు ఎక్కడ కని బయలుదేరి ఎక్కడికి వెళ్లావు నిజం చెప్పు అని నిలదీస్తుంది. నానమ్మ, కేదార్ ధాత్రి సైగలు చేసుకోవడం చూసి మీరందరూ కలిసి నాటకం ఆడుతున్నారు అని అంటుంది.


నానమ్మ: ధాత్రి చెవిలో చెప్పిన మీదట నిన్ను చూసేసరికి నాకు నొప్పి తగ్గడం ప్రారంభించింది అని లేచి కూర్చుంటుంది.


నిషిక : అసలు నువ్వు నిజంగానే పడ్డావా అని నానమ్మని నిలదీసి మీరందరూ ఏదో నాటకం ఆడుతున్నారు అంటుంది.


కేదార్ : బండి టైర్ పంచ్ అయింది వేయించుకొని వచ్చేసరికి లేట్ అయింది తనటంతో సరే ఇప్పటికే లేట్ అయింది పదండి ఫంక్షన్ కి వెళ్దాం అని చెప్పి అందరూ ఫంక్షన్ కి బయలుదేరుతారు.


ఇంటికి వచ్చిన నిషిక వాళ్ళని చూసి లేట్ అయితే ఇంకా రారేమో ఫంక్షన్ ఆపేద్దాం అనుకుంటున్నాము అంటుంది కౌషికి.


నిషిక తల్లి : క్షమించండి మా అత్తగారు కొంచెం హడావుడి చేశారు అందుకే లేట్ అయింది అంటుంది.


కౌషికి సుభద్రమ్మను తీసుకువెళ్లి సోఫాలో కూర్చోబెట్టి ఇంక నల్లపూసల ఫంక్షన్ ప్రారంభించండి.


ఈలోపు ధాత్రి ఒక బాక్స్ తీసుకొని కిచెన్లోకి వెళుతుంది అది ఏంటి అని అనుమానంగా నిషిక కూడా ఆమెని ఫాలో అయ్యి ఏంటి బాక్స్ అని ధాత్రిని అడుగుతుంది.


ధాత్రి: ఎవరికీ చెప్పకు నాకు కౌషికి వదిన గిఫ్ట్ ఇచ్చింది అది ఏంటో చూద్దామని ఇక్కడి ఉంచాను అని చెప్పి ఎవరో తెలిస్తే అక్కడినుంచి వెళ్ళిపోతున్నట్లుగా నటించి  అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.


నిషిక : ఇందులో ఏముందో చూస్తాను గోల్డ్, డైమండ్స్ ఉంటే ఇంట్లో రచ్చ రచ్చ చేసేస్తాను అనుకుంటుంది.


కౌషికి ధాత్రి వాళ్ళని పీటల మీద కూర్చొమనటంతో మళ్ళీ ఇబ్బందిగా మొహం పెడుతుంది ధాత్రి.ఇంక మీ ఆటలు సాగవు అని మనసులో అనుకుంటుంది కౌషికి. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.


Also Read: సర్కారు నౌకరి రివ్యూ: సింగర్ సునీత కొడుకు ఆకాష్ మొదటి సినిమా