Shobha Shetty Engagement : బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్స్‌గా నిరూపించుకున్న తర్వాత మళ్లీ అందరూ ఎవరి రొటీన్ లైఫ్‌లోకి వారు వెళ్లిపోయారు. ఎవరి షూటింగ్స్‌తో వారు బిజీ అయిపోయారు. అలాగే శోభా శెట్టి కూడా తన షూటింగ్స్‌తో బిజీ అయిపోయింది. అంతే కాకుండా బిగ్ బాస్ వల్ల తన యూట్యూబ్ వీడియోలకు గ్యాప్ ఇచ్చిన శోభా.. మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా తనకు, తన బాయ్‌ఫ్రెండ్‌ యశ్వంత్‌కు ఎంగేజ్‌మెంట్ జరిగినట్టు శోభా.. తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను అప్లోడ్ చేసింది. అంతే కాకుండా ఈ వీడియోలోనే మొదటిసారి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ప్రియాంకను కలిసినట్టు తెలిపింది. ఈ వీడియోలో మరికొన్ని ఆసక్తికర విశేషాలను కూడా పంచుకుంది శోభా.


ఇంట్లో కలిసే టైమ్ లేదు..
ఒక ప్రోగ్రామ్ కోసం శోభా శెట్టి రెడీ అవుతుండగా.. ప్రియాంక వెనుక నుంచి వచ్చి సర్‌ప్రైజ్ చేసింది. ‘‘వెల్‌కమ్ టు శోభా శెట్టి ఛానెల్’’ అని ఇంట్రడక్షన్ ఇచ్చింది. ‘‘నా ఛానెల్‌లో ఈరోజు పరీ ఉందన్నమాట’’ అంటూ శోభా చాలా సంతోషంగా చెప్పింది. ఆ తర్వాత ఒకరికొకరు మిస్ యూ చెప్పుకున్నారు. బిగ్ బాస్ తర్వాత వారిద్దరూ కలవడం ఇదే మొదటిసారి అని, ఇంట్లో కూడా కలవడానికి టైమ్ లేదని బయటపెట్టింది శోభా. బిగ్ బాస్ తర్వాత ఎలా ఫీలవుతున్నావంటూ ప్రియాంకను అడిగింది. తాను బాగా ఫీలవుతున్నానని ప్రియాంక సమాధానమిచ్చింది. వారు యూట్యూబ్‌కు సంబంధించి ఎలాంటి వీడియోలు చేయాలనుకున్నారు అనే విషయాన్ని బిగ్ బాస్ హౌజ్‌లోనే చర్చించుకున్న విషయాన్ని శోభా శెట్టి రివీల్ చేసింది. ముందు ముందు చాలా సర్‌ప్రైజ్ వీడియోలు ఉన్నాయని చెప్పింది.


అలా చెప్తే మజా రాదు..
ఆ తర్వాత శోభా శెట్టి.. స్టేజ్‌పై ఇచ్చిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను కూడా ఈ యూట్యూబ్ వీడియోలో చూపించింది. బిగ్ బాస్ తర్వాత ప్రియాంక, తను కలిసి స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నామని రివీల్ చేసింది. ‘‘సోషల్ మీడియాలో ప్రియాంకది, నీది కలిసిన వీడియోలు తీయండి. కలవండి, ఫోటోలు షేర్ చేయండి అని అడుగుతున్నారు’’ అని తెలిపింది శోభా. ‘‘ఈ వీడియోలో మేము ఏం మాట్లాడము. బిగ్ బాస్ గురించి, అందులో మా ఎక్స్‌పీరియన్స్ గురించి స్పెషల్‌గా రెండు వీడియోలు వస్తాయి. ఏం చేశాము, ఎలా ఉన్నాం, ఏంటి అని మొత్తం మీకు ఇంకొక వీడియోలో చూపిస్తా. మధ్యమధ్యలో చెప్తే మజా రాదు. మొత్తం చెప్తే బాగుంటుంది’’ అని అన్నారు. ఆ తర్వాత ఫోటోషూట్‌లో పాల్గొన్న శోభా.. తనకు ఆరోగ్యం బాలేకపోయినా పనిచేస్తున్నానని, యాక్టర్ల లైఫ్ అంటే ఇలాగే ఉంటుందని వాపోయింది.


స్టేజ్‌పైనే ఎంగేజ్‌మెంట్..
శోభా శెట్టి పాల్గొన్న కార్యక్రమంలోకి తనకు సర్‌ప్రైజ్ ఇవ్వడానికి యశ్వంత్ కూడా వచ్చాడు. వారిద్దరికీ స్టేజ్‌పైనే ఎంగేజ్‌మెంట్ కూడా చేయించారు మేకర్స్. దానికి సంబంధించిన షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడింది శోభా. ‘‘యశ్వంత్ నాకోసం సర్‌ప్రైజ్ ఇవ్వడానికి షోకు వస్తాడని అసలు ఊహించలేదు. ఏం చెప్పాలో అర్థం అవ్వడం లేదు. మాకు ఎంగేజ్‌మెంట్ కూడా చేయించారు. రింగ్ తీసుకొచ్చాడు, దండలు మార్చుకున్నాం. దాంతో పాటు గిఫ్ట్ కూడా ఇచ్చాడు. నేను, యశ్వంత్ ఇద్దరం కలిసి ఒక షోలో కనిపించడం మొదటిసారి. నాకు చాలా సంతోషంగా ఉంది’’ అని సంతోషాన్ని బయటపెట్టింది. ఆ తర్వాత ఎందుకొచ్చావంటూ యశ్వంత్‌ను అడిగింది. ‘‘ప్లాన్ చేస్తున్నామండి అని చెప్పారు అంటే నేను రాను కదా తెలుసు కదా అన్నాను. 10 నిమిషాలే మీరు సర్‌ప్రైజ్ ఇస్తే బాగుంటుంది అన్నారు. నేను కూడా ఎప్పుడు సర్‌ప్రైజ్ ఇవ్వలేదు కదా ఫస్ట్ టైమ్ ట్రై చేద్దామని ఆలోచించాను. ఇదే ఫస్ట్. మళ్లీ ఎప్పుడూ రాను’’ అని క్లారిటీ ఇచ్చాడు యశ్వంత్.



Also Read: మాది ‘ఆదిపురుష్‘ కాదు, ఓం రౌత్ వీఎఫ్ఎక్స్‌పై ‘కల్కి‘ ఎడిటర్ సెటైర్లు