Jagadhatri  Serial Today Episode: ధాత్రి, కేదార్‌ లోపలికి వెళ్లే లోపు అక్కడ ఉన్న డ్రగ్స్‌ ను మారుస్తారు టోనీ, యువరాజ్. లోపలికి వెళ్లిన ధాత్రి యువరాజ్‌కు వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు అభి, ఖదీర్‌ సరుకు ఏ రూట్లో వెళ్తుందో తెలుసుకోవాలని ప్లాన్‌ చేసుకుంటుటారు. ఇంతలో పైనుంచి మీనన్‌ చూసి ఏం చేస్తున్నారు అని అడగ్గానే అభి, ఖదీర్‌ షాక్‌ అవుతారు.


మీనన్‌:  నా టీమ్‌ అంతా అక్కడ ఉంటే మీరు ఇక్కడ ఉన్నారేంటి? ఈ ఇన్ఫర్మేషన్‌ ఎవరికి చెప్పారు. ( గన్‌ తీసి బెదిరిస్తూ..) నిజం ఎవరు చెబితే వాళ్లను వదిలేస్తాను.


ఖదీర్‌: అదేం లేదు సార్‌ సరుకు ఏ రూట్లో అయితే సేఫ్‌గా సిటీలోకి వస్తుందో ఆలోచిస్తున్నాం.


అభి: అవును సార్‌ అదే ఆలోచిస్తున్నాము.


 అభి చేతిలో ఫోన్‌ లాక్కుని మీనన్‌ చెక్‌ చేస్తాడు. అప్పటికే అభి కాలింగ్‌ లిస్టులో ధాత్రి నెంబర్‌ డిలీట్‌ చేసి ఉంటాడు. ఫోన్‌ చెక్‌ చేసిన మీనన్‌ అభి, ఖదీర్‌ లను పైకి వెళ్లండని చెప్తాడు. ఇంతలో మీనన్‌ మనిషి వచ్చి సరుకు పటాన్‌చెరువు మీదుగా సిటీలోకి వస్తే బాగుంటుందని చెప్తాడు. పైకి వెళ్లిన అభి సరుకు పటాన్‌ చెరువు మీదుగా సిటీలోకి వస్తుందని ధాత్రికి మెసేజ్‌ చేస్తాడు. మరోవైపు మీనన్‌ టోనీకి కాల్‌ చేసి పటాన్‌ చెరువు మీదుగా సరుకు సిటీలోకి వస్తుందని వెళ్లి పికప్‌ చేసుకోమని చెప్తాడు. టోనీ, యువరాజ్‌ వెళ్తారు.   ధాత్రి, కేదార్‌ పటాన్‌చెరువు మార్గంలో వెహికిల్స్‌ చెక్ చేస్తుంటారు. ఇంతలో ఒక అనుమానాస్పదంగా వెళ్తున్న ఆటోను పోలీసులు వదిలివేస్తారు.


ధాత్రి: కేడీ ఆ ఆటోను ఆపండి..


కేదార్‌: ఏమైంది జేడీ..


ధాత్రి: అది నిజంగా చికెన్‌ వేస్టేజే అయితే వాడు ఆటో దిగొచ్చి మరీ అది చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వాడంతట వాడే అది చేపల చెరువులో కలుపుతున్నాము అన్నాడంటే అక్కడ ఏదో తప్పు జరుగుతుంది. నా గెస్‌ కరెక్టు అయితే ఆ చికెన్‌ వేస్టేజి కిందే మనం వెతుకుతుంది ఉంది. వెళ్లి ఆపండి.


 అని ధాత్రి చెప్పగానే కేదార్‌, మిగతా పోలీసులు వెళ్లి ఆటోను ఆపి మళ్లీ చెక్‌ చేస్తారు. అందులో డ్రగ్స్‌ ప్యాకెట్స్ దొరుకుతాయి. దీంతో ఆటోను అందులోని వ్యక్తులను అరెస్ట్‌ చేస్తారు. ప్రెస్‌ మీట్‌ పెట్టి సాధు వివరాలు తెలియజేస్తాడు.


సాధు: ఇవాళ కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలను తరలిస్తున్న ముఠాను జేడీ టీం అరెస్ట్ చేసింది.


రిపోర్టర్‌: సార్‌ ఆ మత్తు పదార్థాల విలువ ఎంత ఉండొచ్చు..


సాధు: కరెక్టు వ్యాల్యూ ఇప్పుడే చెప్పలేం. విచారణ జరిపి మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. దీని వెనక ఉన్నది ఎవరన్నది కనిపెట్టి పూర్తి వివరాలు తెలియజేస్తాం.


రిపోర్టర్‌: కంగ్రాట్స్‌ జేడీ.. ఇంత పెద్ద రాకెట్‌ ను ఎలా పట్టుకున్నారు.


ధాత్రి: సాధు సార్‌ చెప్పినట్టు సిటీలో జరుగుతున్న ఇల్లీగల్‌ యాక్టివిటీస్‌ ను మేము మానిటర్‌ చేస్తూనే ఉన్నాము.


కేదార్‌: దాంట్లో భాగంగానే మాకొచ్చిన ఇన్ఫర్మేషన్‌ సిటీలోకి చాలా పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు వస్తున్నాయని తెలిసి తనిఖీలు చేశాము.


 అని ధాత్రి, కేదార్‌ ప్రెస్‌మీట్‌ లో మాట్లాడుతుంటే టీవీలో లైవ్‌ చూస్తుంటాడు మీనన్‌. దీంతో ప్రెస్‌ మీట్‌లోనే ధాత్రి మీనన్‌కు వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో మీనన్‌ ఇరిటేటింగ్‌ గా ఫీలవుతాడు. మనం ఇక్కడ మాట్లాడుకుంది. అక్కడ జేడీకి ఎలా తెలిసిందని ప్రస్టేషన్‌ అవుతుంటాడు. ఎవరు సమాచారం ఇచ్చారని అందరినీ అనుమానిస్తుంటాడు. అభి, ఖదిర్‌ లను అడగ్గానే అభి నేను ముందే చెప్పాను కదా భాయ్‌ అ రూట్‌ లో వెళ్లొద్దని అని చెప్పగానే వాళ్లను వదిలేస్తాడు. మరోవైపు టీవీలో జేడీ న్యూస్‌ చూస్తుంటారు కౌషికి, నిషిక, సుధాకర్‌, వైజయంతి. ఇంతలో కౌషికి యువరాజ్‌ ఎక్కడని అడగ్గానే నిషిక, వైజయంతి కౌషికిని తిడతారు. దీంతో వాళ్లను సుధాకర్‌ తిడతాడు. మరోవైపు ధాత్రి, కేదార్‌, యువరాజ్‌ గురించి ఆలోచిస్తుంటారు. ఇంత ఆస్తులున్నా.. యువరాజ్‌ మీనన్‌తో ఎందుకు చేతులు కలిపాడని ఆలోచిస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: గరిక, పసుపు, నిమ్మకాయ ఉంటే మీ ఆర్థిక, ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు ఇట్టే మాయమైపోతాయి!