Jabardasth Sowmya Rao: అమ్మ అనారోగ్యంతో మంచం మీద ఉంటే... తండ్రి మరో మహిళతో - స్టేజిపైనే వెక్కివెక్కి ఏడ్చిన 'జబర్దస్త్' సౌమ్య

Sridevi Drama Company : యాంకర్ సౌమ్య శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్లో స్టేజ్ పైనే తన తండ్రి గురించి చెప్పి ఏడ్చింది. తన తల్లి అనారోగ్యంతో ఉంటే, తండ్రి వేరే మహిళతో కనిపించాడని చెప్పి ఎమోషనల్ అయ్యింది.

Continues below advertisement

యాంకర్ సౌమ్య రావు గురించి బుల్లితెర ఆడియన్స్ కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇంతకుముందు 'జబర్దస్త్'లో ఆమె యాంకర్ గా పని చేసిన సంగతి తెలిసిందే. అనసూయ ప్లేస్ ని సౌమ్య రావు రీప్లేస్ చేయలేకపోయింది. ఆమె మాతృభాష కన్నడ కావడంతో తెలుగు సరిగ్గా పలకలేకపోయేది. దీంతో సౌమ్య రావు యాంకరింగ్ పై ట్రోల్స్ రావడంతో, అతి తక్కువ టైంలోనే ఆమెను 'జబర్దస్త్' నుంచి తప్పించారు. అప్పటి నుంచి పలు షోలలో అప్పుడప్పుడు మెరుస్తోంది సౌమ్య రావు. తాజాగా హోలీ సందర్భంగా 'శ్రీదేవి డ్రామా కంపెనీ షో'కు సంబంధించిన కొత్త ప్రోమోని రిలీజ్ చేశారు. అందులో సౌమ్య తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ ఎమోషన్ తో ఆడియన్స్ ని ఏడిపించేసింది.  

Continues below advertisement

తల్లి బెడ్ మీద ఉంటే తండ్రి వేరొకరితో... 

తాజాగా 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకు సంబంధించిన కొత్త ప్రోమోని రిలీజ్ చేశారు. అందులో హోలీ సందర్భంగా ఈ స్పెషల్ ఎపిసోడ్ ని టీవీలో ప్రసారం చేయబోతున్నట్టు చూపించారు. అయితే ఈ ప్రోమోలో యాంకర్ సౌమ్య ఎమోషనల్ అవుతూ కనిపించింది. కాఫీ కప్పు పై తన తల్లి ఉన్న ఫోటోని చూసి వెక్కివెక్కి ఏడ్చింది యాంకర్ సౌమ్య. ఆమె మాట్లాడుతూ "ఇది నా అమ్మ కాదు నా బిడ్డ... మా అమ్మ బాగున్నప్పుడు నా దగ్గర మొబైల్, కెమెరా లాంటివి లేవు. ఆమె మంచం పట్టిన తర్వాత నా దగ్గర మొబైల్, కెమెరా అన్ని ఉన్నాయి. కానీ మంచి ఫోటోలు లేవు" అంటూ కన్నీరు పెట్టుకుంది.

Also Read: ఎవరీ ఐశ్వర్య? స్టార్ మా లేటెస్ట్ సీరియల్ 'భానుమతి'లో విలన్ గురించి తెల్సా... సినిమాల్లోనూ నటించిందండోయ్!

దీంతో యాంకర్ రష్మీ "మీ డాడీ గురించి ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడలేదు" అని అడిగింది. "నాన్న గురించి చెప్పడానికి అంత గొప్పగా ఏం లేదు. అతనేమంత మంచివాడు కాదు. మా అమ్మ బెడ్ మీద ఉంటే, మా నాన్న వేరొక ఆవిడతో ఉన్నారు... అది మా అమ్మ చూశారు" అంటూ బోరున ఏడ్చేసింది సౌమ్య. దీంతో జడ్జి ఇంద్రజ, యాంకర్ రష్మితో పాటు తదితరులు ఆమెను దగ్గర తీసుకుని ఓదార్చారు. ఇక ఇదే ఎపిసోడ్లో హైపర్ ఆది సందడి చేయగా, పండు తన గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేశాడు. 

గతంలోనూ తల్లి గురించి కామెంట్స్ 

ఇదిలా ఉండగా, సౌమ్య తన తల్లి గురించి ఎమోషనల్ కామెంట్స్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆమె తల్లి గురించి వెల్లడించింది. తన తల్లికి తలనొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్తే... బ్రెయిన్ క్యాన్సర్ ఉందని డాక్టర్లు తేల్చారని చెప్పింది. ఆమెకు తను ఎవరో తెలియదని, అంతా మర్చిపోయిందని, అలాంటి కండిషన్లో మూడున్నర ఏళ్లు తన తల్లి బెడ్ మీదే ఉందని ఎమోషనల్ అయింది. అంతేకాకుండా తన తల్లి మళ్ళీ తన కడుపులోనే పుట్టాలని కోరుకుంటున్నాను అని చెప్పింది. ఇక తన తండ్రి కుటుంబ బాధ్యతల్ని గాలికి వదిలేసి, వెళ్లిపోయాడని పలు ఇంటర్వ్యూలలో చెప్పింది. తాజాగా మరోసారి ఆమె తన తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Continues below advertisement