Chinni Serial Today Episode బాలరాజు మహిని ఇంటి దగ్గర నాగవల్లిని చూస్తాడు. మహి తనని పిన్ని అనడంతో రాజు ఎవరని అడిగితే మా అమ్మ వాళ్ల చెల్లి అమెరికాలో ఉంటుంది ఈ మధ్యే వచ్చిందని అంటాడు. ఇక రాజుని తీసుకొని మహి ఇంట్లోకి వెళ్తాడు. ఇంతలో అప్పుడే వచ్చిన దేవాని చూసి మహి వెళ్లి హగ్ చేసుకుంటాడు. మహి పెద్దమ్మ దేవాతో మీ ప్రాణ స్నేహితుడు మహిని తీసుకొని వచ్చాడని చెప్తుంది.
రాజు: హాయ్ దేవా గారు మహి కనిపించలేదని చాలా టెన్షన్ పడ్డారంట కదా. ఎందుకు టెన్షన్ నేను ఉన్నాను కదా. స్నేహధర్మం ప్రకారం నేను చేయాల్సింది చేస్తూనే ఉంటా. ఇప్పటి వరకు దేవా నాకు చాలా చేశాడండీ ఇంక వీడిని ఏం చేయొద్దని చెప్పాను. చేయొద్దని చెప్పిన తర్వాత కూడా చేశాడు అనుకోండి ఏం చేయాలో అది చేస్తాను.
దేవా: ఏంటి ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా. నీ పెళ్లానికి పేరు మార్చి తీసుకొస్తే నేను గుర్తు పట్టలేను అనుకున్నావా.
రాజు: మనసులో వీడికి నిజంగానే తెలిసిపోయిందా.
దేవా: నీ పెళ్లం బతికి ఉందనే ధైర్యంతోనే నువ్వు నాకు ఎదురు పడి వార్నింగ్ ఇస్తున్నావని తెలుసుకోలేకపోతున్నా అనుకున్నావా. నేను నీకు అంత జోకర్‌లా కనిపిస్తున్నానా.
రాజు: అంత కంటే పెద్ద గానే కనిపిస్తున్నావ్. నా భార్యకి ఆ ఉషకి పోలికలు ఉన్నంత మాత్రానా తను నా భార్య అయిపోతుందా. కావేరి చనిపోయిన సంగతి ప్రపంచం మొత్తం తెలుసు. ఆ టీచర్‌కి నాకు ఏం సంబంధం లేదు.
దేవా: లేదా అయితే ఆ టీచర్‌ని చంపేమంటావా
రాజు: చంపుకో అది నీ ఇష్టం కానీ నా జోలికి నా కూతురి జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను. నా కూతురి కోసం వెతుకుతున్నావని తెలిస్తే మాత్రం నిన్ను చంపేస్తా. ఈ లోపు నువ్వు ఎంత మందిని చంపుకుంటావో చంపుకో.
దేవా: రాజు వెళ్లిపోయిన తర్వాత.. ఈ బాలరాజు గాడి వ్యవహారం చూస్తుంటే ఏదో పెద్ద నెట్ వర్క్ చేస్తున్నట్లున్నాడు. తొందరల్లోనే వాడి సంగతి తేల్చేయాలి. అవసరం అయితే ప్రొఫెషనల్స్‌ని దించాలి.
జిమ్‌లో కొంతమంది రౌడీలు ఓ అమ్మాయిని ఏడిపిస్తారు. ఇంతలో (మన బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్) ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ ముసలి వాడి గెటప్‌లో వచ్చి ఆకతాయిల అంతు చూస్తాడు. జిమ్ మొత్తం పరుగెత్తించి కొడతాడు. తన టీమ్ వచ్చి వాళ్లని అరెస్ట్ చేస్తారు. తర్వాత ఏసీపీ విజయ్‌కి కావేరి కేసు అప్పగిస్తారు. హైదరాబాద్‌లో ఫైర్ యాక్సిడెంట్‌లో చనిపోయిన కావేరి ప్రస్తుతం రాజమండ్రిలో పీటీ టీచర్‌గా ఉషలా ఉందని కేసు వివరాలు మొత్తం ఏసీపీ విజయ్‌కి అధికారి చెప్తారు.
చిన్న, చందులు స్కూల్‌కి రెడీ అవుతారు. చిన్ని దిగులుగా చందుతో అమ్మ, రాజు ఈ మధ్య తరచూ గొడవ పడుతున్నారని బాధగా ఉందని వాళ్ల మధ్య గొడవలు తగ్గాలి అంటే ఏం చేయాలో తెలీదు అని చిన్ని అంటే దానికి చందు వాళ్లని దగ్గర చేస్తే గొడవలు దూరం అవుతాయని అంటాడు. ఏం చేద్దాం అనుకొని ఉష స్కూటీ టైర్ గాలి తీసేస్తాడు. టీచర్ మనతో పాటు ఇప్పుడు ఆటో ఎక్కుతారని అంటాడు. ఇక రాజు ఆటో తీసుకొని వస్తాడు. వెళ్దామని చందు అంటే ఈ డొక్కు ఆటోలో రాను అని అంటుంది.రాజు, ఉష గొడవ పడతారు. చిన్ని ఆపి తమతో పాటు ఆటోలో రమ్మని అంటుంది. చిన్న బతిమాలడంతో ఉష సరే అంటుంది. రాజు ఆటోలో అద్దం సర్దుతూ ఉషని చూడటం ఉష చూస్తుంది. మిర్రర్ నా వైపు పెట్టావ్ ఓవర్ చేస్తే మిర్రర్ విరగ్గొడతా అంటుంది. ఇక ఏసీపీ విజయ్ రాజమండ్రి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరుతాడు. విజయ్‌కి తన అసిస్టెంట్ స్పందన కాల్ చేస్తుంది. విజయ్‌తో మాట్లాడుతూ మెలికలు తిరిగిపోతుంది. విజయ్ రావడంతో స్పందన మెలికలు తిరిగుతూ సెల్యూట్ చేస్తుంది. మనం సీక్రెట్ ఆపరేషన్‌లో ఉన్నాం కదా ఇలా సెల్యూట్ చేయొద్దని అంటే సరే సార్ అని మళ్లీ సెల్యూట్ చేస్తుంది. ఇక స్పందన ఓవర్ చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ ఇంట్లో ఆస్తి పంపకాల రచ్చ.. కార్తీక్ నిర్ణయానికి కుస్తీలు పడుతున్న తండ్రి!