Seethe ramudi katnam Serial Today Episode: మధును ఆఫీసులో అవమానించిన వాడిని చంపేస్తానని సూర్య వాళ్ల అన్నయ్య కత్తి తీసుకుని వెళ్లబోతుంటే ఆయన భార్య వచ్చి ఆపుతుంది. మగరాయుడిలా రోడ్లు పట్టుకుని తిరుగుతే ఇలాంటి అవమానాలే జరుగుతాయని మీరెందుకు వెళ్తారని ఆయన చేతిలో ఉన్న కత్తిని లాక్కుంటుంది. అలాగే సూర్యను కూడా తిడుతుంది. దీంతో సూర్య వాళ్ల అన్నయ్య లోపలికి వెళ్లిపోతాడు. మరోవైపు రామ్, సీత ఇంటిని అలంకరిస్తుంటారు. ఇంతలో గిరి, అర్చన వస్తారు.
అర్చన: అలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు వీళ్ల ఉత్సాహం చూస్తుంటే నవ్వోస్తోందండి.
గిరి: మరే జరగని నిశ్చితార్థానికి పొద్దునే ప్రయాస పడుతున్నారు.
చలపతి: నిశ్చితార్థం జరగదని మీరెలా అనుకుంటున్నారు.
అర్చన: మహాలక్ష్మీ ప్రమేయం లేకుండా ఈ ఇంట్లో ఏ వేడుకైనా జరిగిందా? అన్నయ్యగారు.
చలపతి: సీత తలుచుకుంటే జరగనిది ఏదీ లేదు చెల్లేమ్మా..?
గిరి: సీత చాలెంజ్ చేయడం అది మీరు నమ్మడం గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టు ఉంది బావగారు.
రామ్: గుడ్డి వాళ్లం మేము కాదు బాబాయ్ మీరు. మీకు కళ్లున్న మనసు లేదు. అందుకే రేవతి అత్తయ్య అన్నయ్యలుగా మీరు నాన్నా చేయాల్సిన పనులు మేము చేస్తున్నాం.
అర్చన: మీ బాబాయికి మనసు లేకపోతే నీకు గౌరవ మర్యాదలు ఉన్నాయా? నిన్న ఆయన కాలర్ పట్టుకున్నప్పుడు నీ క్యారెక్టర్ ఏమైంది.
సీత: మాటను బట్టే మర్యాద ఉంటుంది. ప్రవర్తనను బట్టే గౌరవం ఉంటుంది చిన్నత్తయ్యా..
అని సీత చెప్పగానే గిరి, అర్చన నోరు మూసుకుంటారు. తర్వాత సీతే రామును నాశనం చేస్తుందని అర్చన తిడుతుంది. దీంతే రామ్ నన్నెవరూ పాడు చేయడం లేదని చెప్తాడు. దీంతో గిరి, అర్చన లు ఇద్దరితో మనకేం పని మామ మనకు మహాలక్ష్మీ, జనార్ధన్ లతోనే పని అని సీత చెప్తుంది. మరోవైపు మహాలక్ష్మీ నైట్ నేను చెప్పింది గుర్తుంది కదా జనా అంటుంది. అంతా గుర్తుంది అంటాడు జనార్ధన్. ఇద్దరూ కలిసి సీతను ఎలా వెళ్లగొట్టాలో ప్లాన్ చేస్తారు. మరోవైపు రేవతి నిశ్చితార్థానికి రెడీ అవుతుంది.
విద్యాదేవి: ఒకసారి అద్దంలో చూసుకో రేవతి. నా అలంకరణ నీకు నచ్చుతుందో లేదో..
రేవతి: చాలా బాగా రెడీ చేశారు టీచర్.
విద్యాదేవి: మరి అంత డల్ గా చెప్తావేంటి?
రేవతి: నా నిశ్చితార్థం జరుగుతుందో లేదో అని భయంగా ఉంది.
విద్యాదేవి: నీకా భయం అక్కర్లేదు. సీత చెప్పిందంటే కచ్చితంగా చేస్తుంది.
రేవతి: ఊరికే నిశ్చితార్థం జరగడం కాదు కదా టీచర్. మా అన్నయ్య వదినలు నిశ్చయ తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోవాలి.
విద్యాదేవి: నేను చెప్పింది కూడా అదే రేవతి..
అని టీచర్ ఎంత చెప్పినా రేవతి డల్ గానే ఉంటుంది. మీకున్న ధైర్యం నాకు లేదు. ఏం జరుగుతుందో అని భయంగా ఉంది అంటుంది రేవతి. కానీ టీచర్ రేవతికి ధైర్యం ఇస్తుంది. తర్వాత హాల్‌లోకి అందరూ వస్తారు. అయితే తాము నిశ్చితార్థం కోసం రెడీ కాలేదని మహాలక్ష్మీ, జనార్దన్ చెప్తారు. ఇదేదో సస్పెన్స్ సినిమాలా ఉందని చలపతి అనడంతో నువ్వు సస్పెన్స్ సినిమానే చూస్తావు ఉండు అంటాడు జనార్ధన్. ఇంతలో పంతులు నిశ్చిర్థానికి అంతా రెడీ చేస్తుంటాడు. ఇంతలో కిరణ్ వస్తాడు. దీంతో మహాలక్ష్మీ కిరణ్ బంధువులు ఎక్కడ? కనీసం ఒక కుక్క కూడా తన వెంట రాలేదని అవమానిస్తుంది. ఒంటికొమ్ము సొంటిగాడిలా వచ్చాడు ఈ అనాథగాడికి నా చెల్లెలును ఇస్తానా? నెవర్ అంటాడు జనార్థన్. దీంతో కిరణ్ ఏడుస్తుంటాడు. గిరి, అర్చన వెటకారంగా మాట్లాడతారు. దీంతో కిరణ్ తరపున తాంబూలాలు తీసుకోవడానికి వాళ్లు వస్తున్నారు అని రామ్ చూపించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.