Ammayi garu Serial Today Episode రూప రాజుని కలిసి తల్లి అరెస్ట్ గురించి బాధ పడుతుంది. విరూపాక్షి అమ్మగారిని నేను ఎలా అయినా తీసుకొస్తానని రాజు అంటాడు. దానికి రూప తన తండ్రి ప్రెస్ మీట్ పెట్టి అమ్మనే విజయాంబిక అత్తని పొడిచింది అని ఎలక్షన్‌లో అమ్మకి పోటీ చేసే అర్హత లేదని చెప్పనున్నారని చెప్తుంది. అలా చేస్తే అమ్మగారు గెలవలేరు కదా అని రాజు అంటే గెలవడం సంగతి ఉంచు అసలు పోటీనే చేయకుండా అయిపోతుందని రూప అంటుంది.
ఇంటికి వెళ్తే ఏమైనా ఆధారం దొరుకుతుందని రాజు అంటే వెళ్దామని అందరూ హాస్పిటల్‌లో ఉన్నారని రూప అంటుంది. విజయాంబిక ఐసీయూలో ఉంటుంది. ఇక సూర్యప్రతాప్ ప్రెస్ మీట్ పెట్టమని విరూపాక్షి నామినేషన్ కోర్టు రద్దు చేయాలని దీపక్‌తో చెప్పి విజయాంబికను ప్రెస్ మీట్ దగ్గరకు రమ్మని అంటారు. ఇక రూప, రాజులు ఇంటికి వస్తారు. రూప ప్రమాదం ఎలా జరిగిందో చెప్తుంది. విజయాంబికను పొడవాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని అమ్మగారు వచ్చిన సంగతి తెలిసే ఇలాచేశారని రాజు అంటాడు. ఇక రూప ఇంటికి కాస్త దూరంలో దుప్పటి పడి ఉండటం చూస్తుంది. దాన్ని తీసి రాత్రి అత్తయ్యని పొడిచిన వాడు కప్పుకున్నాడని ఇది మన ఇంట్లోని దుప్పటే అంటాడు. ఇక ఆ బెడ్ షీట్‌లోనే దీపక్ కడియం దొరుకుతుంది. ఇద్దరూ చూసి షాక్ అయిపోతారు. దీపకే తల్లిని పొడిచాడని అనుకుంటారు. అమ్మగారిని ఇరికించడానికే ఇలా చేశాడని అనుకుంటారు. ప్రెస్ మీట్ కంటే ముందే ఈ విషయం చెప్పాలని రాజు, రూపలు బయల్దేరుతారు.
సూర్యప్రతాప్ ప్రెస్ మీట్ పెడతాడు. తన అక్కని ఈ పరిస్థితికి కారణం అయిన వారిని వదలను అంటాడు. తన అక్కని పొడిచిన హంతకురాలు అప్పుడే అడ్డంగా దొరికిపోయిందని.. ఎలక్షన్‌లో తన అక్క గెలుస్తుంది అనే భయంతో అడ్డు తొలగించుకోవాలి విరూపాక్షి ప్రయత్నించిందని సూర్యప్రతాప్ అంటాడు. విరూపాక్షి మీ భార్యే కదా అని మీడియా అంటే అది పాతికేళ్ల క్రితం మాటని ఇప్పుడు తను ఎవరో అంటాడు. ఇక తన అక్కని పొడిచిన వారికి ఎన్నికల్లో నిల్చొనే హక్కే లేదని అంటాడు. నేరాన్ని ప్రామాణికంగా తీసుకొని విరూపాక్షి పోటీలో పాల్గొకుండా చేయాలని ఎన్నికల కమీషన్‌కి కోరుతున్నా అని చెప్పబోయే లోపు రాజు, రూపలు వచ్చి ఆపుతారు.
విజయాంబికను విరూపాక్షి పొడవలేదని దీపక్ పొడిచాడని ఇద్దరూ చెప్తారు. అందరూ షాక్ అయిపోతారు. నా తల్లిని నేను ఎందుకు చంపుతాను అని దీపక్ అంటాడు. దాంతో రాజు బెడ్ షీట్ చూపిస్తాడు. కడియం కూడా చూపిస్తాడు. దీపక్ షాక్ అయిపోతాడు. దీపక్ కడియం అని చెప్తారు. దాంతో దీపక్ కడియం తనదే కానీ రాత్రి నుంచి కనిపించడం లేదని తనని ఇరికించాలని రూపే కడియం దొంగతనం చేసి విరూపాక్షిని కాపాడాలని ఇలా చేసిందని అంటాడు. ఇక మందారం దీపక్ చంపి ఉంటే విరూపాక్షి గారు ఎందుకు వచ్చారని అడుగుతుంది. దాంతో రూప ప్రచారంలో మీరు పడిపోయారు అని వచ్చిందని అంటుంది. అక్కడ మూడో మనిషే లేరని విజయాంబిక అంటుంది. ఇక రాజు దీపక్ సీసీ కెమెరాలు ఆపే వీడియో చూపిస్తాడు. సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు. దీపక్ దొరికిపోయాను అనుకుంటాడు. సీసీ కెమెరా ఆఫ్ చేసి తప్పించుకోలేకపోయాడని రాజు అంటాడు. అమ్మగారు గెలుస్తారనే భయంతో ఇలా చేశారని రాజు అంటాడు.
సూర్యప్రతాప్ దీపక్‌ని లాగి పెట్టి కొడతాడు. నువ్వేంట్రా ఇంత నీచానికి దిగజారావు అని తిడతారు. చంద్ర కూడా దీపక్‌ని తిడతాడు. సూర్య దగ్గరుండి దీపక్‌ని పోలీసులకు పట్టిస్తాడు. విజయాంబిక అరెస్ట్ చేయొద్దని అవసరం అయితే పోటీ నుంచి తప్పుకుంటానని అంటుంది. వాడి కోసం నువ్వు తప్పు కోవడం ఎందుకు అని అంటుంది. ఇక రాజు సూర్యతో అమ్మగారు తప్పు చేశారని హంతకురాలని అన్నారు ఆవిడకేం సంబంధం లేదని చెప్పమంటాడు. సూర్య చెప్పి ఆవిడను విడిపించమని అంటాడు. పోలీసులు విరూపాక్షికి క్షమాపణ చెప్తారు. పెద్దయ్యగారే మిమల్ని విడిపించమని చెప్పారని రాజు చెప్తాడు. విరూపాక్షి దీపక్ దగ్గరకు వెళ్లి లాగిపెట్టి కొడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ ఇంట్లో ఆస్తి పంపకాల రచ్చ.. కార్తీక్ నిర్ణయానికి కుస్తీలు పడుతున్న తండ్రి!