Janaki Kalaganaledhu July 29th: అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని జానకి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. జానకికి ఇష్టమైన వంటలు చేసి పెడుతుంది తన అత్త. భోజనం చేద్దాము అనటంతో వెన్నెల్లో వచ్చాకే జానకితో కలిసి భోజనం చేయాలి అని అంటుంది జ్ఞానంబ. ఈమధ్య వెన్నెల చదువు పట్ల బాగా శ్రద్ధ పెట్టి ఎవరి మాట వినటం లేదు అని అంటుంది. మలయాళం నువ్వు వెళ్ళి పిలుచుకొని రమ్మని అనడంతో తన మాట కూడా వినదు అని అంటాడు మలయాళం. దాంతో జ్ఞానంబ కాస్త అనుమానంగా ముఖం పెడుతూ కనిపిస్తుంది.


ఇక జానకి నేను వెళ్లి తీసుకొని వస్తాను అని అనటంతో వెంటనే మల్లిక ఇక తన వెన్నెల దగ్గరికి వెళ్తే అక్కడికెళ్లి ముచ్చట్లు పెట్టి మరింత ఆలస్యం చేస్తుందని వెటకారం చేస్తుంది. ఇక జానకి వెన్నెల దగ్గరికి బయలుదేరగా మరోవైపు వెన్నెల ఫోన్లో తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక తను బాగా మొండి చేయటంతో నా కొంప ముంచేలాగా ఉన్నావు అని అంటుంది.


అప్పుడే జానకి రావటంతో సైలెంట్ గా ఫోన్ కట్ చేసి తన మాటలు విన్నదేమో అని కంగారుపడుతుంది. ఫోన్లో ఎవరు అని జానకి అడగటంతో తన ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్ అని అబద్ధం చెప్పి కవర్ చేస్తుంది. వెంటనే జానకి నేను ఒకటి ఊహించుకుంటే నువ్వు మరోలా మాట్లాడుతున్నావు అనటంతో ఏం జరిగింది అని కంగారుతో అడుగుతుంది. నేను రాగానే వదలకుండా ముచ్చట్లు పెడతావ్ అనుకున్నాను అని అనటంతో కాస్త ఊపిరి పీల్చుకుంటుంది వెన్నెల.


మరోవైపు మల్లిక చూశారు కదా జానకి ముచ్చట్లు పడి రాదు అని అంటుంది. వెంటనే జ్ఞానంబ మలయాళం తో జానకికి అన్నం వడ్డించు అంటుంది. దాంతో మల్లిక వద్దులే కాసేపు ఆగుతాను అని అంటుంది.  జానకి వాళ్ళు రావడంతో అఖిల్ వెన్నెల పై అరుస్తాడు. వెంటనే జానకి తను చదువుకుంటుందని కవర్ చేస్తుంది. ఇక జ్ఞానంగా అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది.


అందరూ సరదాగా ముచ్చట్లు పెడుతుంటే మల్లిక మాత్రం వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక రాత్రికి వెళ్లే సన్మానానికి అందరూ ముందుగానే బయలుదేరాలి అని చెబుతాడు గోవిందరాజులు. అప్పుడే రామ కూడా తను అక్కడ జ్ఞానంబ స్వీట్లు పంచాలి అనుకుంటున్నాను అని అంటాడు. దానికి అందరూ సరే అంటారు. మల్లిక మాత్రం ఆ సీట్లలో ఏదో కలపడానికి ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.


భోజనం అనంతరం నీలావతి జానకిత వరుస కలుపుకోవడం కోసం జ్ఞానంబను మరదలా అంటూ మాట్లాడుతూ ఉంటుంది. దాంతో గోవిందరాజులు ఆచార్యపోగా.. జానకి కోసం వరుస కలిపినందుకొని కనిపెడతాడు. ఇక నీలావతి జ్ఞానంబకు మల్లెపూలు తెచ్చి ఇవ్వగా అవి జానకికి ఇవ్వడానికి వెళ్తుంది. ఇక నీలావతి గోవిందరాజులతో మల్లిక గురించి మాట్లాడుతూ ఎప్పుడు తిండి మీదనే ధ్యాస అంటూ తిడుతూ ఉంటుంది.


దాంతో మల్లికకు బాగా కోపం వస్తుంది. ఇక జానకి దగ్గరికి వెళ్లిన జ్ఞానంబ జానకికి తను పెట్టిన కండిషన్స్ గుర్తుకు తెచ్చుకొని బాధపడి తన కోడలి మంచితనాన్ని తలుచుకొని ఫిదా అయ్యి తనతో మాట్లాడుతూ తనని పొగుడుతూ ఉంటుంది. ఇంకా ఆ మాటలకు జానకి ఎమోషనల్ గా సంతోషపడుతుంది. మరోవైపు మల్లిక దగ్గరికి వెళ్లిన నీలావతిని చూసి మల్లిక ఫైర్ అవుతుంది.


also read it : Prema Entha Madhuram July 28th: అందరి ముందు ఆర్యకు కర్రీ నచ్చదంటూ నోరు జారిన అను.. మాన్సీని గట్టిగా కొరికిన సత్తెమ్మ?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial