Jabardasth Avinash About First Salary: ‘జబర్దస్త్’ అనే కామెడీ షో వల్ల ఎంతోమంది కమెడియన్లకు ఫేమ్ లభించింది. అందుకే వారందరూ తమ పేర్లకు ముందు జబర్దస్త్ అనే ట్యాగ్‌ను యాడ్ చేసుకున్నారు. అందులో జబర్దస్త్ అవినాష్ ఒకరు. వేరొకరి టీమ్‌లో ఒక మెంబర్‌గా జాయిన్ అయ్యి.. తర్వాత తనే స్వయంగా టీమ్ లీడర్‌గా కూడా మారాడు అవినాష్. ఆ తర్వాత మెల్లగా తనకు సినిమాల్లో కామెడియన్‌గా అవకాశాలు మొదలయ్యాయి. దీంతో ఇతర జబర్దస్త్ సభ్యులలాగానే అవినాష్ కూడా ఆ షో నుండి తప్పుకున్నాడు. తాజాగా తన ఫస్ట్ శాలరీ ఎంత? దాంతో ఏం చేశాడో బయటపెట్టాడు అవినాష్.
గర్వంగా అనిపించింది..
జబర్దస్త్‌లోని ఒక ఎపిసోడ్ కోసం రూ.1500 రెమ్యునరేషన్ అందుకున్నానని, అదే తన మొదటి రెమ్యునరేషన్ అని బయటపెట్టాడు అవినాష్. అది తక్కువ అమౌంటే అయినా చాలా గర్వంగా అనిపించిందని చెప్పాడు. ప్రస్తుతం షోను బట్టి, అందులో తన కష్టాన్ని బట్టి ఛార్జ్ చేస్తానని, మరీ లక్షల్లో ఛార్జ్ చేస్తానని చెప్పలేనని అన్నాడు. ‘‘ఆ సమయంలో నేను ఇండస్ట్రీలో ముందుకు వెళ్తానా లేదా అని డౌట్‌గా ఉండేది. అలాంటి 1500 రెమ్యునరేషన్ రావడం చాలా సంతోషంగా అనిపించింది’’ అని తెలిపాడు అవినాష్. ఎవరికైనా తమ మొదటి జీతం, మొదటి సంపాదన చాలా స్పెషల్‌గా ఉండిపోతుంది. అదే విధంగా తను ఫస్ట్ జీతంతో ఏం చేశాడని అడగగా.. షాకింగ్ సమాధానం ఇచ్చాడు అవినాష్.
ఎవరైనా ఇంతే..
‘‘మొదటి సంపాదనతో తాగాను. ప్రపంచంలో మొదటి జీతం వచ్చిన ఎవడూ దానిని దాచిపెట్టుకొని చూస్తూ ఉండడు. ఫుల్ ఎంజాయ్ చేస్తాడు’’ అని తన అభిప్రాయాన్ని బయటపెడుతూనే తన మొదటి సంపాదనతో ఫుల్‌గా తాగి ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చాడు అవినాష్. ఇక ఆ సంపాదనతో తన తల్లికి ఏం గిఫ్ట్ ఇవ్వలేదు అని అడిగగా.. ‘‘మా అమ్మకు బంగారు గాజులు అంటే చాలా ఇష్టం. కానీ 1500కు రావు కదా. భవిష్యత్తులో నేను ఇంకా ఎక్కువగా సంపాదిస్తాను అనే నమ్మకంతో అప్పుడు ఆ ఎమౌంట్‌తో తాగేశాను. ఎక్కువ డబ్బులు వచ్చాక అమ్మకు గాజులు కొనిచ్చాను’’ అంటూ తన అమ్మ కోరిక తీర్చిన సందర్భం గురించి బయటపెట్టాడు అవినాష్.
ముక్కు అవినాష్‌గా..
జబర్దస్త్‌లో పెద్ద ముక్కుతో, వింత ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరినీ నవ్వించేవాడు అవినాష్. అందుకే తనకు ప్రేక్షకులంతా ముక్కు అవినాష్ అని పేరు పెట్టుకున్నారు. జబర్దస్త్‌లో టీమ్ మెంబర్ నుండి టీమ్ లీడర్‌గా మారిన సమయంలోనే తనకు బిగ్ బాస్ నుండి ఆఫర్ వచ్చింది. దీంతో బిగ్ బాస్ సీజన్ 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. అందులో కొన్నాళ్లకే ఎలిమినేట్ అయ్యాడు. తిరిగి జబర్దస్త్‌లో అడుగుపెట్టకుండా స్టార్ మాలోని షోలతోనే ఆడియన్స్‌లో ఎంటర్‌టైన్ చేయడం మొదలుపెట్టాడు. పైగా అవినాష్ ప్రారంభించిన యూట్యూబ్ ఛానెల్‌కు కూడా లక్షల్లో సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అలా బుల్లితెర వీడియోలతో, యూట్యూబ్ వ్లాగ్స్‌తో బిజీగా ఉన్నాడు అవినాష్.
Also Read: ఒకరు హైపర్, ఒకరు రిజర్వ్‌డ్ - బాలకృష్ణ, మహేశ్ బాబుపై బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్