Jagadhatri Serial Today Episode: ఇంటికి వచ్చిన కౌషికిని చూసి సుధాకర్ ఎమోషనల్ గా ఫీలవుతాడు. నిషిక, వైజయంతి వెటకారంగా కౌషికితో మాట్లాడతారు. తర్వాత జేడీ గురించి మాట్లాడుకుంటారు. జేడీని అందరూ మెచ్చుకుంటారు. ధాత్రి మాత్రం ఆ జేడీ తన డ్యూటీ తాను చేసిందని చెప్తుంది. దీంతో నిషిక, వైజయంతి ధాత్రిని తిడతారు. మరోవైపు మీనన్, యువరాజ్ తో మరో కొత్త బిజినెస్ చేయాలని చెప్తాడు. ఏ బిజినెస్ అని అడగ్గానే మాదకద్రవ్యాల బిజినెస్ అని చెప్తాడు. మా తమ్ముడు టోని నీ కోసం వస్తున్నాడని మీరిద్దరు కలిసి ఆ బిజినెస్ చేయాలని చెప్తాడు. యువరాజ్ సరే అని ఫోన్ కట్ చేస్తాడు. టోని మీనన్ కంటే డేంజర్. ఇప్పుడు వాడొస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో ఏంటో అనుకుంటాడు. ఇంతలో టోని వస్తాడు. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. అందరి ముందు టోనిని తన ఫ్రెడుగా పరిచయం చేస్తాడు యువరాజ్.
వైజయంతి: ఈ అబ్బాయి..
యువరాజ్: నా ఫ్రెండు అమ్మా.. నిన్ననే దుబాయ్ నుంచి వచ్చాడు.
టోని: అవునండి. ఒకసారి మిమ్మల్ని అందర్ని కలిసి వెళ్దామని వచ్చాను.
వైజయంతి: అవునా.. ఆత్మీయులు మాత్రమే భోజనం సమయంలో వస్తారు అంటారు. ఎట్టాగో వచ్చావు కదా మాతో పాటు భోం చేసి వెళ్లు బాబు.
టోని: అలాగే ఆంటీ..
అని అంటూనే ధాత్రి, కేదార్ లను వీళ్లెవరు అని అడగ్గానే వాళ్లు మా దూరపు బంధువులు వాళ్ల ఆఫీసుకు దగ్గరగా ఉందని ఇక్కడ ఉంటున్నారు. దీంతో ధాత్రి యువరాజ్, మీనన్ ను మీరు ఎక్కడ ఫ్రెండ్స్ స్కూల్ లోనా? కాలేజీలోనా? అని అడగ్గానే ఒకరేమో స్కూల్ అని.. ఒకరేమో కాలేజీ అని చెప్తారు. తర్వాత ఏ గ్రూప్ అని అడిగితే చెరో గ్రూప్ చెప్తారు. దీంతో మీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్సా.. అని అడగ్గానే అవునని అంటాడు యువరాజ్. దీంతో యువరాజ్ ను అతని ఫోన్ నెంబర్ చెప్పు అనగానే యువరాజ్ తడబడతాడు. టోని కూడా యువరాజ్ నెంబర్ చెప్పడు. దీంతో ధాత్రి, కేదార్ టోనీని అనుమానిస్తారు. ఇంతలో ఏదోలా మేనేజ్ చేసి యువరాజ్, టోని వెళ్లిపోతారు.
నిషిక: ఏంటే.. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు. నీ వెదవ డౌట్లతో వచ్చిన గెస్టుల ముందు ఆయన పరువు తీస్తావా? అసలు మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వడమే మేము చేసిన పెద్ద తప్పు.
వైజయంతి: అవునమ్మీ పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గీరిందని వీళ్లను ఇంట్లో ఉండనిచ్చినందుకు బాగా బుద్ది చెప్పారు. జగధాత్రి ఎవరి హద్దుల్లో వాళ్లుండటం మంచిది.
అని వైజయంతి చెప్పి తాను మాత్రమే తినడానికి కూర్చుంటుంది. తర్వాత ఎవరి మానాన వాళ్లు వెళ్లిపోతారు. ధాత్రి, కేదార్ టోని గురించి ఆలోచిస్తుంటారు. ఇంతలో సాధు తన కూతురు ఆరాధ్య కలిసి వస్తారు. ఆయన్ని చూసిన ధాత్రి, కేదార్ ఎదురు వెళ్లి స్వాగతం చెప్తారు. పక్కకు వెళ్లి మాట్లాడుకుందాం రండి అని పక్కకు వెళ్తుంటే నిషిక వచ్చి ఏంటి అంత సీక్రెటా అని అడుగుతుంది. ఏం లేదని పక్కు వెళ్లిపోతారు ధాత్రి దగ్గరే ఆరాధ్యను వదిలేసి సాధు వెళ్లిపోతాడు.
మరోవైపు టోని, యువరాజ్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో టోని చేతిలో బ్రౌన్ షుగర్ కింద పడటంతో యువరాజ్ పేపర్ ఎత్తి కిందపడేస్తాడు. అది బూచి దగ్గర పడుతుంది. బూచి అది తింటాడు. మరోవైపు టోని వెళ్లిపోతుంటే ధాత్రి, మీ చిన్నప్పటి ఫోటోలు ఏమైనా ఉన్నాయా అని అడగ్గానే యువరాజ్ అలాంటివేం లేవని చెప్పి టోనిని పంపిచేస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్, కావ్యను విడదీసేందుకు రుద్రాణి ప్లాన్ – స్వప్నను పూల్ చేసిన రాహుల్