Chinni Serial Today Episode బిగ్‌బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్, కావ్య ప్రేమించుకొని విడిపోయారని అందరకీ తెలిసిందే. ప్రస్తుతం బుల్లితెర మొత్తం ఈ ఇద్దరే హాట్‌టాపిక్. నమ్మించి మోసం చేశారు. ఇక ఎప్పటికీ వాళ్లని ప్రేమించను ఇలా చాలా షోలలో కావ్య నిఖిల్ గురించి ఇన్ డైరెక్ట్‌గా మాట్లాడింది. ఈ తరుణంలో కావ్య లీడ్ రోల్‌లో నటిస్తున్న చిన్నీ సీరియల్‌లో తన మాజీ లవర్ ఎంట్రీ ఇచ్చాడు. దాంతో నిఖిల్ కావ్యల అభిమానులు ఇద్దరూ కలిసిపోయారని సంబర పడుతున్నారు. ఇక ఈ రోజు సీరియల్‌లో నిఖిల్ ఎంట్రీ ఉందా లేదా తెలియాలి అంటే అసలు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
కావేరి మీద కన్నేసి తన అక్కని చంపేసిన దేవ పీటీ ఉషగా ఉన్న కావేరిని చూస్తాడు. కావేరిని కిడ్నాప్ చేయమని తన మనుషుల్ని పంపిస్తాడు. కిడ్నాప్ చేసి దేవా దగ్గరకు తీసుకెళ్లగా అక్కడ కావేరి ఉండాల్సిన ప్లేస్‌లో నాగవల్లి కిడ్నాప్ అయింటుంది. చేతిలో హ్యాకీ బ్యాట్ పట్టుకొని పీటీ ఉష ఎంట్రీ ఇచ్చి నేను ఉండాల్సిన ప్లేస్‌లో నాగవల్లి ఉందని షాక్ అయ్యావా దేవా అని తను తప్పించుకొని నాగవల్లిని ఆ మూటలో కట్టిన సంగతి చెప్తుంది. దేవా, నాగవల్లి షాక్ అవుతారు. స్పోర్ట్స్ కోటాలో వచ్చా నాతో గేమ్స్ వద్దని అంటుంది. కావేరి కావేరి అంటూ నా వెంట పడి నన్ను ఇబ్బంది పడితే పోలీస్‌లకు పట్టిస్తా అని ఇద్దరికీ వార్నింగ్ ఇస్తుంది.
నాగవల్లి: బావ ఇప్పటికైనా నమ్ముతావా తను కావేరి కాదు ఉష అని. మనం అంటే భయంతో వణికిపోయే కావేరికి మనల్ని భయంతో వణికించే ఈ ఉషకి ఎంత తేడా ఉందో చూశావా. ఇక తను కావేరి అని నీ మనసు నుంచి తీసేయ్. అవును బావ నాకు ఓ డౌట్ అది నిజంగా కావేరి అయితే నువ్వు దాన్ని చంపాలి అనుకోవడం ఏంటి. నీ చేతిలో గన్ ఏంటి. ఏంటో సాఫ్ట్‌గా ఉండే నువ్వు ఇలా ఏంటి.
దేవా: మనసులో ఇదేంటి ఇలా దొరికిపోయాను.
నాగవల్లి: చీమని దోమని చంపడానికి భయపడే నువ్వు ఇలా ఒక మనిషిని చంపడానికి రెడీ అయిపోయావు అంటే నమ్మలేకపోతున్నా.
దేవా: నాగవల్లి ఇదంతా నేను నీ కోసమే చేస్తున్నా నువ్వు కావేరిని చంపాను అన్నావు. ఒక వేళ కావేరి బతికి ఉంటే నువ్వు జైలుకి వెళ్లిపోతావ్ కదా. ఆ కావేరి వల్ల మీ అక్కని దూరం చేసుకున్నా మళ్లీ ఇప్పుడు అదే కావేరి వల్ల నిన్ను దూరం చేసుకోవడానికి రెడీగా లేను నాగవల్లి అందుకే దాన్ని చంపేయాలి అనుకున్నా.
నాగవల్లి: నా కోసం ఒక మనిషిని చంపడానికి రెడీ అయ్యావు అంటే నేను అంటే ఎంత ప్రేమ బావ నా కోసం అయినా నవ్వు ఇలా చేయొద్దు. ఈ ఉష సంగతి నేను చూసుకుంటా.
దేవా: నీ ముందు మంచి వాడిని కావడానికి దాన్ని వదిలేశా కానీ దాన్ని నేను ఎందుకు వదలుతాను. అస్సలు వదలను.
మరోవైపు పోలీసులు కావేరి ఫోటోలు ముందు వేసుకొని ఫైర్ యాక్సిడెంట్‌లో చనిపోయిన ఖైదీ ఇలా హాకీ స్టిక్ పట్టుకొని ఫొటోలు పట్టుకోవడం ఏంటి అని మాట్లాడుకుంటారు. సాక్ష్యాలతో సహా కావేరి, ఉష వేరు వేరని మరో పోలీస్ ఫైల్ చూపిస్తారు. చనిపోయిన వారు బతికినట్లు బతికిన వారు చనిపోయినట్లు మార్చే సొసైటీలో ఉన్నామని తను కావేరినా ఉషనో సీక్రెట్‌గా ఇన్వెస్ట్ చేయడానికి ఏసీపీ విజయ్‌ని రంగంలోకి దించాలని అనుకుంటారు. మరోవైపు చిన్ని చందులో ఉష టీచర్ కనిపించడం లేదని కంగారు పడుతుంది. ఇంతలో ఉష రావడంతో అమ్మా అమ్మా అని వెళ్లి హగ్ చేసుకుంటుంది. అమ్మ అనొద్దు టీచరమ్మ అనమని ఉష చెప్తుంది.
ఇక ఇంట్లోకి వెళ్లి తన ఆంటీని హగ్ చేసుకొని ఏడుస్తూ నేను నా కూతురికి దూరం అయిపోతానేమో అని భయంగా ఉందని తనని చంపడానికి ప్రయత్నించాడని అంటుంది. తన శ్రేయాభిలాషి అయిన రాజుకి కాల్ చేస్తుంది. (రాజు కావేరి భర్త కానీ కావేరికి ఆ విషయం తెలీదు) తన శ్రేయాభిలాషికి జరిగింది అంతా చెప్తుంది. మిమల్ని కిడ్నాప్ చేసి వాడి గొయ్యి వాడే తవ్వుకున్నాడని మీరు ధైర్యంగా ఉండండి అని అంటాడు. మీరే నా ధైర్యం అని మీరు చెప్పినట్లు ఉషగా మారాని అని ఇప్పుడు భయంగా ఉందని అంటే రాజు కావేరికి ధైర్యం చెప్తాడు. దేవాకి తాను బుద్ధి చెప్తానని నేను బతికి ఉండే వరకు మిమల్ని మీ కూతుర్ని కలిసే ఉంచుతానని అంటాడు. తన భార్యబిడ్డల జోలికి వచ్చినందుకు దేవా చాప్టర్ క్లోజ్ చేయాలని రాజు అనుకుంటాడు.
మరోవైపు మహి కనిపించడం లేదని దేవా టెన్షన్ పడతాడు. నాగవల్లి, ఆమె పెద్ద అక్క ఏం కాదని అంటారు. దేవా మహి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాడు. బాలరాజు కిడ్నాప్ చేశాడేమో అనుకుంటాడు. ఇంతలో బాల దేవాని కలుస్తాడు. ఇద్దరూ మాట్లాడుతారు. నువ్వు ఒక్కడివే వచ్చావేంటి అంటే డ్రైవర్లు అందరూ మానేశారు అని అంటాడు. దాంతో దేవా చెప్పడం వల్లే మానేశారని రాజు దగ్గర ఉన్న వ్యక్తి అనుకుంటాడు. ఇక రాజు మహిని తీసుకొని ఇంటికి బయల్దేరుతాడు. మరోవైపు రాజుకి తన ఫ్రెండ్ కాల్ చేసి రాజు చెప్పిన లోకేషన్ దొరికిందని అంటాడు. రాజు అటు వెళ్తాడు. చిన్నికి యాక్సిడెంట్ చేసిన వాడు దొరికితే వాడి పని అయిపోతుందని అనుకుంటాడు. ఇక మహి రాజుతో పని ఉందని మా ఇంటి వైపు వచ్చారని అంటాడు. ఇక రాజుకి దేవా మీద అనుమానం వచ్చి వెంకట్‌కి కాల్ చేసి ఓనర్ పేరు అడిగితే దేవేంద్ర వర్మ అని చెప్పడతో షాక్ అవుతాడు. అప్పుడే ఆ కారు తీసుకొని నాగవల్ల రావడం చూసి షాక్ అవుతాడు. మహి దేవాని పిన్ని అని పిలవడంతో ఎవరు అని అడుగుతాడు. మా అమ్మ చెల్లి యూఎస్‌లో ఉంటుందని రాజుతో మహి చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.