Jagadhatri Serial Today Episode వైజయంతి, నిషిక, యువరాజు అంతా తాయారుని కలవడానికి రెడీ అవుతారు. కౌషికి కూడా రెడీ అవుతుంది కానీ బాబు ఉదయం నుంచి డల్‌గా ఉన్నాడు నేను రాను అని చెప్తుంది. యువరాజ్, వైజయంతి కౌషికికి రమ్మని అంటారు. వజ్రపాటి సీఈవో రాకపోతే అందరూ ఏమనుకుంటారా అని రమ్మని చెప్తారు. కౌషికి బాబు బాధ్యత సురేశ్‌కి ఇస్తానని చెప్పి వెళ్తుంది.
జగద్ధాత్రి, కేథార్‌లు స్కూల్‌కి వెళ్తామని చెప్పి వెళ్తే సుధాకర్ ఆపుతారు. అందర్ని మినిస్టర్ పిలిచారు కదా వెళ్దాం అని అంటే మన ఫ్యామిలీలో వీళ్లు ఎందుకు వీళ్లకి మనకి ఏం సంబంధం లేదని యువరాజ్ అరుస్తాడు. కౌషికి కూడా రమ్మని పిలుస్తుంది. వాళ్లు వస్తే అక్కడ ఎవరైనా వీళ్లు మీకు ఏమవుతారు అంటే ఏం చెప్తారు. మొన్నటిలా తమ్ముడు లాంటి వాడు అని చెప్తావా అక్క అని యువరాజ్ ప్రశ్నిస్తాడు. నిషిక వాళ్ల అక్క అని చెప్తా ఏం పర్వాలేదు అందరం కలిసే వెళ్దాం అని కౌషికి చెప్తుంది. దాంతో అందరూ బయల్దేరుతారు.
తాయారు ప్రమాణ స్వీకారం పూర్తయిపోతుంది. తాయారు, తన కొడుకు విక్కీ కౌషికి ఫ్యామిలీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్లని ఇంటికి పిలిచా వస్తారు అని తాయారు కొడుకుతో చెప్తుంది. ఇంతలో సాధు సార్ వస్తే తాయారు జేడీ గురించి అడుగుతుంది. జేడీ పర్సనల్ లీవ్ తీసుకుందని చెప్తారు. హోంమినిస్టర్ జిందాబాద్ అని బయట మార్మోగిపోతుంది. కౌషికి వాళ్లు తాయారు దగ్గరకు వస్తారు. తాయారుకి కంగ్రాట్స్ చెప్తారు. తాయారు జగద్ధాత్రిని చూసి మీ అమ్మ మీద పడిన నింద చెరిపేయడం ఎంత వరకు వచ్చిందని అడుగుతుంది. ఇక పార్టీ పెద్దలకు వజ్రపాటి ఫ్యామిలీని పరిచేస్తుంది.
సుధాకర్, వైజయంతి, కౌషికి ఇలా అందర్ని పరిచయం చేస్తుంది. ఇక వైజయంతి ఎమ్మెల్యే సీటు గురించి అడుగుతుంది. కౌషికి వాళ్ల ఫ్యామిలీ గొప్పది అని చెప్తూ ఉదాహరణగా జగద్ధాత్రి, కేథార్ వాళ్ల దూరపు చుట్టం అని పెళ్లి తర్వాత వాళ్లు ఎక్కడుండాలో తెలియకపోతే వాళ్లని ఇంట్లో పెట్టుకున్నారు.. జగద్ధాత్రి తల్లి కావ్య డిపార్టెమెంట్‌ని మోసం చేసి చచ్చిపోయింది. కేథార్‌కి తండ్రి లేడు ఎవడో కూడా తెలీదు..అలాంటి వారిని కూడా వైజయంతి గారు చూసుకుంటున్నారు అని గొప్పగా చెప్తుంది. ఇదే అవకాశంగా నిషిక, యువరాజ్ కేథార్‌ని అవమానిస్తారు. యువరాజ్ మినిస్టర్‌తో పాపం వాళ్ల తల్లి అయినా వాళ్ల నాన్న ఎవరో చెప్పుంటే బాగుండేది అని అంటాడు. కేథార్ తల దించుకుంటాడు. కౌషికి, సుధాకర్ బాధ పడతారు.
జగద్ధాత్రి కోపంగా మినిస్టర్ గారు మా ఆయన గారికి తండ్రి లేడు అని తెలీదు అని మీకు ఎవరు చెప్పారు మా ఆయనకు తండ్రి ఉన్నారు అని అంటుంది. వైజయంతి, నిషిక వాళ్లు బిత్తరపోతారు. ఏం అత్తయ్య గారు నిజమా కాదా కేథార్‌కి తండ్రి ఉన్నాడు కదా అంటుంది. వైజయంతి నీళ్లు నములుతుంది. జగద్ధాత్రి అందరి ముందు నిజం చెప్పేస్తుందా మీడియా ఉంది.. పెద్దలు ఉన్నారు అని నిషిక, యువరాజ్ అనుకుంటారు. కౌషికి జగద్ధాత్రికి సైలెంట్‌గా ఉండమని అంటుంది. జగద్ధాత్రి సారీ వదిన అని నిషిక, యువరాజ్ మీరు చెప్పండి అంటుంది. గొడవని ఆపడానికి కౌషికి వాళ్ల నాన్న ఎవరో తెలిసింది కానీ అడ్రస్ తెలియలేదు అని అంటుంది.
తాయారు వైజయంతి వాళ్లతో మీకు అంత సపోర్ట్ చేస్తే ఇలా చేశారేంటి అని అంటే ఇంత మంది ముందు కేథార్ తండ్రి మా నాన్ననే అని తెలిస్తే మా పరువే పోతుందని అంటారు. తాయారు దగ్గరకు కొడుకు వచ్చి వీళ్లతో ఇంత క్లోజ్ అయ్యావంటే ఏదో పెద్ద కారణమే ఉంది అని అంటే అవును బిడ్డ జగద్ధాత్రి వాళ్ల దగ్గర ఆ కావ్య డైరీ ఉంది. అందులో నాకు, సీఎంకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయ్ అందుకే వీళ్లతో ఇలా క్లోజ్‌గా ఉన్నానని అంటుంది. మరోవైపు రమ్య వాళ్లు రాజు మర్డర్ కేసు గురించి చూస్తుంటారు. రాజునే చనిపోయిందని గుర్తిస్తారు. అంతే కాకుండా రాజుకి చివరిగా కాల్ చేసింది కౌషికి భర్త సురేశ్ అని గుర్తిస్తారు. జగద్ధాత్రి, కేథార్‌లు షాక్ అయిపోతారు.
సురేశ్ బావకి రాజుని చంపాల్సిన అవసరం లేదని కానీ అతను కలవాలి అనుకున్న రోజే ఎవరో రాజుని చంపేశారని ఇది అటు తిరిగి ఇటు తిరిగి బావ మెడకు చుట్టుకునేలా ఉందని అంటారు. సురేశ్ మర్డర్ చేయరని కానీ ఈ లోపు అసలు నిందితులను పట్టుకోకపోతే సురేశ్‌ని అరెస్ట్ చేయాల్సి వస్తుందని ఈలోపే కనిపెట్టేయాలని అంటారు. సాధుసార్‌కి విషయం చెప్తారు. సురేశ్ ఎందుకు రాజుతో మాట్లాడాడో స్టేట్‌మెంట్ తీసుకొని కేసు సాల్వ్ చేస్తామని ఒక్క రోజు గుడువు అడుగుతారు. దాంతో సాధు సార్ ఒకే అంటారు. జగద్ధాత్రి, కేథార్‌లు సాధు సార్‌తో మాట్లాడుతుంటే మత్తం మొత్తం ఫ్యామిలీ వచ్చి అక్కడ నిల్చొంటారు. కేసు కస్టడీ అని ఏదేదో మాట్లాడుతున్నారు ఏంటి మ్యాటర్ అని వైజయంతి అడుగుతుంది. అత్తయ్యని రాజకీయాల్లోకి రానివ్వకుండా ఏవైనా ప్రయత్నాలు చేస్తే ఊరుకోమని నిషిక అంటుంది.
యువరాజ్ అక్కతో వీళ్లేదో పెద్ద ప్లాన్ చేస్తున్నారు అని అంటాడు. దాంతో సాధుసార్ అవును మీ పరువు కాపాడాలని పెద్ద ప్లాన్ చేస్తున్నారు. మీ బాబుకి డీఎన్‌ఏ టెస్ట్ చేసిన రాజు చనిపోయాడు అతనితో లాస్ట్ మాట్లాడింది సురేశ్ అని అంటారు. అందరూ షాక్ అయిపోతారు. సురేశ్ అలా ఎప్పటికీ చేయడని కౌషికి అంటుంది. బావ ఇంట్లోకి వస్తే ఏదో పెద్ద ప్రాబ్లమ్ నెత్తిన పెడతారని యువరాజ్ అంటాడు. వైజయంతి తన ఎమ్మెల్యే సీట్ కోసం బాధ పడుతుంది. వైజయంతి కౌషికితో తప్పు సురేశ్ చేయకపోతే పర్లేదు చేస్తే మాత్రం నీకు సురేశ్ కావాలో మేం కావాలో తేల్చుకో అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ప్రమాదంతో మిథున, దేవా.. ఆదిత్య షూట్ చేసిందెవరిని? శివంగి ఎంట్రీ!