Chinni Serial Today Episode ఏసీపీ విజయ్ కావేరి కేసులో ఎంట్రీ అవుతాడు. స్పందన విజయ్‌తో మీరే నా క్రష్.. ఫ్యూచర్‌ లవర్స్‌కి మనం ఆదర్శంగా ఉండాలి అని బారీ డైలాగ్లు చెప్పడంతో విజయ్ ఇలాగే క్రష్ క్రష్ అని స్పందిస్తే నా టీమ్ నుంచి పుష్ చేసేస్తా అంటాడు. ఇక స్పందన విజయ్‌కి కావేరి కేసు ఫైల్ ఇస్తుంది. మరోవైపు రాజు టీచర్‌ వాళ్లని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. టీచర్‌కి రాజు థ్యాంక్స్ చెప్తే ఉష కస్సుబుస్సులాడుతుంది. 


చిన్న బుక్ కొనుక్కుంటా అని బయటకు వెళ్తుంది. విజయ్ కావేరి ఫైల్స్‌లో కావేరి ఫొటోలు చూస్తూ ఉంటాడు. ఇక రాజు అద్దంలో తను తన భార్య ఉషని చూసిన క్షణం గుర్తు చేసుకొని నవ్వుకుంటాడు. పర్స్‌లో కావేరి, చిన్నిల ఫొటోలు చూసుకుంటూ నువ్వు నన్ను ఎంత అసహ్యించుకున్నా నేను నీకు రక్షణ కవచంలా ఉంటాను మీ తల్లీ కూతుళ్లని ఎవరూ ఏం చేయలేరు అని అనుకుంటాడు. ఇంతలో స్పందన కారు రాజు ఆటోని ఢీ కొడుతుంది. రాజు కోపంగా కిందకి దిగుతాడు. స్పందనతో గొడవ పడి ఆటోని ఢీ కొట్టినందుకు వెయ్యి ఇవ్వమని అంటాడు మేం ఎవరో తెలిస్తే నువ్వే నాకు డబ్బు ఇస్తావని అంటుంది. స్పందన పోలీసులు అని చెప్పేస్తుందని విజయ్ వచ్చి రాజుకి సారీ చెప్పి వెయ్యి ఇస్తాడు. రాజు విజయ్‌తో వద్దు సార్ పెద్ద మనిషిగా మీరు వచ్చి నా తప్పు  లేదనిసారీ చెప్పారు అది చాలు అంటాడు. అయినా విజయ్ డబ్బులు ఇస్తాడు. ఇక విజయ్ స్పందనతో ప్రతీ దానికి స్పందించకు స్పందనలు ఆగిపోతాయ్ అని అంటాడు. 


స్కూల్ దగ్గరకు విజయ్ వచ్చేస్తాడు. బుక్ కొనడానికి వచ్చిన చిన్ని ఇద్దరు ముసలి వాళ్లు బొమ్మలు పట్టుకొని ఒకటి కూడా ఎవరూ కొనడం లేదు నిన్నటి నుంచి తిండి లేదు చచ్చిపోతానే అని మాట్లాడుకోవడం చిన్ని చూస్తుంది. దగ్గరకు వెళ్లి తాత ఏం తినలేదా అని వాటర్ బాటిల్ ఇస్తుంది. ప్లేట్‌లో తన లంచ్ బాక్స్ మొత్తం వేసి ఇస్తుంది. అది విజయ్ చూస్తాడు. చిన్నితో మొత్తం లంచ్ పెట్టేశావు కదా మరి నీకు అని అంటే నాకు నా ఫ్రెండ్స్ ఇస్తారు. మనం ఒకరికి సాయం చేస్తే ఆ దేవుడు మనకి సాయం చేస్తాడని మా అమ్మ చెప్పిందని చిన్న అంటుంది. దాంతో విజయ్ ఇక నుంచి మేం కూడా మీ అమ్మని ఫాలో అవుతామని అంటాడు. చిన్ని వాళ్ల వెనక విజయ్ వెళ్లడంతో నన్ను ఫాలో అవుతున్నారేంటి అని అంటే విజయ్ పీటీ టీచర్‌ అని స్పందన చెప్తుంది. విజయ్ మీ పీటీ టీచర్‌ ఉషని కలవడానికి వచ్చానని విజయ్ అంటే మా టీచర్ చాలా మంచిది అని చిన్ని చెప్తుంది.


విజయ్ ఉష ఉన్న గ్రౌండ్‌కి వెళ్తాడు. ప్రతీ క్షణం టీచర్‌ని పరిశీలిస్తూనే ఉండాలి అని అంటాడు. ఇక ఉషతో పరిచయం చేసుకుంటాడు. మీతో కొంచెం పని ఉందని మాట్లాడాలి అని పక్కకు వెళ్తారు. స్పోర్ట్స్‌ ఫెస్ట్ కండెక్ట్ చేయబోతున్నాం అని దాని పూర్తి బాధ్యతలు డీఈవో తనకి అప్పగించారని తక్కువ టైంలో మీరు ఎక్కువ పేరు తెచ్చుకున్నారు అంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేసుంటారు కాబట్టి మీరు మాకు చాలా ముఖ్యం అని విజిటింగ్ కార్డ్ ఇచ్చి రమ్మని చెప్తాడు. విజిటింగ్ కార్డు మీద ఉష ఫ్రింగర్ ప్రింట్స్ పడేలా పౌడర్ చల్లి కావాలనే స్పందన విజిటింగ్ కార్డు ఇస్తారు. ఉష ఆ విషయం చెప్పడంతో కార్డు మార్చి ఇస్తారు. స్పందన ఓవర్ చేస్తూ భలే దొరికేసింది సార్ అని అంటుంది. దాంతో ఉషకి అనుమానం వస్తుంది. విజయ్ కవర్ చేస్తాడు. కావేరి వెళ్తూ విజయ్‌ని అనుమానంగా చూస్తుంది. ఇక తన చేతికి పౌడర్ అంటుకోవడం గుర్తించి కావేరికి డౌట్ వస్తుంది. ఇక విజయ్ అధికారితో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటాడు. వెనక నుంచి స్కూల్ బస్ వచ్చి ఢీ కొట్టబోయే టైంకి చిన్ని కాపాడుతుంది. దాంతో చిన్నికి విజయ్ థ్యాంక్స్ చెప్తాడు. ఇక విజయ్ జేబులో గన్ చూసి ఉష చెమటలు పట్టేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.   


Also Read: చిన్ని సీరియల్: ఏసీపీ విజయ్ ఎంట్రీ అదుర్స్.. ఆపరేషన్ కావేరి 'గేమ్ స్టార్ట్స్ నౌ'..!