జ్ఞానంబ అన్న మాటలు గుర్తు చేసుకుని జానకి బాధపడుతుంది. తొలి రేయి రోజు రామా జానకి పుస్తకాలు చూసి తనకి దూరంగా వెళ్ళిన విషయం గుర్తుచేసుకుంటుంది. 'ఐపీఎస్ కోసం మీరు కన్న కలని , మీ నాన్న ఆశయాన్ని నాకు గుర్తు చేస్తున్నాయి. మీ కిష్టమైన మీ ఐపీఎస్ ని అందించడం భర్తగా నా బాధ్యత, ఆ ఇష్టం భవిష్యత్ లో మీతో కన్నీళ్ళు పెట్టించే కష్టం కాకూదండి' అని రామా బాధగా చెప్తాడు. అలా ఏమి జరగదండీ నేను ఒక వైపు సంసార బాధ్యతని కూడా నిర్వర్తిస్తూనే మరో వైపు చదువుని కొనసాగిస్తానని చెప్తుంది. ఒక వేళ మీరు తల్లి అయితే ప్రతి రోజు రాత్రి పూట అంతా దూరం వెళ్ళి చదువుకొని రాగలరా? మంచి మార్కులు వచ్చి మీరు ఐపీఎస్ అయిన తర్వాత తల్లయిన వాళ్ళని అసలు ఐపీఎస్ శిక్షణకి అనుమతిస్తారా? చెప్పండి జానకి గారు అని ప్రశ్నిస్తాడు. అమ్మకిచ్చిన మాట కోసం మీరు ఆలోచిస్తున్నారని నాకు అర్థం అయింది. కానీ మీ ఐపీఎస్ చదువుకి ఆటంకం కలిగితే మీరు తట్టుకోగలరా అంటాడు. రామా గారు మీరు చెప్పేది నిజమే కానీ నా చదువుకి ఆటంకం రాకుండా నేను చూసుకుంటానని అంటే చెప్పినంత తేలిక కాదు అది చేతికి వచ్చింది దూరం అయితే అది ఎలా ఉంటుందో నాకు తెలుసని అంటాడు. ఒక్క రెండేళ్ళు ఓపిక పడితే తర్వాత జీవితాంతం సంతోశంగా ఉండవచ్చు అని రామా సర్ధి చెప్పేందుకు ప్రయత్నిస్తాడు. 


Also Read: జైల్లో తులసి, నందుని కాపాడేందుకు ప్రయత్నం- యాక్సిడెంట్ చేసింది నందునే అని సామ్రాట్ కి తెలుస్తుందా?


'అత్తయ్యగారు నామీద నేను ఇచ్చిన మాట మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఈ ఇంట్లో పసిపిల్లల నవ్వులు వినిపిస్తాయని ఆశపడుతున్నారు. కానీ నేను అబద్ధం చెప్పానని తెలిస్తే ఎక్కువ బాధపడతారు. అన్నిటికీ మించి అత్తయ్యగారి దగ్గర నమ్మకాన్ని కోల్పోతాను, అప్పుడు నన్ను క్షమించడం కాదు నా మొహం చూడటానికి కూడా ఇష్టపడరు' అని జానకి బాధపడుతుంది. ఇక రామా ఏం జరిగిందా అని ఆలోచిస్తుండగా జానకి ఫోన్ చేసి మళ్ళీ ఆటపట్టిస్తుంది. మీ చిలిపి అల్లరి మీ ముద్దు మురిపాలు గుర్తొస్తున్నాయని ఉడికిస్తుంది. నాకు తెలిసినంత వరకు రాత్రి ఏమి జరగలేదని అంటాడు. చేసిందంత చేసి ఇప్పుడేమి గుర్తు లేదని అంటున్నారా అని జానకి అంటుంది. రామా కోసం జానకి మళ్ళీ అందంగా రెడీ అయ్యి ఎదురు చూస్తూ ఉంటుంది. అదంతా మల్లిక చూసి వాళ్ళ ఏకాంతాన్ని ఎలా చెడగొట్టాలని ఆలోచిస్తుంటుంది. అది చూసి విష్ణు నా కోసం ఎదురు చూస్తున్నవా అని అడుగుతాడు. అంత లేదని చెప్పి విష్ణు మీద అరవడంతో వెళ్ళిపోతాడు. జానకి రామా ఏం చేస్తున్నారా అని తొంగి చూస్తుంది మల్లిక అప్పుడే అక్కడికి జ్ఞానంబ వచ్చి మల్లిక భుజం మీద చెయ్యి వేస్తుంది విష్ణు వేశాడని అనుకుని చిరాకు తెప్పించావంటే విడాకులు ఇచ్చేస్తానని అరుస్తుంది. ఆ మాట ఇటు తిరిగి చెప్పు అని జ్ఞానంబ అనడంతో మల్లిక ఖంగుతింటుంది.


 Also Read: శాడిస్ట్ లా తయారైన శౌర్య - హిమ అనుకుని రౌడీబేబీకి మళ్లీ ఐ లవ్ యూ చెప్పిన డాక్టర్ సాబ్


ఇదెంటి టోను మారిందని వెనక్కి తిరిగి చూసి అత్తయ్యగారు మీరా అని టెన్షన్ పడుతుంది. జ్ఞానంబ కోపంగా చూస్తుంటే అలా చూడకండి పెద్ద పులి వచ్చి మీద పడిపోతున్నట్టు అనిపిస్తుంది. భయంతో ఇప్పుడే పోయేలా ఉన్నాను, ప్లీజ్ అత్తయ్యగారు అని తిక్క తిక్కగా మాట్లాడుతుంది. నీ భర్త అంటే అసలు గౌరవం ఉందా అలా తిడతావా అని చీవాట్లు పెడుతుంది.