Nuvvunte Naa Jathaga Serial Today Episode కాంతం మెట్లెలు క్లీన్ చేసుకుంటుంటే రంగ వచ్చి జాగ్రత్తగా దాచుకో ఎవరైనా దొంగతనం చేస్తారని దేవాని ఉద్దేశించి అంటాడు. కాంతం కూడా అలాగే అంటుంది. దాంతో మిధున వాళ్లిద్దరితో నా భర్త నా బంగారం తీసుకుంటే మీ బంగారం తీసుకున్నట్లు దొంగ అని మాట్లాడుతారేంటి అని తిడుతుంది. తన భర్తని దొంగ అంటే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో ఇంటికి భార్గవి దేవా కోసం వస్తుంది. సత్యమూర్తి, శారదని పలకరిస్తుంది.
భార్గవి: అన్నయ్యకి గాజులు ఇవ్వడానికి వచ్చాను.ఆనంద్: ఆ గాజులు ఎవరివి అమ్మాయ్ అసలు దేవాకి ఎందుకు ఇవ్వడానికి వచ్చావ్. భార్గవి: వీటిని నాకు దేవా అన్నయ్య ఇచ్చాడు. ఇవి మీవి కావా.శారద: మిధున ఇవేనా నీ గాజులు.మిధున: అవును అత్తయ్య. భార్గవి: ఈ విషయం గురించి మీకు అన్నయ్య ఏం చెప్పలేదా. మా అమ్మకి సడెన్‌గా గుండెపోటు వచ్చింది పిన్ని ఆపరేషన్‌కి పది లక్షలు కావాలన్నారు. మా చుట్టాలు ఎవరూ సాయం చేయలేదు. దేవా అన్నయ్యని అడిగితే హాస్పిటల్‌కి వచ్చి డబ్బు ఇచ్చి ఈ గాజులు తాకట్టు పెట్టమన్నారు. అన్నయ్య టైంకి వీటిని ఇవ్వడంతో మా అమ్మ బతికింది. చిట్టీ పాడాను పిన్నీ ఆ డబ్బుతో వీటిని తీసుకొచ్చాను. దేవా అన్నయ్య మా అమ్మని కాపాడిన దేవుడు. దేవా రావడంతో భార్గవి థ్యాంక్స్ చెప్పి గాజులు దేవాకి ఇస్తుంది.దేవా: ఈ గాజులు అక్కడుంది చూడు ఆవిడవి టైంకి ఆవిడే నీకు గాజులు ఇచ్చింది ఆవిడకు ఇచ్చేయ్. ఆనంద్, ప్రమోదిని తప్పుగా అర్థం చేసుకున్నాం అని దేవాకి సారీ చెప్పారు. పర్లేదు లే వదిన అయినా నన్నుఅర్థం చేసుకునే వాళ్లు ఎవరూ లేరులే. అని వెళ్లిపోతాడు.మిధున: భార్గవి మిధునకు థ్యాంక్స్ చెప్పి కాళ్ల మీద పడుతుంది. గాజులు తిరిగి ఇస్తే మిధున అవసరానికి ఉపయోగపడతాయి ఉంచుకో అని చెప్తుంది. టైంకి ఇచ్చింది మీ అన్నయ్య కాబట్టి ఆ పుణ్యం ఆయనకే దక్కాలి ఇక నుంచి నీకు ఏ అవసరం వచ్చినా నాకు అడుగుతాను అంటే ఈ గాజులు తీసుకుంటా.భార్గవి: సరే వదిన. వదినా మీగొప్ప మనసుకి తగ్గట్టు దేవా లాంటి గొప్ప భర్త దొరికాడు. మీ ఇద్దరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి.మిధున: మా ఆయన ఎప్పుడూ తప్పు చేయరు అన్నాను కదా ఆయన ఓ ప్రాణం కాపాడారు మరి ఇప్పుడేమంటారు.కాంతం: ఏమంటామ్ మా మరిది గారు మంచివాళ్ల అయ్యారు మామయ్య గారు చెడ్డ వాళ్లు అయ్యారు.సత్యమూర్తి: చెప్పకుండా తీసుకెళ్లిన వాళ్లని దొంగ అంటారు. మీ రౌడీ మంచి వాడు అవ్వడు. చెడ్డ వాళ్లు చేసిన సాయం కూడా పాపమే.
భాను పెళ్లి చూపులకు రెడీ అవుతుంది. దేవా మీద కోపంతో పెళ్లికి ఒప్పుకుంటున్నానని అనుకుంటుంది. ఇక పెళ్లి గొడుకు గొప్ప వాడని భానుతో తల్లి పొగుడుతుంది. తీరా ఆ పెళ్లి కొడుకు పరమ బేవర్స్ గాడు. ఇప్పటికే తొమ్మిది పెళ్లిళ్లు చేసుకున్నాడు. వాళ్లతో ఎంజాయ్ చేసిన తర్వాత అమ్మేస్తుంటాడు. భాను గురించి కూడా అలాగే అనుకుంటాడు. మరోవైపు దేవా ఎటు వెళ్తే అటు మిధున వెళ్తుంది. నీ గాజులు నీకు వచ్చేశాయి కదా ఇంకా చంపేసేలా చూస్తున్నావ్ ఏంటి అని దేవా అంటే మిధున మాట్లాడకుంటా దేవాని కొడుతుంది. ఈ రౌడీయిజం ఏంటే అని దేవా అడుగుతాడు. ఇంత మంచి వాడివి ఎందుకు రౌడీలా అయిపోయావ్ ఎందుకు ఇంట్లో వాళ్లకి బాధ పెడుతున్నావ్ అని అడుగుతుంది. నీ సాయం నాకు చెప్పుంటే నేను సాయం చేసేదాన్ని కదా అంటే నాకు అలాంటి అలవాటు లేదు అని దేవా అంటాడు. ఇంత మంచోడివి ఎందుకు మాటలు పడతావ్ అంటే నా క్యారెక్టర్ ఇంతే నువ్వెళ్లి పని చూసుకో అంటే మిధున భర్తని లాగేసి వాయించేస్తుంది. నువ్వు ఇలా ఎన్ని డ్రామాలు వేసినా నేను నీకు పడను అని దేవా వెళ్లిపోతాడు.
భానుని చూసుకోవడానికి పెళ్లి వాళ్లు వస్తారు. భాను అబ్బాయిని కూడా చూడకుండా పెళ్లికి ఓకే చెప్తుంది. ఇక రేపే పెళ్లి అని నిశ్చియ తాంబూలాలు మార్చుకుంటుండగా దేవా వాటిని విసిరేస్తాడు. భాను చాలా సంతోషపడుతుంది. భాను తల్లి వచ్చి ఎందుకు పెళ్లి చెడగొడుతున్నావ్ అని అడిగితే వాడో పెద్ద వెదవ నిత్య పెళ్లి కొడుకు అని చెప్తాడు. కావాలనే పెళ్లి ఆపుతున్నావని భాను తల్లి అంటే దేవా పెళ్లి కొడుకుని చితక్కొట్టి వీడు మంచోడా అని వాడిని వాయించి గెంటేస్తాడు. ఇలాంటి వెదకకి ఇచ్చి పెళ్లి చేయకుండా మంచి వాడిని ఒకటికి పది సార్లు ఆలోచించి వెతికి పెళ్లి చేయండి అని భాను ఒట్టి అమాయకురాలు అని తన జీవితం నాశనం చేయాలి అని చూస్తే నేను ఊరుకోను అని భాను తల్లికి చెప్పి వెళ్తాడు. మరోవైపు మిధున స్టోర్ రూంకి వెళ్లి దేవా సర్టిఫికేట్స్ చూసి షాక్ అయిపోతుంది. దేవా మెరిట్ స్టూడెంట్‌నా అని షాక్ అయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ ఇంట్లో ఆస్తి పంపకాల రచ్చ.. కార్తీక్ నిర్ణయానికి కుస్తీలు పడుతున్న తండ్రి!