Sudigali Sudheer: లైవ్ లోనే సుధీర్ కి ఫోన్ - అతడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన మేనేజర్!

'జబర్దస్త్' షోకి ఒకప్పుడు మేనేజర్ గా పని చేసిన ఏడుకొండలు అనే వ్యక్తి ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

Continues below advertisement

మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న 'జబర్దస్త్' షో చాలా మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. ఈ షోతో పాపులర్ అయిన వాళ్లు సినిమాలు, షోలు అంటూ బిజీగా గడుపుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో సుధీర్, గెటప్ శ్రీను, అనసూయ ఇలా చాలా మంది 'జబర్దస్త్' షో నుంచి బయటకొచ్చేశారు. ఈ విషయంలో చర్చనీయాంశంగా మారింది. అలానే ఈ షోలో కమెడియన్ గా పని చేసిన కిరాక్ ఆర్ఫీ ఈ షో గురించి, మల్లెమాల సంస్థ గురించి దారుణంగా మాట్లాడాడు. జీతాలు సరిగ్గా ఇవ్వరని, సరైన భోజనం కూడా పెట్టరని విమర్శలు చేశాడు. 

Continues below advertisement

ఈ ఆరోపణలపై హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా 'జబర్దస్త్' షోకి ఒకప్పుడు మేనేజర్ గా పని చేసిన ఏడుకొండలు అనే వ్యక్తి ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. మల్లెమాల సంస్థ, జబర్దస్త్ షోపై వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. ఈ షోపై చేస్తోన్న విమర్శల్లో అర్ధం లేదని అన్నారు. కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కిరాక్ ఆర్ఫీతో పాటు సుడిగాలి సుధీర్ గురించి కూడా మాట్లాడారాయన. 

సుధీర్ షో నుంచి ఎందుకు బయటకొచ్చాడో మీకు తెలుసా..? అని యాంకర్ ప్రశ్నించగా.. ''ఆ విషయం గురించి నేను మాట్లాడదామని ఫోన్ చేస్తే అసలు లిఫ్ట్ చేయడు. చాలా కాలంగా నా ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాడు. వీరికి ఫ్యాన్స్ ఎలా వచ్చారు మా షోతోనే కదా..? ఎదిగిపోయారు కదా ఇంక మాట్లాడరు. ఏదో సినిమాల్లో బిజీగా ఉన్నాం అని చెబుతుంటారు. అతను చేసిన ఏ సినిమా అయినా ఆడిందా..? చెప్పమనండి. ఒకసారి మాల్ ఓపెనింగ్‌కి గెస్ట్ గా రావాలని అడిగితే తన మేనేజర్‌ తో మాట్లాడమని చెప్పాడు'' అంటూ సుధీర్ ప్రవర్తన గురించి చెప్పుకొచ్చారు ఏడుకొండలు. ఇప్పుడు సుధీర్ కి ఫోన్ చేస్తారా..? అని లైవ్ లోనే ఏడుకొండలుతో ఫోన్ చేయించారు యాంకర్. కానీ సుధీర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు.

 
 

Continues below advertisement