Hyper Aadi: తెలుగు బుల్లితెరపై స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హైపర్ ఆది. జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన ఆది తన కామెడీ టైమింగ్ తో విశేష అభిమానులను సొంతం చేసుకున్నాడు. అదే క్రేజ్ తో సినిమాల్లోనూ నటిస్తూ స్క్రిప్స్ రైటర్ గా కూడా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. గత కొంత కాలంగా ఆది పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మధ్య తాను కూడా త్వరలో ఓ ఇంటివాడిని అవ్వాలని భావిస్తున్నట్లు చెప్పినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దీంతో ఆది చేసుకోబోయే అమ్మాయి ఎవరు అనే చర్చ మొదలైంది. 


ప్రేమ పెళ్లి చేసుకోనున్న హైపర్ ఆది..


హైపర్ ఆది పెళ్లి గురించి గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆది కూడా తాను త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఆది ప్రేమ పెళ్లి చేసుకుంటాడనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినబడుతోంది. ఓ ప్రముఖ యూట్యూబ్ యాంకర్ తో ప్రేమలో ఉన్నాడని తెలుస్తోంది. ఆదికు ఆమెతో చాలా సంవత్సరాల నుంచే పరిచయం ఉందని చెబుతున్నారు. ఆయన ఇండస్ట్రీకు వచ్చిన కొత్తలో ఆమె  చాలా సపోర్ట్ గా నిలిచిందట. దీంతో వాళ్లదరి మధ్య స్నేహం కుదిరి అది కాస్తా తర్వాత ప్రేమగా మారిందట. ఇప్పుడు ఆది ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోనున్నాడని సమాచారం. 


ఇంట్లో పెద్దలను ఒప్పించి..


హైపర్ ఆది ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నాడట. అయితే ఈ విషయం చాలా మందికి తెలియలేదు. ఇప్పటి వరకూ ఆది కూడా ఎక్కడా ఆ టాపిక్ గురించే మాట్లాడలేదు. అయతే ఇన్నేళ్ల తర్వాత తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట ఆది. అందుకే వారి ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాలకు చెప్పారట. ఇంట్లో వాళ్లు కూడా అంగీకరించడంతో వీరి పెళ్లికి లైన్ క్లియర్ అయినట్టు సమాచారం. త్వరలోనే ఈ జంటకు నిశ్చితార్థ ఏర్పాట్లు కూడా చేస్తున్నారట కుటుంబ సభ్యులు. ఈ వార్త ఇప్పుడు బయటకు రావడంతో ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిందట. ఇక పెళ్లికి సబంధించిన విషయాన్ని ఆది స్వయంగా చెబుతాడని అంటున్నారు. అయితే ఇప్పుడు ఆది ప్రేమించిన అమ్మాయి ఎవరు అనేది సస్పెన్స్ లా మారింది. ఇప్పటికే ఆయన అభిమానులు ఆ అమ్మాయి ఎవరా అని ఆరా తీస్తున్నారు. మరి తాను చేసుకోబోయే అమ్మాయిని ఆది ఎప్పుడు పరిచయం చేస్తాడో చూడాలి. 


వరుస అవకాశాలతో కెరీర్ లో దూసుకెళ్తున్న ఆది..


చదువుకునే రోజుల్లో సరదాగా చేసిన ఓ షార్ట్ ఫిల్మ్ ఆది కెరీర్ ను మార్చేసింది. అది బాగా పాపులర్ అవ్వడంతో అతనికి ‘జబర్దస్త్’ అనే కామెడీ షో లో అవకాశం వచ్చింది. అక్కడి నుంచి ఆది ప్రస్థానం మొదలైంది. తనదైన కామెడీ టైమింగ్ తో అతి తక్కువ కాలంలోనే ఆ కామెడీ షోలో కంటెస్టెంట్ నుంచి టీమ్ లీడర్ గా ఎదిగి హైపర్ ఆది గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే క్రేజ్ తో వరుస సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. అంతే కాదు స్క్రిప్ట్ రైటర్ గానూ రానిస్తున్నాడు ఆది. ఓ వైపు టీవీ షోలలో చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు హైపర్ ఆది. 


Also Read: ‘భోళా శంకర్’ సీక్రెట్ చెప్పేసిన తమన్నా - ఇది ‘వేదాళం’కి రీమేక్ కాదా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial