Jagadhatri Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో సరిగ్గా కేదార్ నల్లపూసలు వేసే సమయానికి ధాత్రికి నానమ్మకి బాగోలేదు త్వరగా రమ్మని ఫోన్ వస్తుంది.


ధాత్రి: నానమ్మ కి బాగోలేదంట నేను వెళ్ళాలి అని చెప్పి బయలుదేరబోతుంటే నిషిక నేను కూడా వస్తాను అంటుంది.


వైజయంతి: వాళ్లని వెళ్ళనీ, అప్పుడు ముందుగా నీకే నల్లపూసల ఫంక్షన్ జరుగుతుంది అనటంతో నిషిక ఆగిపోతుంది. 


రాత్రి వాళ్ళు కంగారుగా అక్కడి నుంచి బయలుదేరుతారు నేరుగా చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్తారు. మాస్కులు వేసుకొని డ్యూటీ చేస్తుంటారు.


యువరాజ్: దూరంగా కారులో ఉండే జరిగిందంతా చూస్తూ ఉంటాడు సడన్గా ధాత్రి వాళ్ళని చూసి వీళ్లిద్దరూ ధాత్రి, కేదార్ లాగా ఉన్నారు అనుకుంటాడు. ఏదో నెంబర్ కి ఫోన్ చేస్తాడు. ఆ నెంబర్ ఇంట్లో ఎవరు లిఫ్ట్ చేయకపోవడంతో అయితే ఇక్కడ ధాత్రి లేదు అనుకుంటాడు.


ధాత్రి : తనకు పదేపదే కాల్స్ రావటాన్ని చూసి ఎవరో కావాలని చేస్తున్నారు అని చుట్టూ చూస్తుంది చాలా దూరంలో యువరాజ్ కనిపిస్తాడు. అదే విషయాన్ని కేదార్ కి చెప్పి ఇక్కడ ఏదో జరుగుతుంది కానీ మనం అర్థం చేసుకోలేకపోతున్నాము, చాలా అలర్ట్ గా ఉండాలి అని చెప్తుంది.


అదే సమయంలో మీనన్ యువరాజ్ కి ఫోన్ చేసి అంతా ప్లాన్ ప్రకారం జరుగుతుంది కదా అని అడుగుతాడు.


యువరాజ్ : అంతా ప్లాన్ ప్రకారం జరుగుతుంది అని మీనన్ కి చెప్పి స్మగ్లర్స్ కి ఫోన్ చేస్తాడు.


వాళ్లు అప్పటికే స్వాముల రూపంలో ఉండే విగ్రహాన్ని ఊరేగింపు లాగా తీసుకు వెళ్లి చెక్పోస్ట్ దాటిన తర్వాత యువరాజ్ కి అప్పగించడానికి ప్లాన్ వేస్తారు అదే విషయాన్ని యువరాజ్ కి చెప్తారు.


నిషిక తనకి నల్లపూసల ఫంక్షన్ చేయమని కౌషికి తో చెప్తుంది.


కౌశికి: ధాత్రి వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్లకు జరగకుండా మీకు జరగడం ఏమిటి కాసేపు వెయిట్ చేద్దాం అంటుంది.


నిషిక: అందుకు కోప్పడుతుంది, ఆ ముసలిదానికి ఇప్పుడే నొప్పులు రావాలా అని వెటకారం గా మాట్లాడుతుంది.


కౌషికి: పెద్దవాళ్ళని అలాగే అంటారా నీకు అత్తింటి మీద గౌరవమే లేదు అనుకున్నాను పుట్టింటి మీద కూడా లేదన్నమాట అంటుంది.


నిషిక: మా నానమ్మ నా ఇష్టం అని కౌషికితో గొడవకి దిగుతుంది. 


మరోవైపు చెక్ పోస్ట్ దగ్గరికి దేవుడు ఊరేగింపు లాగా వస్తే అదేంటి అని అడుగుతుంది ధాత్రి.


రౌడీలు: దేవుడి ఊరేగింపు మేడం, ఈరోజు ఇలాగే చేస్తాము.


ధాత్రి: ఆ విగ్రహం దేనితో చేశారు.


రౌడీలు: మట్టితో చేసి రంగులు వేసాము.


ధాత్రి: కేదార్ ని ఒకసారి ఆ విగ్రహాన్ని పరిశీలించమంటుంది.


సరిగ్గా విగ్రహం ముట్టుకొని పరీక్షించే సమయానికి వాళ్ల ని డైవర్ట్ చేయడం కోసం యువరాజ్ చాలా ఫాస్ట్ గా రేష్ డ్రైవింగ్ తో చెక్పోస్ట్ దాటి వెళ్ళిపోతాడు.


విగ్రహం అందులోనే ఉందేమో అందుకే అంత ఫాస్ట్ గా వెళ్తున్నారేమో అనుకోని జేడి టీం యువరాజ్ ని ఫాలో అవుతుంది.


రౌడీలు అందరూ ఊపిరి పీల్చుకొని అక్కడి నుంచి కదులుతారు.


మరోవైపు యువరాజు కేడి వాళ్ళని దారి తప్పించి వేరే రూట్ తీసుకువెళ్లి కారు అక్కడ వదిలేసి తప్పించుకుంటాడు.


కారుని ఫాలో అయిన ధాత్రి వాళ్ళు కారు వేరే రూట్ లో వెళ్ళవచ్చు అయినా ఇక్కడికి వచ్చి కారు ఆపేసి అతను మాత్రమే తప్పించుకున్నాడు అంటే మనకు తెలియనిది ఏదో జరుగుతుంది మనం గ్రహించలేకపోతున్నాము అని కళ్ళు మూసుకొని చాలాసేపు ఆలోచిస్తుంది ధాత్రి.


ధాత్రి : ఆమె కి సడన్ గా ఊరేగింపులో ఉన్న విగ్రహమే స్మగ్లింగ్ విగ్రహం అని అర్థమవుతుంది టీం ని అలర్ట్ చేసి అందరూ అక్కడికి పరుగులు తీస్తారు.


ఇదంతా దూరం నుంచి ఈ చూస్తున్న యువరాజ్ తప్పించుకున్నాను అనుకొని ఆనందపడతాడు.


Also Read: ఊహించని విధంగా ‘బిగ్ బాస్’ శోభాశెట్టి ఎంగేజ్‌మెంట్ - మళ్లీ ఎప్పుడూ రానన్న ప్రియుడు యశ్వంత్