Ennallo Vechina Hrudayam Serial Today Episode త్రిపుర, గాయత్రీలు ఇళ్లు అమ్మి తీసుకొచ్చిన డబ్బుని రత్నమాల తీసుకుంటుంది. అందరూ డబ్బు అడిగితే మీ డబ్బు గుర్తుంటుంది కానీ నా డబ్బు గుర్తొండదా.. మీ పెద్ద కొడుకు నా దగ్గర మూటలు మూటలు తీసుకున్నాడు. నీ ఇద్దరు కోడళ్లు కూడా నాడబ్బు తీసుకున్నారని అంటుంది. ఆ డబ్బుని తాను జమ చేస్తున్నానని అంటుంది. అది తన తల్లిని గల్ఫ్ నుంచి విడిపించడానికి తీసుకొచ్చిన డబ్బు అని ఇవ్వమని బతిమాలుతుంది. పెళ్లి కొడుకు అయిన నా కొడుకుని జైలుకి పంపారు మిమల్ని ప్రశాంతంగా ఉండనివ్వను అని అంటుంది. త్రిపుర ఎంత బతిమాలినా ఇవ్వను అని అంటుంది. ఇక ఇంట్లో ఉన్న సామాను అంతా తన మనుషులతో బయట పడేస్తుంది. మా ఇంట్లో సామాను మీరు పడేస్తున్నారేంటి వదినా అని రమాప్రభ అడిగితే మీ ఇళ్లు నేను కొనేశానని రత్నమాల చెప్తుంది. మేం నీకు అమ్మలేదని గాయత్రీ అంటే గాయత్రీ, త్రిపురలు ఇళ్లు అమ్మిన వ్యక్తిని తానే పంపానని ఆ డబ్బు తనదే అని అంటుంది.
త్రిపుర డబ్బు ఇవ్వమని బతిమాలుతుంది. ఇవ్వను అని నా కొడుకుని జైలు పాలు చేసిన మిమల్ని వదలను అని అంటుంది. త్రిపుర అత్త కాళ్లా వేళ్లా పడుతుంది. అయినా రత్నమాల కనికరించదు. గాయత్రీ అక్కని వద్దని అమ్మని విడిపించడానికి డబ్బు పోగేస్తామని అంటుంది. ఇక ఊర్వశి అత్తతో గాయత్రీ చేసిన పనికి మమల్ని ఇబ్బంది పెట్టడం ఏంటి అని అంటే నేను తప్పు చేయలేదని క్రిమినల్‌కి శిక్ష పడేలా చేశానని అంటుంది. ఎవరు ఎంత బతిమాలినా రత్నమాల కనికరించకుండా సామానుకి నిప్పు పెట్టేస్తుంది. ఆ నిప్పులో ఊర్వశి అనంత్‌కి సంబంధించిన ఫైల్స్ కాల్చేస్తుంది. అందులో త్రిపుర తండ్రికి బాల ఇవ్వాల్సిన ఫైల్‌తో పాటు చెక్ కూడా ఉంటుంది.
మరోవైపు ఫైల్ కనిపించలేదని అనంత్ అన్నయ్య బాలరాజుతో చెప్తాడు. పాండురంగారావుగారికి డబ్బు ఇస్తానని మాట ఇచ్చానని బాల అంటాడు. ఇక కొంత సామాను పట్టుకొని త్రిపుర ఫ్యామిలీ మొత్తం ఓ చెట్టు కిందకి చేరుతారు. రమాప్రభ త్రిపుర, గాయత్రీలను దెప్పిపొడుస్తుంది. ఇళ్లు ఎక్కడ వెతుకుతారు అడ్వాన్స్ ఎలా తీసుకొస్తారు అని అంటుంది. ఇక త్రిపుర, గాయత్రీలు సాయం కోసం తన స్కూల్ దగ్గరకు వెళ్తారు. స్కూల్ మాస్టారుతో మాట్లాడుతారు. త్రిపుర మాస్టారుకి డబ్బు అడుగుతుంది. దాంతో మాస్టారు సారీ అమ్మ నిన్ను స్కూల్‌లో ఉద్యోగంలో నుంచి తీసేశారని మ్యానేజ్‌మెంట్ మీ అత్తని డైరెక్టర్‌గా తీసుకున్నారని ఆవిడ తన పలుకుబడితో నిన్ను ఉద్యోగంలో తీసేశారని చెప్తారు. త్రిపుర ఏడుస్తుంది. స్కూల్ దగ్గరకు రత్నమాల వచ్చి ఏమైంది నా బంగారు కోడలా ఏడుస్తున్నావ్ అని అంటుంది. దాంతో గాయత్రీ నువ్వే మా అక్క కోడలు తీయించాశావా అంటే నీది కూడా పోయిందని అంటుంది. మీ అన్నయ్య ఉద్యోగం కూడా తీయించేశానని ఇంకెక్కడా మీకు ఉద్యోగం రాకుండా చేశానని చెప్తుంది. మీరంతా నాఇంటి దగ్గరే బానిసగా ఉండే అవకాశం ఇస్తున్నా అని అందరూ తట్టాబుట్టా తీసుకొని వచ్చేయండి అని అంటుంది.
అనంత్ డల్‌గా ఉండటంతో బాల, అమ్మ, బామ్మ ప్రశ్నిస్తారు. ఫైల్ కనిపించడం లేదని గిల్టీగా ఉందని అనంత్ కవర్ చేస్తాడు. దాంతో బాల దానికి అంత టెన్సన్ ఎందుకు మన ఆఫీస్‌లో ఫైల్ చూసి మళ్లీ ప్రాసెస్ చేద్దామని అంటాడు. ఇక అందరూ సిటీకి బయల్దేరుతారు. గాయత్రీ అనంత్ కోసం తన ఇంటికి వచ్చి అడిగితే పట్నం వెళ్లారని పని మనిషి చెప్తుంది. గాయత్రీ అనంత్ కారు వెనక పరుగులు తీస్తుంది. అనంత్ అద్దంలో గాయత్రీని చూసి కూడా పట్టించుకోకుండా స్పీడ్‌గా వెళ్లిపోతాడు. గాయత్రీ రోడ్డు మీద కుప్పకూలి ఏడిస్తూ సిటీ వాళ్లని నమ్మొద్దని చెప్పినా ప్రేమించాను నన్ను మోసం చేసి అనంత్ వెళ్లిపోతున్నాడని అనుకొని అనంత్ ప్రపోజ్ చేసి పెట్టిన రింగ్ తీసేయడానికి ప్రయత్నిస్తుంది కానీ అది రాకపోవడంతో ఏడుస్తుంది. ఇక బాల గతంలో త్రిపుర తనని కాపాడిన కొండ ప్రాంతం చూసి కాసేపు వెళ్లి వస్తానని కారు ఆపిస్తాడు. త్రిపుర కూడా అక్కడే ఉంటుంది. త్రిపుర కొండ చివర నిల్చొని బాధ పడుతుంటే బాల ఏయ్ అక్కడేం చేస్తున్నావ్ అని అరుస్తాడు. దాంతో త్రిపుర కంగారులో కొండ మీద నుంచి జారిపోతుంది. బాల వెళ్లిపట్టుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ ఇంట్లో ఆస్తి పంపకాల రచ్చ.. కార్తీక్ నిర్ణయానికి కుస్తీలు పడుతున్న తండ్రి!