Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode శివన్నారాయణ ఇంటికి లాయర్ వీలునామా తీసుకొస్తాడు. శివన్నారాయణ వీలునామా చదవమని అంటాడు. ఆస్తి మొత్తాన్ని దశరథ్, సుమిత్ర, వాళ్ల బిడ్డకు చెందేటట్లు రాయిస్తారు. తన మొదటి భార్య ఆస్తి, బంగారం కూడా దశరథ్, సుమిత్ర బిడ్డకే చెందాలని రాస్తారు. అది విన్న జ్యోత్స్న అంటే మొత్తం దీపకే రాశారా నాకేం లేదా అని షాక్ అయిపోతుంది. రెస్టారెంట్ కూడా ఇంటి వారసురాలకే అని అన్నీ ఆస్తులు కూడా ఇంటి వారసురాలకే అని రాస్తాడు. పారు, జ్యోత్స్నలు బిత్తరపోతారు. దానధర్మాల పేరిట ఆస్తి అమ్ముకునే హక్కు దశరథ్‌కి ఉందని దానికి సుమిత్ర అంగీకారం ఉండాలని అంటాడు.


జ్యోత్స్న: కత్తితో పొడవకుండా చంపేశావ్ తాత. వారసురాలు దీప అని తెలిస్తే నాకే లేనట్లే కదా. 
లాయర్: ఇంకో వీలునామా రాయించారు. అది సీల్ చేసి ఉంది.
శివన్నారాయణ: అది నేను చనిపోయిన తర్వాత మీరు వినాలి.
దశరథ్: నాన్న మీ కంటూ ఏం ఉంచుకోకుండా మొత్తం నాకు రాయడంలో అర్థం ఏంటి.
శివన్నారాయణ: నాకు మీరు ఉన్నారు అనే ధైర్యంతో రాయించాను.
పారు: ఇలా అనుకొనే కదా నాకు గొడ్ల చావిడి రాశావు. రాస్తే రాశావులే వీళ్లకి రాస్తే నా మనవరాలికి రాసినట్లే కదా.
దశరథ్: మీకు నేను ఒక్కదాన్నే కాదు నాన్న కూతురు కూడా ఉంది కదా. తనకు సమానంగా రాయాలి కదా.
పారు: అన్నీ మూట కట్టుకొనే పోయారు కదా. పైగా పుట్టగతులు లేకుండా పోతావ్ అని శపించింది కదా. ఆస్తి మీరు ఇవ్వలేదని కాంచన మీ మీద కేసు పెడితే.
శివన్నారాయణ: ఏం చేయాలో నాకు తెలుసు. ఇది నా ఆస్తి నా ఇష్టం. 
దశరథ్: నా కూతురిని కోడలిని చేసుకోకుండా మా చెల్లి నాకు అన్యాయం చేస్తే నేను ఆస్తి తనకు దక్కకుండా చేసినట్లు అయింది. జనం అలాగే అనుకుంటారు కదా సుమిత్ర. సరే జనం సంగతి పక్కన పెట్టు అలా అని నాకే అనిపిస్తుంది. కానీ నేనేం చేయలేని పరిస్థితి.
సుమన: వదినకు తెలిస్తే బాధ పడుతుంది అండీ. కనీసం గుర్తించలేదని అనుకుంటుంది.
దశరథ్: మనసులో పాపం దాసుకి ఎంతో కొంత ఇవ్వాల్సింది. నాకు తప్ప అందరికీ అన్యాయం జరిగింది. ఇప్పుడు నేను ఎలా సంతోషంగా ఉండగలను. 


ఆస్తిలో తనకు ఏం ఇవ్వలేదని పారు ఏడుస్తుంది. జ్యోత్స్న నా బాధ ఎవరికి చెప్పుకోవాలని అంటుంది. దానికి పారు దశరథ్ కూతురు నువ్వే ఇంటి వారసురాలు నువ్వే నిన్ను ఈ స్థానానికి తీసుకురావడం ఇద్దరిని చంపాను. ఆ స్థానం నిలబెట్టడానికి మరో ఇద్దరిని చంపనా అంటుంది. ఎవరిని చంపుతావని జ్యో అడుగుతుంది. ఇంతలో శ్రీధర్ కాల్ చేయడంతో మాట్లాడుతుంది. మన పని పిడకలు, పేడలే అని నాకు ఆవులు రాశాడు ఆస్తి మొత్తం కొడుకు కోడలికే రాశాడని అంటుంది. పారు ఏడిస్తే శ్రీధర్ గుండె పట్టుకొని కూలబడిపోతాడు. కావేరి డ్యాన్స్‌లు వేస్తుంది. నేను వచ్చి అడుగుతానని శ్రీధర్ అంటే ఎగిరి తంతాడని పారు అంటుంది. నిల్చొని తన్నినా నాకేం ప్రాబ్లమ్ లేదని శ్రీధర్ అంటాడు. నేనేంటో ఇప్పుడు చూస్తారని శ్రీధర్ అనుకుంటాడు. 


కార్తీక్ రెస్టారెంట్‌లో తినివాళ్లకి 5000 క్యాష్‌బ్యాక్ వచ్చేలా చేస్తాడు. దాని కోసం జనం ఎగబడి వస్తారు. మేనేజర్ కార్తీక్‌ని పొగిడితే ఐడియా దీపని అని కార్తీక్ చెప్తాడు. శ్రీధర్ కార్తీక్ దగ్గరకు కాగితాలు తీసుకొని వచ్చి సంతకం పెట్టమని మీ తాత రాసిన ఆస్తి మీకు దక్కాలి అంటే కేసు పెట్టాలి అంటాడు. ఏమైందని కార్తీక్ అడిగితే ఆస్తి మొత్తం దశరథ్, సుమిత్రల పేరున రాశాడని మనవరాలు మాత్రమే వారసురాలా మనవడు కాదా అని అంటాడు. మీ మామయ్య కూడా చెల్లికి వాటా రాయమని అనాలి కదా అనేదేలే అని అంటాడు. వాళ్లంతా ఒకటి అయితే మనం ఒకటి అవుదామని శ్రీధర్ అంటాడు. మాకేం అవసరం లేదని కార్తీక్ అంటాడు. నా తల్లి వద్దు అనుకున్నది నాకు ఏది వద్దు అని తండ్రి అయినా ఆస్తి అయినా వద్దని కార్తీక్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ ఇంట్లో ఆస్తి పంపకాల రచ్చ.. కార్తీక్ నిర్ణయానికి కుస్తీలు పడుతున్న తండ్రి!