Bigg Boss Ashwini Sree: సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన చాలామంది బిగ్ బాస్‌లో కంటెస్టెంట్స్‌గా కనిపించిన తర్వాత ఫేమస్ అయిపోవడంతో పాటు అవకాశాలు కూడా ఎక్కువగా అందుకుంటూ ఉంటారు. అలాంటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌లో అశ్విని శ్రీ కూడా ఒకరు. బిగ్ బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది అశ్విని శ్రీ. ప్రతీ చిన్న విషయానికి ఏడుస్తూ అయోమయం మనిషిగా బిగ్ బాస్ ఫ్యాన్స్‌కు గుర్తుండిపోయింది ఈ భామ. ఈ బిగ్ బాస్ బ్యూటీ.. బాలకృష్ణ, మహేశ్ బాబు లాంటి స్టార్లతో కూడా కలిసి నటించింది. తాజాగా తను పాల్గొన్న ఒక పోడ్కాస్ట్‌లో వారిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Continues below advertisement


మాట్లాడుతూనే ఉంటారు..


బాలకృష్ణ తన ఫేవరెట్ అని చెప్తూ.. తనతో కలిసి నటించిన ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో చెప్పుకొచ్చింది అశ్విని శ్రీ. ‘‘ఆయన చాలా చిల్‌గా ఉంటారు. మామూలుగా బయట నుంచి చూస్తే అమ్మో బాలకృష్ణ చాలా కోపంగా ఉంటారు.. కొట్టేస్తారు, ఫోన్‌లు విసిరేస్తారు అనే ఫీలింగ్ ఉంటుంది. అసలైతే ఆయన చాలా జెంటిల్‌మ్యాన్. పక్కన కూర్చుంటే చిన్నపిల్లాడిలాగా ప్రవర్తిస్తారు. ఏదైనా మాట్లాడేస్తారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీ విషయంపై ఆయనకు అవగాహన ఉంది. ఆయనతో కలిసి షూటింగ్ కోసం 12 రోజుల పాటు టర్కీకి వెళ్లాను. ప్రతీరోజూ అశ్విని ఎక్కడ ఉంది అని పిలుచుకొని కూర్చోబెట్టి మాట్లాడడం స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు అయ్యేదే కాదు’’ అని బాలయ్యపై వ్యాఖ్యలు చేసింది ఈ బిగ్ బాస్ బ్యూటీ.


తక్కువ మాట్లాడతారు..


అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరూ’లో మహేశ్ బాబుతో కలిసి నటించింది అశ్విని శ్రీ. అందులో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందనాకు అక్కగా కనిపించింది అశ్విని. ఆ మూవీ విశేషాలను, మహేశ్ బాబుతో కలిసి నటించిన ఎక్స్‌పీరియన్స్‌ను కూడా ఆడియన్స్‌తో షేర్ చేసుకుంది. ‘‘మహేశ్ బాబు.. బాలకృష్ణలాగా కాదు. చాలా తక్కువగా మాట్లాడతారు. బాలకృష్ణ ఏదైనా మాట్లాడతారు, హైపర్‌గా ఉంటారు. కానీ మహేశ్ బాబు మాత్రం నేను ఇప్పుడు ఏం మాట్లాడితే ఏమవుతుందో అన్నట్టుగా ఎప్పుడూ వచ్చాను, నా పని నేను చూసుకున్నాను, వెళ్లిపోయాను అన్నట్టుగా ఉండేవారు’’ అంటూ మహేశ్ బాబు, బాలకృష్ణ ప్రవర్తనను పోలుస్తూ వ్యాఖ్యలు చేసింది అశ్విని.


ఇంటరాక్ట్ అవ్వరు..


‘‘మహేశ్ బాబు చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటారు. ఎక్కువగా మాట్లాడరు. ఆయన చాలా క్లోజ్ మనుషులతో మాత్రమే ఎక్కువగా మాట్లాడతారు. డైరెక్టర్‌తో ఆయన ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం నేను చూడలేదు. ఆయన చాలా సైలెంట్ మనిషి అని నాకు అనిపించింది’’ అని చెప్పుకొచ్చింది అశ్విని శ్రీ. ఒకప్పుడు కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే నటించిన అశ్విని.. బిగ్ బాస్ తర్వాత ఏకంగా సినిమాల్లో హీరోయిన్‌గా ఛాన్సులు కొట్టేస్తోంది. ప్రస్తుతం తను హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామర్ ఫోటోషూట్స్‌తో ఫాలోవర్స్‌ను అలరిస్తూ ఉంటుంది అశ్విని.



Also Read: సింపతీ కోసమే వితిక అబద్దం చెప్పిందా? అప్పుడలా ఎందుకు చెప్పావంటూ నెటిజన్ల నెగిటివ్ కామెంట్స్!