Brahmamudi Serial Today Episode: కనకం, మూర్తి తమ ఇంట్లో ఇద్దరమే ఉంటున్నాం మీరు ఇంటికి వస్తే కొడుకైనా.. అల్లుడైనా మీరే మాకు అని అడుగుతారు.  దీంతో కళ్యాణ్‌ ఏదో చెప్పబోతుంటే.. అప్పు తాము రాలేమని ఇక్కడే ఉంటామని చెప్తుంది. అల్లుడు ఎప్పుడు కొడుకు కాలేడు. వస్తే ఇల్లరికం అల్లుడవుతాడని అప్పు అంటుంది. దీంతో మీరు సంతోషంగా ఉన్నారు. అది చాలు. మాకు పెళ్లైనప్పుడు ఇంతకంటే చిన్నగదిలోనే ఉండేవాళ్లం. కానీ, తృప్తిగా ఉన్నాం. అని చెప్పి తమ దగ్గర ఉన్న మూడు వేల రూపాయలు ఇచ్చి వెళ్లిపోతారు కనకం, మూర్తి. తర్వాత ఆ మూడు వేలు ఖర్చులకు తీసుకో అని అప్పు అంటే అవి మీ అమ్మ నీకోసం ఇచ్చింది. ఆ డబ్బును నేను ముట్టుకోను  అని నేను ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. ఇంకా నిన్ను కష్టపెట్టలేను అంటాడు కళ్యాణ్‌.   మరోవైపు హాల్లో క్యారంబోర్డ్ రెడీ చేస్తుంటాడు రాజ్. కిచెన్‌లోకి కావ్య వెళ్తుంటే..


రాజ్‌: ఇవాళ శ్రావణ శుక్రవారం సందర్భంగా నీకు సెలవు ఇస్తున్నాను రా


కావ్య: అందరూ చూస్తే నవ్వుకుంటారు.


రాజ్: నేను ఉన్నాగా చెప్పడానికి. కొండంత అండగా నేనుండగా నువ్వేందుకు భయపడతావు.


కావ్య: అయితే కూర్చోన కొండంత అండ


రాజ్‌: కూర్చో తొండంత పిల్ల


కావ్య: ఏంటి ఏమన్నారు..?


రాజ్‌: ఏదో ప్రాసకోసం అన్నానులే


 అని రాజ్‌ చెప్తుండగానే అపర్ణ, ఇందిరాదేవి వస్తారు. వాళ్లు కూడా క్యారమ్స్‌  ఆడతాం అంటారు. అపర్ణ, కావ్య వైపు, ఇందిరాదేవి రాజ్‌ వైపు కూర్చుంటారు. నలుగురు కలిసి క్యారమ్‌ ఆడుతుంటే.. అందరూ వస్తారు. మీ తర్వాత నేను అన్నయ్య ఒక జట్టు, స్వప్న రాహుల్‌ ఒక జట్టుగా ఆడతామంటాడు.  ఇంతలో రుద్రాణి, ధాన్యలక్ష్మీ వస్తారు.


రుద్రాణి: అబ్బా ఇల్లు ఎంత రమణీయంగా ఉందో..


ధాన్యలక్ష్మీ: రాత్రి నువ్వు కూడా సంతోషంగా ఉన్నావు కదా. చెంపమీద కొట్టిన బుద్ధిరాలేదా. నాతో మాట్లాడుతున్నావు.


రుద్రాణి: అదా రాత్రి నా కోడులు నామీద రివేంజ్‌ తీర్చుకుంది. అప్పును అవమానించినందుకు నా రూంలో లాఫింగ్‌ గ్యాస్‌ పెట్టింది అందుకే అలా నవ్వాను. లేదంటే నువ్వు బాధలో ఉంటే నేనెందుకు నవ్వుతాను ధాన్యలక్ష్మీ. అయినా నీ కొడుకు వెళ్లిపోయిన బాధ ఇంట్లో ఎవరికైనా ఉందా? చూడు.


 అని రుద్రాణి, ధాన్యలక్ష్మీని రెచ్చగొడుతుంది. దీంతో ధాన్యలక్ష్మీ గొడవ చేయబోతుంటే రుద్రాణి అపుతుంది. ధాన్యలక్ష్మీ లోపలికి వెళ్లిపోతుంది. రుద్రాణి ఆటలేనా ఏమైనా టిఫిన్స్‌ ఉన్నాయా? అని అడుగుతుంది. ఇంతలో బయట నుంచి టిఫిన్స్‌ వస్తాయి. ఇవాళ నా శ్రీమతికి సెలవు అందుకే బయటి నుంచి టిపిన్స్‌ వచ్చాయి అని రాజ్‌ చెప్తాడు. తర్వాత రుద్రాణి రాహుల్‌ దగ్గరకు వెళ్లి


రుద్రాణి: వాళ్ల నవ్వు చూస్తుంటే కడుపు మండిపోతుంది. తమ్ముడు వెళ్లిపోతే డిప్రెషన్‌లో ఉంటాడనుకుంటే భార్యతో కలిసి సంతోషంగా ఉంటున్నాడు.


రాహుల్‌: ఇలా అయినా కంపెనీకి దూరంగా ఉంటాడు కదా మామ్‌.


రుద్రాణి: ఇలా సరిపోదు. వాళ్లిద్దరు సంతోషంగా ఉంటే ఆపలేం. ఇదే టైమ్‌లో కావ్యపై రాజ్‌కు కోపం వచ్చేలా చేయాలి.


 అని ఒకప్పుడు మన కంపెనీలో ఇల్లీగల్‌గా బంగారం పెట్టేందుకు ట్రై చేశావ్ కదా. మళ్లీ ఆ పని  చేస్తున్నట్లుగా స్వప్నకు తెలిసేలా నటించు.  స్వప్న వెళ్లి కావ్యకు చెబుతుంది. అప్పుడు కావ్య ఇంట్లో అందరికీ చెప్తుంది. అది నిజం కాదని కావ్య కావాలనే రాహుల్‌ ను ఆఫీసుకు వెళ్లకుండా కక్ష కట్టిందని కావ్యను అందరి ముందు దోషిని చేద్దాం అంటుంది రుద్రాణి. రాహుల్‌ సరే అని వెళ్లిపోతాడు. రూంలో స్వప్న వినేలా ఎవరితోనో ఇల్లీగల్‌ గోల్డ్‌ గురించి ఫోన్‌ మాట్లాడతాడు రాహుల్‌. ఇదే విషయం స్వప్న, కావ్యకు చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.