Trinayani Serial Today Episode గాయత్రీ పాప నయని కన్న బిడ్డా కాదా తెలుసుకోవడానికి తిలోత్తమ విష ప్రయోగం చేయాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం పాయసం వండుతుంది. వల్లభ రాగానే అతనికి తెలీకుండా జేబులో పెట్టిన విషం పాయసంలో కలుపుతుంది. విషం కలిపిన పాయసం వినాయకుడి దగ్గర నైవేద్యం పెడతాను అని చెప్తుంది తిలోత్తమ. ముందు గాయత్రీ పాపకి తినిపించమని నాటకం ఆడుతాను అని వల్లభతో చెప్తుంది. 


తిలోత్తమ: నయని విషం కలిసిందని గ్రహిస్తే నేనే ముందు ఆ గిన్నెను ఎగరేసి అయ్యో పాప కొంచెం ఉంటే ప్రాణం పోయేది కదా చిట్టితల్లి అని దొంగ ఏడుపు ఏడుస్తాను. పాయసంలో ఏం పడి విషం అయిందో అని నాటకం ఆడుతాను.
వల్లభ: ఒకవేళ గాయత్రీ పాప తినేస్తే.
తిలోత్తమ: అప్పుడు రాబోయే ఆపదను కనిపెట్టలేని నయని కళ్లెదురుగా తన తొలి బిడ్డ అలియాస్ మన శత్రువు గాయత్రీ దేవి చావుని చూస్తుంది. 


ఉదయం హాసిని, దురంధర, విక్రాంత్, పావనామూర్తి వినాయకుడిని ఏర్పాటు చేసి చక్కగా అలంకరించి దీపం పెడతారు. సుమన అందంగా రెడీ అయిపోయి వస్తుంది. పాయసం తీసుకొని తిలోత్తమ, వల్లభ వస్తారు. నయని గాయత్రీ పాపని తీసుకొని వస్తుంది. విశాల్ రాలేదని సుమన అంటే ఒంట్లో బాలేదని అన్నారని అందుకే రాలేదని నయని అంటుంది. చేతికి అలా అవ్వడం వల్లే ఏం చేయలేకపోతున్నాడని తిలోత్తమ అంటుంది. హారతి ఇచ్చిన తర్వాత ప్రసాదం ఇస్తే సరిపోతుందని దురంధర చెప్తుంది. ఇక నయని గజ గండ ఎత్తుకు పోయిన పంచకమణి తమకు దక్కాలని అప్పుడే విశాల్‌కి నయం అవుతుందని గణపతికి మొక్కుతుంది. సుమన కూడా ఆ పంచకమణి తొందరగా మన చేతికి వచ్చేలా కోరుకోమని అందరికీ చెప్తుంది. అందరూ మొక్కుకుంటారు. 


తిలోత్తమ: మనసులో నేను తీసుకొచ్చిన పాయసంలో విషం కలిపినా ఇప్పటి వరకు నయని ఎందుకు కనిపెట్టడం లేదు. ముందు గాయత్రీ పాపకి తినమని చెప్పినప్పుడు నయని విషాన్ని విషయాన్ని గ్రహిస్తుందో లేదో తెలిసిపోతుంది. 


నయనికి దేవుడికి హారతి ఇవ్వమని హాసిని చెప్తుంది. నయని హారతి ఇచ్చి అందరికీ ఇస్తుంది. ఇక తిలోత్తమ గాయత్రీ పాపకు ప్రసాదం ఇవ్వమని చెప్తుంది. ఇక దురంధర తిలోత్తమ విషం కలిపిన ప్రసాదం తీసుకొని ముందు వదినకు ఇద్దామని అంటుంది. దాంతో వల్లభ మమ్మీకా అని అరుస్తాడు. అందరూ అనుమానం వ్యక్తం చేస్తారు. ఇక హాసిని పాయసం తీసుకొని తిలోత్తమకు ఇవ్వడానికి వస్తుంది. ఇక తిలోత్తమ చిన్న పిల్లలు దేవుడితో సమానం అని ముందు పాపకి ఇవ్వమని అంటుంది. ఇక సుమన ప్రసాదం తీసుకొని తింటాను అంటే విక్రాంత్ ఆపుతాడు. సుమనకు ముందు ఆ అదృష్టం ఇవ్వను అని తానే తినడానికి రెడీ అవుతాడు. ఇక పావనా మూర్తి నేను తింటాను అని తీసుకుంటాడు. ఆయన దగ్గర నుంచి హాసిని నేను తింటాను అని తీసుకుంటుంది. ఇక దురంధర ఇక్కడున్నవారికి కాదు కానీ పూజకి రాని విశాల్‌కి ఇవ్వమని చెప్తుంది. మనసులో తిలోత్తమ ఎవరు తిని చస్తారో కానీ నాకు టెన్షన్ పడిపోతుందని అనుకుంటుంది. 


హాసిని గాయత్రీ పాపకి ఇస్తాను అని పాపని తినపించబోతే వినాయక విగ్రహం దగ్గరున్న ఎలుక ఎగురుకుంటూ వచ్చి పాయసం గిన్నెను హాసిని చేతి నుంచి కింద పడేలా చేస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. తిలోత్తమ తన ప్లాన్ వేస్ట్ అయినందుకు తెగ ఫీలవుతుంది. స్వామి వారికి కోపం వచ్చి ఇలా అయిందని నయని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కనక మహాలక్ష్మిని పని మనిషి అంటూ అవమానించిన అంబిక, పద్మాక్షి!